జీఎస్టీ ఘంటారావం - Namasthe Telangana

ఒకే దేశం.. ఒకే విపణి.. ఒకే పన్ను! పదిహేడేండ్లనాటి ఆలోచన.. ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది! పద్దెనిమిది పర్యాయాల సుదీర్ఘ సమావేశాలు.. పదకొండు నెలల చర్చోపచర్చల్లో.. షాంపూ మొదలు.. జెట్ విమానాలదాకా పన్నెండు వందలకుపైగా వస్తువులు, సేవల పన్నులను ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం.. వస్తుసేవల పన్ను వ్యవస్థను అట్టహాసంగా అమల్లోకి తెచ్చింది!

15 ఏళ్ల జీఎస్టీ ప్రయాణానికి రాష్ట్రపతే సాక్షి: జైట్లీ - Samayam Telugu

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రక్రియ 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైందని, దీని సుదీర్ఘ ప్రయాణానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జే సాక్షి అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శుక్రవారం రాత్రి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో అట్టహాసంగా జరిగిన జీఎస్టీ ఆవిష్కరణ కార్యక్రమంలో జైట్లీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం ...

జీఎస్టీ భారత చరిత్రలో కొత్త అధ్యాయం: రాష్ట్రపతి - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి జీఎస్టీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ జీఎస్టీ భారత దేశ చరిత్రలో కొత్త అధ్యాయమన్నారు. దేశమంతటా ఒకే పన్నుఅమల్లోకి వస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం జీఎస్టీకి పునాది పడిందని ...

న్యూఢిల్లీ : అత్యంత సమగ్రతతో కూడిన పన్ను విధానం జీఎస్టీ - Andhraprabha Daily

pranab పన్ను విధానంలో అత్యంత సమగ్రమైనది జీఎస్టీ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 2009లో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ జీఎస్టీపై తొలి ముసాయిదా ఇచ్చిందని ఆయన చెప్పారు. 2011, 2012 లలో తాను స్వయంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీతో చర్చలు జరిపినట్లు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ముఖ్యమంత్రులతో చర్చించినట్లు ప్రణబ్ ...

నేడే విడుదల.. అర్ధరాత్రి 'జీఎస్టీ' సంబరం - Samayam Telugu

ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ సిద్ధమవుతోంది. శుక్రవారం అర్ధరాత్రి జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అర్ధరాత్రి ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 1947లో స్వాతంత్ర్యం ...