టెక్స్‌టైల్ రంగానికి ప్రత్యేక విధానం ఉండాలి - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పించే టెక్స్‌టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో టెక్స్‌టైల్ ఇండియా-2017 సదస్సులో శుక్రవారం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

టెక్స్ టైల్ పరిశ్రమకు తెలంగాణ గమ్యస్థానం - T News (పత్రికా ప్రకటన)

దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే టెక్స్ టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో ఓ పాలసీని రూపొందిచాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు. అత్యంత ప్రాధాన్యత రంగంగా టెక్స్ టైల్ ను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ను నిర్మిస్తోందన్నారు.

టెక్స్‌టైల్ దిగ్గజాలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం - Namasthe Telangana

గుజారాత్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచవ్యాప్త టెక్స్‌టైల్ దిగ్గజాలను రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. గుజరాత్ గాంధీనగర్‌లో టెక్స్‌టైల్ ఇండియా-2017 సదస్సు జరిగింది. సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ...

టెక్స్ టైల్ రంగం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు - T News (పత్రికా ప్రకటన)

టెక్స్ టైల్ రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు టెక్స్ టైల్ రంగం ద్వారానే ప్రపంచ గుర్తింపు పొందాయన్నారు. తెలంగాణ, ఒడిశాలు చేనేత రంగం, బనారస్, కాంచిపురం నగరాలు సిల్క్ తో ప్రపంచ ప్రసిద్ధికెక్కాయన్నారు ప్రధాని. దేశంలో బట్టలు, లైఫ్ స్టైల్ ఉత్పత్తుల మార్కెట్ 2025కల్లా ...

భారత టెక్స్‌టైల్ రంగానికి మోదీ అంబాసిడర్: చంద్రబాబు - ఆంధ్రజ్యోతి

గుజరాత్ : భారత టెక్స్‌టైల్ రంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంబాసిడర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లో జరిగిన టెక్స్‌టైల్స్‌ ఇండియా- 2017 ఎగ్జిబిషన్‌ను మోదీ ప్రారంభించారు. సదస్సుకు హాజరయిన చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత టైక్స్‌టైల్‌ రంగంలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ...

అంతర్జాతీయ టెక్స్ టైల్ సమ్మిట్ ప్రారంభం - T News (పత్రికా ప్రకటన)

గుజరాత్ లోని గాంధీనగర్ లో అంతర్జాతీయ టెక్స్ టైల్ సదస్సు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ సదస్సును ప్రారంభించారు. అనంతరం అన్ని రాష్ట్రాల చేనేత స్టాళ్లను సందర్శించారు. తెలంగాణ స్టాల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్స్ ను ప్రభుత్వ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రధానికి చూపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.