చావో.. రేవో..చలో అమరావతి - సాక్షి

జగ్గంపేట: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమబాట పట్టనున్నారు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన బీసీ రిజర్వేషన్‌ హామీని అమలు చేయాలని కోరుతూ పలు దఫాలుగా ఉద్యమాలు నిర్వహించిన ముద్రగడ ఈసారి 'చావో.. రేవో.. చలో అమరావతి' పిలుపుతో నిరవధిక పాదయాత్రకు సంకల్పిస్తున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ...

జులై 26న చలో అమరావతి - ప్రజాశక్తి

కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర కాపు జెఎసి ఆధ్వర్యాన జులై 26న చలో అమరావతి నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. అదేరోజు కిర్లంపూడి నుంచి అమరావతి వరకూ నిరవధిక పాదయాత్రను నిర్వహిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో జెఎసితో ఆయన శనివారం చర్చించారు. అనంతరం ...

బాబుపై యుద్దానికి కాపులు: పాదయాత్రతో అమీ తుమీ తేల్చుకునేందుకు ముద్రగడ రెడీ!.. - Oneindia Telugu

కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోమారు ప్రభుత్వంపై పోరుకు సిద్దమయ్యారు. ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకునేందుకు మరో దఫా ఉద్యమానికి ఆయన సన్నద్దమవుతున్నారు. కాపు రిజర్వేషన్లపై అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి మరోసారి కాపు సెగ రుచి చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఛలో అమరావతి' పేరిట ముద్రగడ ...

కాపుల ఓట్లు మీకు అవసరం లేదా..?: ముద్రగడ - ఆంధ్రజ్యోతి

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని అమలు చేయకపోతే జులై 26న నుంచి ''చావో-రేవో చలో అమరాతి'' పేరుతో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు. మంజునాథ కమిటీ పర్యటన, సర్వే పూర్తయినా ఎందుకు ముందడుగు వేయడంలేదని, వచ్చే ఎన్నికల్లో ...