చంద్రబాబుకు షాక్: టిఆర్ఎస్ లో చేరిన రమేష్ రాథోడ్ - Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపికి చెందిన మరో కీలకనేత ఆ పార్టీని వీడారు.విశాఖలో మహానాడు జరుగుతున్న సమయంలోనే పార్టీకి రాజీనామాచేసి టిఆర్ఎస్ లోచేరారు. ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ టిడిపికి గుడ్ బై చెప్పారు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ టిడిపికి రాజీనామా చేశారు.

29న టీఆర్ఎస్ లో చేరుతున్నా: రమేష్ రాథోడ్ - ప్రజాశక్తి

ఆదిలాబాద్ : ఈనెల 29వ తేదీన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రమేష్ రాథోడ్ వెల్లడించారు. నిర్మల్ అధ్యక్షుడుతో సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 99 శాతం టిడిపి నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు, కేసీఆర్ రాష్ట్ర దశా.. దిశను మార్చే ముందు చూపున్న నేత అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ లో ...

- మహానాడు జరుగుతుండగానే పొలిట్‌బ్యూరో సభ్యుడి సంచలన నిర్ణయం - సాక్షి

హైదరాబాద్‌: ఇప్పటికే తెలంగాణలో ఆగమైన తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్‌. ఆ పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ టీడీపీకి రాజీనామాచేసి, టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్.. రాథోడ్‌కు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో ఆదిలాబాద్‌జిల్లాలో టీడీపీ పూర్తిగా ...

రమేశ్ రాథోడ్ రాక: సిట్టింగ్‌లకు టెన్షన్.. రమేశ్ చేరిక టీఆర్ఎస్ కే మేలు చేకూరుతుందా? - Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో పాత ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఈ నెల 29న గులాబీ కండువా కప్పుకోవాలని తహతహాలాడుతుండటంతో పచ్చ జెండా ముందుకు తీసుకెళ్లే వారి సంగతేమోగానీ ప్రస్తుతం అధికార టీఆర్ఎస్‌లో గెడం నగేశ్, ...

టీడీపీని వీడనున్న కీలక నేత.. ! - ఆంధ్రజ్యోతి

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది....? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ గులాబీ కండువా ఎందుకు వేసుకోబోతున్నారు..? ఆయన రాజకీయ భవిష్యత్తుకు టీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి భరోసా వచ్చింది..? జిల్లాలో సంతోషపడుతున్నదెవరు...? టెన్షన్‌కు గురవుతున్నదెవరు.? తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో ...