ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం! - Samayam Telugu

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీఘర్, డెహ్రాడూన్, ఆగ్రా వంటి ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూమి 30 సెకన్లపాటు కంపించింది. ఉత్తర భారతాన్ని వణికించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంపం ఎక్కడికక్కడ స్థానికులని ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసేలా చేసింది. ఉత్తరాఖండ్‌లోని ...

ఉత్తర భారతంలో పలుచోట్ల భూప్రకంపనలు - Namasthe Telangana

ఢిల్లీ: ఉత్తర భారతంలో పలుచోట్లు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల దాటికి ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు పెట్టారు. భూకంప లేఖినిపై ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైంది. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ సమీపంలో భూకంప ...

ఉత్తరాఖండ్‌లో భూకంపం - Namasthe Telangana

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఉత్తరాఖండ్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రాత్రి 10.33గంటలకు ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా ఉకీమఠ్ కేంద్రంగా భూకంపం వచ్చింది. ఇది ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు 90 కి.మీల దూరంలో ఉన్నది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్టు నేషనల్ సీస్మలాజికల్ బ్యూరో ప్రకటిం చింది. భూమికి 40కిలోమీటర్ల లోతున ...

ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు - Namasthe Telangana

న్యూఢిల్లీ: ఉత్తరాదిన దేశ రాజధాని నగరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. డెహ్రాడూన్‌కు 97కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ్ సమీపంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నోయిడా, చండీగఢ్, పంజాబ్, ...

ఢిల్లీలో భూప్రకంపనలు.. - సాక్షి

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ శివారు నోయిడా సహా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదయింది. ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్‌లలో దాదాపు 30 సెకన్లుపాటు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.