కృష్ణమ్మకు పెరుగుతున్న జలకళ... భారీగా వస్తున్న వరదనీరు - ap7am (బ్లాగు)

ఈ సీజన్ లో తొలిసారిగా కృష్ణానదిలో జలకళ కనిపిస్తోంది. కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్రకు భారీగా వరదనీరు వస్తోంది. మరోవైపు గతంలో కురిసిన వర్షాలకే ఆల్మట్టి పూర్తిగా నిండిపోగా, వస్తున్న వరద నీటిలో అత్యధిక భాగాన్ని కిందకు వదులుతున్నారు. 129 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఆల్మట్టిలో ఇప్పటికే 126 టీఎంసీల నీరు చేరింది.

ప్రాజెక్టులకు జలకళ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: ఇటీవల కురిసిన వర్షాలకు పలుప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. పొరు గు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్‌ నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా 30వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఇదే రీతిలో వరద వస్తే నీటి నిల్వ 40 టీఎంసీలు దాటుతుందని ఎస్సారెస్పీ ...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ప్రవాహం - ఆంధ్రజ్యోతి

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో దిగువన ఉన్న శ్రీరాంసాగర్ లోకి నీరు వస్తోంది. ప్రాజెక్టులోకి 30,664 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. కాగా... ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1071.9 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. అలాగే ...

పెరిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం - ఆంధ్రజ్యోతి

నిజామాబాద్: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రవాహ ఉదృతి పెరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులోకి 30,664 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని తెలిపారు.ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1071.9 అడుగులుగా ఉందని చెప్పారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 ...

తుంగభద్రకు వరద - ఆంధ్రజ్యోతి

గద్వాల, ఆంధ్రజ్యోతి: ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వస్తున్న వరద కింది ప్రాజెక్టులకు నీరు వస్తుందనే ఆశలను రేకెత్తిస్తోంది. పశ్చిమ కనుమల్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టిలోకి రోజుకు 20 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. తుంగభద్ర డ్యామ్‌కు కూడా 17 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, ...