టాప్‌ స్టార్‌ కేసీఆరే! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఎప్పట్లాగే సీఎం కేసీఆర్‌ టాప్‌! రెండో స్థానంలో ఈసారి ఆయన తనయుడు కేటీఆర్‌! మూడో స్థానంలో నిలిచిన హరీశ్‌ రావు! చిట్టచివరి స్థానంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు! టీఆర్‌ఎస్‌ సర్వేలోని వివరాలివి! రాష్ట్రంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ...

మోదీ హవా ఉండదు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా రాబోయే ఎన్నికల్లో ఉండదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటి నుంచే ఆయన ప్రభ క్రమంగా తగ్గుతూ, ఎన్నికలనాటికి తటస్థ స్థితికి చేరుతుందన్నారు. గత ఎన్నికల్లోనే మోదీకి గరిష్ఠంగా సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపలేరని వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో మోడీ హ‌వా ఉండ‌దు : సీఎం కేసీఆర్‌ - ప్రజాశక్తి

హైదరాబాద్: రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ హవా ఉండదని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఎమ్మెల్యేలకు ఉద్బోదించారు. వచ్చే ...

కేసీఆర్‌ స్కోరు 98, హరీష్‌ స్కోరు? - సాక్షి

హైదరాబాద్‌: 2019 ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీకే అధికారం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఆయన తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ...

టిఆర్ఎస్‌కు 111, ఎంఐఎంకు 6, విపక్షాలకు 2! - Samayam Telugu

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 111 స్థానాలు టిఆర్ఎస్ వేనని ముఖ్యమంత్రి కల్వంకుట్ల చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 111 అసెంబ్లీ సీట్లు తమకు దక్కడమం ఖాయమని తాను చేయించిన సర్వేలో వెల్లడైనట్లు కేసీఆర్ చెప్పారు. శనివారం పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ...

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌కు 106 స్థానాలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే... టీఆర్ఎస్ పార్టీకి 106 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని ముఖ్యమంత్రి నిర్వహింపజేసిన సర్వే తెలిపింది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసింది. ఈ సందర్బంగా తాజా సర్వే ఫలితాలను సీఎం కేసీఆర్... మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలిపారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు ...

టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్‌ - సాక్షి

హైదరాబాద్‌ : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్‌ఎస్‌కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని ...

ఎన్నికలొస్తే టీఆర్ఎస్‌కు 111 సీట్లు ఖాయం: సర్వే, సెల్‌ఫోన్లపై కేసీఆర్ వేటు - Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు వెల్లడించారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే వివరాలను బయటపెట్టారు. ఇక ఎంఐఎంకు ఆరు సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ...

సీఎం కేసీఆర్‌ కొత్త నిర్ణయం - ప్రజాశక్తి

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఈ భేటీలో తుదినిర్ణయం తీసుకోనున్నారు. సాధారణంగా శాసనసభ, పార్లమెంట్‌ సమావేశాలు, ఇతర ముఖ్య సందర్భాల్లో ఎల్పీ సమావేశాలు జరుగుతుంటాయి.

ప్రారంభమైన టిఆర్ఎస్ ఎల్పీ, పీపీ భేటి - T News (పత్రికా ప్రకటన)

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ప్రారంభం అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కీలకమైన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత వివరాలు వెల్లడించనున్నారు.

ఇకపై ఏం చేయాలంటే..! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి వచ్చే జూన్‌ 2 నాటికి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అంతకంటే ముందే తమ పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులకు తగిన దిశానిర్దేశం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కర్తవ్య బోధ లక్ష్యంగా శనివారం ప్రత్యేకంగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, ...

రేపు టిఆర్ఎస్ పీపీ, ఎల్పీ భేటి - T News (పత్రికా ప్రకటన)

శనివారం (రేపు) మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం సంయుక్త సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ సభ్యత్వాలు, పార్టీ కమిటీలపై ఈ సమావేశంలో సమగ్రచర్చ, సమాలోచన జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి ...