'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే.... - Oneindia Telugu

భువనగిరి: స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిను పోలీసులు ముందే అదుపులోకి తీసుకుంటే తన కొడుకు నరేష్, స్వాతిలు బతికేవారని మృతుడు నరేష్ తండ్రి వెంకటయ్య కన్నీరుమున్నీరు అయ్యారు. తనకు కనీసం తన కొడకు చివరి చూపు కూడా దక్కలేదన్నారు. నరేష్‌ను, స్వాతిని హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని వెంకటయ్య డిమాండ్ చేశారు. ఊహించిందే ...

తక్కువ కులంవోడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడనీ.. రాడ్‌తో కొట్టి చంపి.. ఎముకలు ... - వెబ్ దునియా

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 20 రోజులుగా యాదాద్రిభువనగిరి జిల్లాలో కలకలం రేపుతున్న కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేష్‌(24), తుమ్మల స్వాతి(22) ప్రేమజంట వ్యవహారంలో నరేష్‌ అదృశ్యంపై మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన కుమార్తె ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పథకం ప్రకారం ...

స్వాతిది ఆత్మహత్య కాదా? హత్యేనా? - Samayam Telugu

స్వాతి-నరేష్‌ల ప్రేమకథను... వారి విషాదాంతాన్ని... యాదాద్రి-భువనగిరి జిల్లా అంత త్వరగా మర్చిపోదు. ప్రేమించుకున్న పాపానికి ఇద్దరూ పాతికేళ్లలోపే అసువులు బాశారు. స్వాతి ఆత్మహత్య చేసుకుందని చెబుతుండగా, నరేష్ పరువు హత్యకు గురయ్యాడు. వారి ప్రేమ పెళ్లి నెల రోజులకే విషాదంగా ముగిసిపోయింది. కాగా ఇప్పుడు స్వాతి ఆత్మహత్యపై పలు ...

'స్వాతి తండ్రికి ఉరిశిక్ష విధించాలి' - Mana Telangana (బ్లాగు)

హైదరాబాద్: పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకును శ్రీనివాస్ రెడ్డి హత్య చేశాడని నరేశ్ తండ్రి వెంకటయ్య ఆరోపణలు చేశాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డిని ముందే అదుపులోకి తీసుకుని ఉంటే నరేశ్, స్వాతి ఇద్దరూ బతికే వారని పేర్కొన్నాడు. కనీసం తన కొడుకు చివరి చూపు కూడా దక్కలేదని ఏడుస్తు చెప్పాడు. శ్రీనివాస్ రెడ్డికి ...

శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలి - ఆంధ్రజ్యోతి

ఆత్మకూరు(ఎం)(యాదాద్రి): ఆత్మకూరు(ఎం) మండలం పలెర్లలో ప్రేమజంట హత్య మిస్టరీ విషాదాన్ని మిగిల్చింది. తన కుమారుడు నరేష్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలని అతని తల్లిదండ్రులు ఇందిరమ్మ, వెంకటయ్య డిమాండ్‌ చేశారు. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. నాకొడుకు ఏం నేరం ...

నరేష్-స్వాతి కేసులో చిక్కుముడులు: తెల్లచొక్కా వ్యక్తి ఎవరు, ఆ వీడియో స్వాతిదేనా? - Oneindia Telugu

భువనగిరి: కులాంతర వివాహం చేసుకొన్న స్వాతి, నరేష్ ప్రేమ విషాదంగా ముగిసింది.స్వాతి ఆత్మహత్య చేసుకోగా, నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చంపేశాడని పోలీసులు నిర్ధారించారు.అయితే ఈ కేసులో ఇంకా చిక్కుముడులున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 25వ, తేదిన నరేష్, స్వాతి ముంబైలో వివాహం చేసుకొన్నారు. కులాంతర వివాహం ...

ప్రేమపై పరువు పగ! - Namasthe Telangana

హైదరాబాద్ సిటీబ్యూరో, యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఊహించిందే నిజమైంది.. తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు చేసిన ఆరోపణలే వాస్తవమని తేటతెల్లమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాతి, నరేశ్‌ల ప్రేమవివాహం కులం, పరువు కారణాలతో చివరకు విషాదాంతంగా ముగిసింది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి నరేశ్‌ను హత్య చేసి ...

ఆమె తండ్రే హంతకుడు - ఆంధ్రజ్యోతి

యాదాద్రి, హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): కూతురు ఇష్టం లేని పెళ్లిచేసుకుందనే ఆగ్రహంతో ఆమెను మళ్లీ తమ గడప తొక్కనీయని తల్లిదండ్రులను చూస్తున్నాం. ఆగ్రహం చల్లారాక.. కూతురు సంతోషమే తమ సంతోషం అని సర్దుకుపోతున్న తల్లిదండ్రులనూ చూస్తున్నాం. కానీ ఓ తండ్రి కన్నకూతురి 'ప్రేమ'నే మసిచేశాడు. ప్రేమించి పెళ్లాడిన భర్తే తన సర్వస్వం అనుకున్న ...

ప్రేమపెళ్లి విషాదాంతం - Mana Telangana (బ్లాగు)

హైదరాబాద్ సిటీబ్యూరో: అంద రూ ఊహించినట్లే భువనగిరిలో అదృశ్యమైన నరేష్ ను (25) దారుణంగా చంపేశారు. ప్రేమ వివాహం చేసుకున్న నరేష్ తన భార్య స్వాతితో కలిసి ఈనెల 2న ముంబయి నుంచి భువనగిరికి వచ్చి కనిపించక పోవడంతో అతని తండ్రి వెంకటయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగ వత్ ...

