ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'గులాబి' రంగు వివాదం! - Oneindia Telugu

అమరావతి: తెలుగు రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లు దాటినా... ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పలు వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు సెగలు రేపుతూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ఆ ప్రాజెక్టు గోడలకు గులాబి రంగు ...

అమరావతి : సాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు ... - Andhraprabha Daily

logo మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో అమృతహస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయటాన్ని ఖండించారు. నాగార్జున సాగర్‌ జాతీయ ప్రాజెక్ట్‌ అని, దానిపై ఒక పార్టీని ప్రతిబింబించేలా చేయటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టుపై రాజకీయం చేయడం తగదన్నారు ...

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం! - ఆంధ్రజ్యోతి

నల్లగొండ: నాగార్జున సాగర్ మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పేరుతో కొత్త రంగు వేయడం ఈ వివాదానికి కారణం. తెలంగాణ అధికారులు ప్రాజెక్టు ప్రధాన గోడలకు టీఆర్ఎస్ పార్టీ రంగును వేస్తున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఈ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడమేంటని ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అభ్యంతరం ...

ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంటోంది. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టు గోడలకు గులాబీ రంగులు వేస్తుండడంతో ఆంధ్రా ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ప్రాజెక్టు నిర్వాహణ, నీటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఎలాగోలా ...