కొడుకును ఎదుర్కోవడమెలా? నేతాజీకి పరీక్ష! - Samayam Telugu

సమాజ్ వాదీ పార్టీ స్థాపించిన 25ఏళ్లలో అధినేత ములాయం సింగ్ యాదవ్ కి ఇది అత్యంత కష్టమైన పరీక్షకాలం. ఆయనకు పరీక్షాకాలం. జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయన సీనియర్ కొలీగ్స్ అయిన మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్ వంటి వారితో విబేధించి సొత్త పార్టీ పెట్టిన నేతాజీకి ఇప్పుడు సొంత తనయుడి రూపంలో శత్రువు 'యుద్ధానికి' ...

లైవ్: బహిష్కరణ తర్వాత అఖిలేష్ కీలక భేటీ: ఆయన ముందు రెండే దారులు - Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ శనివారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అఖిలేష్ యాదవ్ ముందు రెండే దారులున్నాయి. ఒకటి అఖిలేష్ యాదవ్ తన ...

అఖిలేశ్‌కు పొంచి ఉన్న మహాగండం! - సాక్షి

లక్నో: సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఆయన సన్నిహితుడు రాంగోపాల్‌ యాదవ్‌ను ఆరేళ్లపాటు ఎస్పీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ ఆరేళ్లపాటు బహిష్కరించడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ములాయం నిర్ణయం నేపథ్యంలో ఎస్పీని నిట్టనిలువునా చీల్చి సొంత కుంపటి పెట్టేదిశగా అఖిలేశ్‌ యాదవ్‌ సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన సొంత ...

ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్న కోడలేనా? - సాక్షి

లక్నో: తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌కు పోటీగా అఖిలేశ్‌ యాదవ్‌ 235 మంది రెబల్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అఖిలేశ్‌ ప్రకటించిన ఈ జాబితాలో లక్నో కంటోన్మెంట్‌ స్థానానికి మాత్రం ఆయన అభ్యర్థిని ప్రకటించకుండా వదిలేశారు. అందుకు కారణం అక్కడి నుంచి ములాయం రెండో కోడలు అపర్ణ పోటీ చేస్తుండటమే. ఆమెకు ఈ స్థానాన్ని ...

యూపీ సీఎం అఖిలేష్ కు ములాయం షాక్... పార్టీ బహిష్కరణ - Teluguwishesh

యూపీ యాదవ కుటుంబంలో పోరు తారాస్థాయికి చేరింది. కొంత కాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ఒక్కసారిగా బద్ధలయ్యింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ...

యూపీలో సంచలనం, కొడుకునే బహిష్కరించిన ములాయం - Telugu Version

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో సమాజ్ వాదీ పార్టీ నిలువునా చీలిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, తన తనయుడు అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు ములాయం సింగ్ యాదవ్. దీంతో అధికార పార్టీ నిలువునా చీలిపోయింది. మొన్నటి వరకు బాబాయి అబ్బాయి మధ్య జరిగిన యుద్ధం చివరకు తండ్రీ తనయుల పోరాటంగా మారింది.

సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం చీలికే.. - Namasthe Telangana

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, ఆయన కుమారుడు, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మధ్య పార్టీ టిక్కెట్ల జాబితాలు మంటలు రేపాయి. అఖిలేశ్‌ను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరించారు. దీంతో అఖిలేశ్ తిరుగుబాటు బావుటాను ఎగరవేయడంతో పార్టీలో చీలిక తథ్యంగా కనిపిస్తున్నది. malaysingh లక్నో, డిసెంబర్ 30: తన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ...

ఎస్పీలో ముదిరిన ముసలం - సాక్షి

సోదరుడు రాంగోపాల్‌ పైనా వేటు.. పార్టీని నాశనం చేశారని ధ్వజం - కొత్త సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడి - బహిష్కరించినా నేనే ప్రధాన కార్యదర్శిని: రాంగోపాల్‌ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం శుక్రవారం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడంతో... ఏకంగా కొడుకు అఖిలేశ్‌ను పార్టీ ...

అఖిలేష్‌ బహిష్కరణ - ప్రజాశక్తి

లక్నో : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న యుపిలో అధికార సమాజ్‌వాదీ పార్టీలో గత కొన్ని రోజులుగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు శుక్రవారం భగ్గు మన్నాయి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ సింగ్‌ యాదవ్‌, ఆయన సోదరుడు రామ్‌ గోపాల్‌ యాదవ్‌లను సమాజ్‌వాదీ పార్టీ నుండి ఆరేళ్ళపాటు బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ...

అఖిలేష్‌పై వేటు వేసే ముందు విలేకరుల సమావేశంలో హై డ్రామా - ఆంధ్రజ్యోతి

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నుంచి యూపీ సిఎం అఖిలేష్ యాదవ్‌ను బహిష్కరించే ముందు విలేకరుల సమావేశంలో హై డ్రామా చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పేందుకు పార్టీ యూపీ అధ్యక్షుడైన మరో సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌తో కలిసి ...

అఖిలేశ్‌ ఇంటికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు - సాక్షి

లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీ నుంచి సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ బహిష్కరణకు గురైన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లక్నోలోని సీఎం నివాసం వద్దకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అఖిలేశ్‌కు మద్దతుగా, ములాయం, శివపాల్‌ యాదవ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పార్టీలో అఖిలేశ్‌ వర్గీయులుగా ...

ములాయం కుటుంబంలో ఏం జరిగింది? - సాక్షి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ లో అధికార సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ వివాదాలను మొదట్లో రాజకీయ డ్రామాగా ప్రత్యర్థులు విమర్శించారు. నిజానికి పార్టీలో, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవహారాలు కొన్ని ఇలాగే సాగాయి. అయితే ములాయం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాలు చివరకు ఎస్పీ చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయి.

అఖిలేష్ బహిష్కరణపై కార్యకర్తల ఆగ్రహం - T News (పత్రికా ప్రకటన)

అఖిలేష్‌ యాదవ్‌ ను సమాజ్ వాదీ పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ములాయం సింగ్ యాదవ్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఫైరయ్యారు. అఖిలేష్‌ బహిష్కరణ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు లక్నోలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అఖిలేష్ యాదవ్‌ కు అనుకూలంగా ...

ములాయం సింగ్ షాకింగ్ నిర్ణయం... కొడుకు అఖిలేష్‌ను పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ - వెబ్ దునియా

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం శిఖరాగ్రానికి చేరుకుంది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి తన కుమారుడు అఖిలేష్ తో పాటు రాంగోపాల్ యాదవ్ ను 6 సంవత్సరాల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో ఎస్పీ కార్యాలయం ఎదుట అఖిలేష్ యాదవ్ ...

బహిష్కరణపై ములాయం ఏమన్నారు? - Samayam Telugu

కన్న కొడుకు, సీఎం అయిన అఖిలేష్ పై నిర్ధాక్షిణ్యంగా బహిష్కరణ వేటు వేశారు ములాయం. కొడుకు కన్నా తనకు పార్టీ మనుగడే ముఖ్యమని తన పనుల ద్వారా చూపించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఆయనేం చెప్పారో అతని మాటల్లోనే చదవండి... 1. పార్టీని కాపాడడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అఖిలేష్ ...

నోటీసులపై సమాధానం వినకుండానే..! - సాక్షి

లక్నో: సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌.. కుమారడు అఖిలేష్‌ యాదవ్‌తో పాటు సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాంగోపాల్‌ యాదవ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అన్యాయం అని ఆయన ...

ఎస్పీలో ముదిరిన సంక్షోభం… అఖిలేష్ కు ఔట్ - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

కుటుంబ రాజకీయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉత్తరప్రదేశ్ లోని అధికార సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ముదిరింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ములాయం ప్రకటించడం… ఆ వెంటనే సొంత అభ్యర్థులను ములాయం తనయుడు సీఎం అఖిలేష్ అనౌన్స్ చేయడంతో వివాదం పతాక స్థాయికి చేరుకుంది. అయితే ఇది కూడా ఒకటి రెండు రోజుల్లో చల్లారిపోతుందని ...

ఏడుపులు , రోదనలు : హైడ్రామాతో దద్దరిల్లిన ఎస్‌పి ఆఫీస్ - Oneindia Telugu

పార్టీ నుండి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆరేళ్ళపాటు బహిష్కరించడంతో ఆయన మద్దతుదారులు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ములాయం సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. By: Narsimha. Updated: Saturday, December 31, 2016, 7:45 [IST]. Subscribe to Oneindia Telugu. లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం ఎదుట హైడ్రామా ...

కొడుకు, తమ్ముడు కంటే పార్టీనే ముఖ్యం: ములాయం - సాక్షి

లక్నో: ' సమాజ్‌ వాదీ పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడ్డా. ఎన్నో కష్టనష్టాలు అనుభవించా. నా జీవత సర్వస్వాన్నీ ధారపోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చా. అలంటిది ఇప్పుడెవరో వచ్చి ఫలాలు అనుభవిస్తానంటే సహించేదిలేదు. కొడుకు, తమ్ముడు బంధాలకన్నా పార్టీనే నాకు ముఖ్యం. పార్టీని కాపాడుకోవడానికే అఖిలేశ్ యాదవ్‌, రాంగోపాల్‌ ...