కులం తక్కువని చంపేశారు - ప్రజాశక్తి

నరేష్‌-స్వాతి ప్రేమ, పెళ్ళి వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే నరేష్‌ను హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులుగా అతన్ని విచారించకపోవడంపై స్థానిక పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఇప్పుడు స్వాతి ఆత్మహత్యపైనా పలు అనుమానాలొస్తున్నాయి. ఆమెను కూడా హత్య చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మామే నరేష్ హంతకుడు! - T News (పత్రికా ప్రకటన)

ఈ నెల 2న భువనగిరిలో మిస్సయిన అంబోజు నరేష్ కేసుని రాచకొండ పోలీసులు ఛేదించారు. నరేష్ మామ శ్రీనివాసరెడ్డి అతన్ని చంపినట్టు ఒప్పుకున్నాడని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ముందు నుంచి శ్రీనివాసరెడ్డిపై అనుమానం ఉందని, విచారణలో ఇది రుజువయ్యిందని చెప్పారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఆయన విలేకరులకు కేసు విచారణ వివరాలు ...

నరేష్ అస్థికలను మూసీలో కలిపారు: సీపీ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్ అస్థికలను మూసీనదిలో కలిపారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. స్వాతి ఆత్మహత్య, నరేష్ హత్యకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఓ పథకం ప్రకారం నరేష్‌ను మే2వతేదీ రాత్రి 10గంటల సమయంలో హత్య చేసి టైర్లలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతరం అస్థికలను ...

మొదటి నుంచి శ్రీనివాస్‌రెడ్డిపై అనుమానం ఉంది: సీపీ - Namasthe Telangana

యాదాద్రి భువనగిరి: జిల్లాలో జరిగిన పరువు హత్య కేసు నిందితులను రాచకొండ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ... మే 2 నుంచి నరేశ్ కనిపించడం లేదు. నరేశ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటి నుంచి ...

న‌రేష్ హ‌త్య‌పై..వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌.... - ప్రజాశక్తి

హైదరాబాద్‌ : యాదాద్రి – భువనగిరి పరువు హత్య కేసులో నిందితులను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.... మే 2 నుంచి నరేష్‌ కనిపించకుండా పోయాడని, మే 16వ తేదీ స్వాతి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. నరేష్‌ ఆచూకి కోసం అతని కుటుంబసభ్యులు హై కోర్టుకు వెళ్లటంతో ఎల్బీనగర్‌ డిసిపి వెంకటేశ్వరరావు ...

తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి! - సాక్షి

తన భార్య కోసం వచ్చి.. మామ చేతిలో హత్యకు గురైన నరేష్ కేసు పలు మలుపులు తిరిగింది. పుట్టింట్లో ఉన్న తన భార్యను కలుసుకోడానికి వచ్చిన నరేష్.. అనుకోకుండా మామ శ్రీనివాసరెడ్డి కంట్లో పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. తమ ఇంటి దగ్గర తచ్చాడుతున్న నరేష్‌ను చూసిన ...

కులం పిచ్చికి బలైన స్వాతి-నరేష్ జంట: నరేష్‌ను చంపి పొలంలోనే దహనం చేసింది ఎవరో తెలుసా? - వెబ్ దునియా

నరేష్-స్వాతిల ప్రేమ కథ విషాదంగా ముగిసింది. కులం పిచ్చితో ఈ ప్రేమ జంట బలైపోయింది. నరేష్‌ను హత్య చేసింది స్వాతి తండ్రి అని తేలింది. పోలీసుల విచారణలో నరేష్‌ను తానే హతమార్చాననే నిజాన్ని స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. భువనగిరికి చెందిన స్వాతి, నరేష్‌లు ప్రేమించుకున్నారు. అయితే నరేష్‌తో కలిసి జీవించేందుకు ...

'క్లూ' దొరక్కుండా నరేశ్ హత్య, స్వాతిదీ హత్యేనా?: శ్రీనివాసరెడ్డి గత చరిత్ర ... - Oneindia Telugu

భువనగరి: నరేశ్-స్వాతిల విషాద ప్రేమ కథలో తండ్రే అసలు విలన్ అన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. నరేశ్ అదృశ్యం తర్వాత తనకేమి తెలియదని దొంగ ఏడుపులు ఏడ్చిన శ్రీనివాసరెడ్డి.. ఎట్టకేలకు విచారణలో నిజం అంగీకరించాడు. నరేశ్ ను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. ఊహించిందే జరిగింది: నరేశ్‌ను హత్య చేసింది స్వాతి తండ్రే! విషాదాంతమైన ప్రేమ ...

స్వాతి ఎదుటే నరేశ్ హత్య: అదృశ్యం కేసులో మరో మలుపు - ఆంధ్రజ్యోతి

యాదాద్రి భువనగిరి: నరేష్ అదృశ్యం కేసులో మరో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. భార్య స్వాతి ఎదుటే భర్త నరేశ్‌ను దారుణంగా కొట్టిచంపారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి, అతని బంధువులు కలిసి నరేశ్‌ను కిరాతకంగా రోకలిబండతో కొట్టి చంపిన అనంతరం టైర్లతో మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. పథకం ప్రకారం.. మే 2వతేదీన స్వాతితో నరేశ్‌కు ఫోన్ ...

యాదాద్రి జిల్లాలో పరువు హ‌త్య‌ - ప్రజాశక్తి

యాదాద్రి జిల్లాలో పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...తమ కులం కాని వాడు తన కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడన్న కోపంతో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నరేష్ అనే యువకుడిని అత్యంత దారుణంగా చంపి మృత‌దేహాన్ని దహానం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ ఎం మండలం పల్లెర్ల గ్రామంలో ఈ దారణంగా చోటు చేసుకున్నది.