అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన - Telugu Times (పత్రికా ప్రకటన)

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారు. తానే రంగంలోకి దిగి బూత్ స్థాయిలో పార్టీని ఇంటింటికి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా వచ్చే నెలలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఏదో ఒక జిల్లాను ఎంచుకొని ఆ జిల్లాలో మూడు రోజులు మకాం వేసి.. సగం రోజు బూత్‌లో ...

తెలంగాణలో 'ఇంటింటికీ అమిత్ షా'! - ఆంధ్రజ్యోతి

మే 23 నుంచి 25 వరకు బూత స్థాయి పర్యటన; మోదీ ఉద్దేశం వేరు.. కేసీఆర్‌ అర్థం చేసుకున్నది వేరు : మురళీధర్‌రావు. న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత షా దృష్టి సారించారు. స్వయంగా తానే రంగంలోకి దిగి బూత స్థాయిలో పార్టీని ఇంటింటికి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికలు ...

టీఆర్‌ఎస్‌వి ఓటుబ్యాంకు రాజకీయాలు! - సాక్షి

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాల కంటే మరింత అన్యాయం గా టీఆర్‌ఎస్‌ ముందుకు తీసుకెళుతోం దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్ల బిల్లుపై దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిందని, ఇది పూర్తిగా అన్యాయం, చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే.. కలుస్తున్నారు! - సాక్షి

తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన ఏమీ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. ఉప ఎన్నికల విషయంలో టీటీవీ దినకరన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి దొరికేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ...

అమిత్ షా తెలంగాణ టీ.కాంగ్రెస్ ఆకర్ష్... కాంగ్రెస్ ఖాళీ? తెలంగాణకు విస్తరణ నాయకులు - వెబ్ దునియా

కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే భాజపాకు బంపర్ మెజారిటీ సాధించుకున్నామో అలాగే తెలంగాణలోనూ రాబట్టాలని అమిత్ షా తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ...