సోపోర్‌‌ను జల్లెడపట్టిన ఆర్మీ.. ఇద్దరు ఉగ్రవాదులు హతం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో మాటువేసిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. గురువారం రాత్రి 3:30 గంటలకు సోపోర్‌ ప్రాంతంలో మిలిటెంట్లు సంచరిస్తున్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారని తెలియడంతో కార్డన్ సెర్చ్ ప్రారంభించినట్టు స్థానిక పోలీసు అధికారి ఒకరు ...

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం - Mana Telangana (బ్లాగు)

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లాలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. Comments. 0 comments. tweet; inShare0. Previous Postచెన్నై సిల్క్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం Next Postబస్సును ఢీకొట్టిన కారు: ఆరుగురి మృతి · by Taboola by Taboola.

కాశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసులపై గ్రెనేడ్ దాడి - HMTV

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. పోలీస్‌ బృందమే లక్ష్యంగా గెనేడ్‌తో దాడి చేశారు. సోపోర్‌ ప్రాంతంలోని జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌ సమీపంలో పోలీసులపై గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.

సోపోర్ లో ఉగ్రదాడి, నలుగురు పోలీసులకు గాయాలు - T News (పత్రికా ప్రకటన)

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ లోని జమ్మూకాశ్మీర్ బ్యాంక్ దగ్గర పోలీస్ పార్టీపై బాంబు విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు… ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ పోలీసులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. by Taboola by Taboola.

జమ్మూలో ఉగ్రదాడి… - Mana Telangana (బ్లాగు)

శ్రీనగర్: జమ్మూలో పోలీస్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని బుధవారం ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. సోపోర్ ప్రాంతంలోని జమ్ముకశ్మీర్ బ్యాంక్ సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ...