డేరా బాబా అల్లర్లలో 'ఎర్ర సంచి'దే కీలక పాత్ర: ఏం జరిగిందంటే? - Oneindia Telugu

చండీగఢ్‌: ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల జైలు శిక్ష విధింపబడిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ గురించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 25న హర్యానాలోని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చగా.. గత సోమవారం శిక్ష ఖరారైంది. గుర్మీత్‌కు సీబీఐ న్యాయమూర్తి 20ఏళ్లపాటు శిక్షను ...

కోర్టు హాలు నుంచి త‌ప్పించుకునేందుకు ప‌న్నాగం…ఎర్ర‌బ్యాగుతో డేరా బాబా సంకేతాలు - Telugu Bullet News

డేరా స‌చ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ఇద్ద‌రు సాధ్విల‌పై అత్యాచారం కేసులో దోషిగా నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 25న హ‌ర్యానా లోని పంచ‌కుల సీబీఐ ప్ర‌త్యేక కోర్టు గుర్మీత్ ను దోషిగా తేల్చింది. ఈ విష‌యం తెలిస్తే వేల‌సంఖ్య‌లో ఉన్న ఆయ‌న అనుచ‌రులు చెల‌రేగిపోతార‌ని అంచ‌నా వేసిన హ‌ర్యానా ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంది.

ఆ ఎర్రబ్యాగే డేరా శిష్యులకు సంకేతం - ప్రజాశక్తి

చండీగఢ్‌: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న హరియాణాలోని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చగా.. గత సోమవారం శిక్ష ఖరారు చేశారు. గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత అతడి అనుచరులు చెలరేగిపోయారు. పెను ...

అల్లర్లకు డేరా బాబా సిగ్నల్‌ ఎలా ఇచ్చాడంటే... - సాక్షి

సాక్షి, ఛండీగఢ్‌: అత్యాచార కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను దోషిగా పంచకుల సీబీఐ స్పెషల్‌ కోర్టు ప్రకటించిన కాసేపటికే అల్లర్లు ఉవ్వెత్తున్న చెలరేగాయి. ఆయనను జైలుకు తీసుకెళ్తున్న సమయంలోనే ఏదో సంకేతాలు అందినట్లు క్షణాల్లోనే డేరా అనుచరులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. దీనిపై హర్యానా పోలీస్‌ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

కోర్టు ప్రాంగణంలోనే పోలీసు వాహనాన్ని అడ్డుకున్న డేరా గార్డులు - Namasthe Telangana

పంచ్‌కుల: లైంగిక దాడి కేసుల్లో 20 ఏండ్ల జైలు శిక్షపడిన డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాంరహీంసింగ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అంతకుముందే కుట్ర చేశాడు. కుట్ర అమలుకు ఆయన అనుచరులు విఫలయత్నం చేసి, అరెస్టయ్యారు. హర్యానా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ కుట్ర సంగతి బయటపడింది. ఇద్దరు మహిళలపై లైంగిక దాడి కేసుల్లో తమ అధినేతకు ...

తప్పించుకోవడానికి పక్కా ప్లాన్: రికార్డుల బాబాకు డాక్టరేట్ - Oneindia Telugu

న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ గుర్మీత్రా్ రహీంను తప్పించడానికి ఆయన అనుచరులు పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. గుర్మీత్‌ను అత్యాచారాల కేసులో పంచకుల సిబిఐ కోర్టు దోషిగా తేల్చిన తర్వాత శుక్రవారంనాడు ఆయనను తప్పించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని హర్యానా పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. అయితే, ప్లాన్‌ను ...

​గుర్మీత్ అనుచరులు.. అంతకు తెగించారా? - Samayam Telugu

డేరా సచ్చా సౌదా బాబా గుర్మీత్ రామ్ రహీంను అత్యాచారం కేసుల్లో దోషిగా తేల్చినప్పటి నుంచి, అతడి అనుచరుల ఆగడాల గురించి వేరే వివరించనక్కర్లేదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గుర్మీత్ అనుచరులు అల్లర్లు రేపారు. వందల కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ అల్లర్లలో దాదాపు ముప్పై రెండు మంది మరణించారు. డేరా అనుచరుల ఆగడాలను ...

గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్‌..!! - సాక్షి

సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీంను తప్పించేందుకు డేరా అనుచరులు ప్లాన్‌ వేశారు. అవును. శుక్రవారం పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచారాల కేసులో దోషిగా తేల్చిన అనంతరం ఆయన్ను తప్పించడానికి డేరా అనుచరులు ప్రయత్నించినట్లు హరియాణా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే, అధికారులు ఆ ప్లాన్‌ను సమర్ధవంతంగా ...