ఆరుగురు కూలీలు మృతి - Namasthe Telangana

అమరావతి, నమస్తే తెలంగాణ: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ మైనింగ్ క్వారీలో శనివారం అక్రమ బ్లాస్టింగ్ ఆరుగురు కూలీల ప్రాణాలను బలిగొంది. ఫిరంగిపురం మండల కేంద్రం సమీపంలోని గొల్లపాలెంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు మీదపడి ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ముగ్గురు ఫిరంగిపురం ...

మృత్యు గని - సాక్షి

సాక్షి, గుంటూరు: రెక్కాడితేగాని డొక్కాడని ఆరుగురు నిరుపేద కూలీలను కొండరాళ్లు చిదిమేశాయి. క్వారీలో పనిచేస్తున్న ఆరుగురు రాళ్ల కింద సజీవ సమాధి అయ్యారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో శనివారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురంలో కార్మెల్‌ మాత కొండ దిగువన రెండెకరాల క్వారీలో రాళ్లు తవ్వుకునేందుకు గడ్డం రాంబాబు అనే వ్యక్తి ...

చితికిన బతుకులు గొల్లపాలెం క్వారీలో ఘోర ప్రమాదం - ప్రజాశక్తి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో కొండరాళ్లు మీద పడి ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరొకరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్‌ క్వారీలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ...

క్వారీ ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్ర్భాంతి - సాక్షి

గుంటూరు : ఫిరంగిపురం క్వారీ ఘటనపై ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. కాగా ఈ రోజు ఉదయం ఫిరంగిపురం కొండల్లో అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో.. కొండ ...

క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి - HMTV

గుంటూరు జిల్లా ఫిరంగిపురం రాళ్ల క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్లు విరిగిపడి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఫిరంగిపురం రాళ్ల క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో పనిచేస్తుండగా రాళ్లు ...

క్వారీలో బ్లాస్టింగ్: ఆరుగురు దుర్మరణం - Samayam Telugu

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో రాళ్ల క్వారీలో ఘోరప్రమాదం జరిగింది. క్వారీ బ్లాస్టింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. క్వారీలో పని చేస్తుండగా.. రాళ్లు విరిగిపడి కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతులు విజ్ఞానపురానికి చెందిన చినబాలశౌరి, నాగరాజు, ఫిరంగిపురానికి చెందిన ...

క్వారీలో బ్లాస్టింగ్: ఆరుగురు మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతి - Oneindia Telugu

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం గ్రానైట్ క్వారీలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు మీద పడి ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారీ ప్రమాద ...

10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: ఎమ్మెల్యే గోపిరెడ్డి - సాక్షి

గుంటూరు : ఫిరంగిపురం కొండల్లో మైనింగ్‌ బ్లాస్ట్‌లో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం క్వారీలో శనివారం మధ్యాహ్నం అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు ...

ఫిరంగిపురం బ్లాస్టింగ్ మృతుల వివ‌రాలు... - ప్రజాశక్తి

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురంలోగల గుట్టల్లో మైనింగ్ బ్లాస్టింగ్ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చిన్న బాలస్వామి, నాగేశ్వరరావు, రాయప్ప, దుర్గాంజనేయులు, శరవణ్, వీరయ్యలు ప్రమాదంలో మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. వీరందరూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందినవారిగా గుర్తించారు. కాగా... పేలుడు సమాచారం ...

క్వారీలో బ్లాస్టింగ్‌: భారీగా ప్రాణ నష్టం - సాక్షి

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్‌ క్వారీలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో బండరాళ్లు మీదపడి బండరాళ్లు పడి ఆరుగురు కూలీలు మృతిచెందారు. మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో.. బండరాళ్లు మీదపడి ఐదుగురు మృతి - ఆంధ్రజ్యోతి

గుంటూరు: జిల్లాలో విషాదం నెలకొంది. బండరాళ్లు మీదపడి ఐదుగురు కూలీలు మృతిచెందారు. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న ఫిరంగిపురం గుట్టల్లో మైనింగ్ బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా బండరాళ్లు మీదపడడంతో క్వారీలో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు చనిపోయారు. అలాగే మరికొందరు కూలీలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.