టీటీడీ చైర్మన్‌గా సుధాకర్‌ యాదవ్‌? - సాక్షి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ పాలక మండలి కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలోని కీలక నేతలతో సమావేశమై నూతన ట్రస్ట్‌ బోర్డుపై చర్చిస్తున్నారు. దసరాలోపే పాలక మండలిని ప్రకటించాలని మొదట నిర్ణయించినా పలు కారణా లతో అది సాధ్యంకాలేదు. దీంతో ట్రస్ట్‌బోర్డు లేకుండానే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

టిటిడి చైర్మన్‌కు సుధాకర్: క్రిస్టియన్ సంస్థలతో.. ఆయన వద్దని శివస్వామి సంచలనం - Oneindia Telugu

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైంది. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని టిడిపిలోకి రప్పించుకునే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో డీఎల్‌కు మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలంటే సుధాకర్‌కు పదవి ...

టీటీడీ ఛైర్మన్‌ ఎంపికపై వివాదం, హిందువులకే ఇవ్వాలి- స్వామి - Tolivelugu

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌‌ ఎంపిక‌పై కొత్త వివాదం. కడప జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ అయిన సుధాకర్‌ని ఈ పదవికి ఎంపిక చేస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో తెరపైకి కొత్త వివాదం వచ్చింది. ఆయనకు క్రిస్టియన్ సంస్థలతో సంబంధాలున్నట్లు తాటికాయంత అక్షరాలతో ఫ్లెక్సీలు మైదుకూరులో ...

పుట్టాకు టీటీడీ చైర్మన్‌ - సాక్షి

సాక్షి ప్రతినిధి – కడప : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు మైదుకూరు నియోజక వర్గంలో మరో ప్రయోగానికి తెర లేపబోతున్నారు.టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను తప్పించి మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని నియోజక వర్గ నాయకున్ని చేయాలని నిర్ణయించుకున్నారు. పుట్టాను బుజ్జగించడం కోసం ఆయనకు ...

టీటీడీ కొత్త ఛైర్మన్ నియామకం - Tolivelugu

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త చైర్మన్‌గా పి.సుధాకర్‌ యాదవ్‌ నియామకం ఖరారైంది. బ్రహ్మోత్సవాల అనంతరం ఉత్తర్వులు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేయనుంది. సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. కడపకు చెందిన సుధాకర్ యాదవ్, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంచి సన్నిహితుడుగా తెలుస్తోంది. కాగా, గతంలో రాయపాటి ...

టీడీపీలోకి డీఎల్ రాక అంత ఈజీ కాదు..! - Telugu Version

అధికార పార్టీ నుంచి ఆహ్వానం వ‌చ్చిదంటే, సంబ‌ర‌ప‌డ‌ని నేత‌లంటూ ఎవ‌రుంటారు చెప్పండీ! ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు పిలిస్తే ఎలా ఉంటుంది..? మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి వ‌ర్గంలో ఇలాంటి సంద‌డే ఉండాలి. కానీ, అక్క‌డి ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంద‌ని తెలుస్తోంది. మంత్రి య‌న‌మ‌ల వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు ...

డీఎల్ టీడీపీలో చేరితే ఆయన పరిస్థితేంటి..? - ఆంధ్రజ్యోతి

కడప: మైదుకూరు తెలుగుదేశం పార్టీ రాజకీయం రసకందాయకంగా మారింది. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయ ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు ఆ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి ఖరారు చేయనుండడంతో మైదుకూరులో వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థికి టిక్కెట్‌ ఇస్తారన్న అభిప్రాయాలపై ...

టీటీడీ రేసులోకి అనూహ్యంగా వ‌చ్చారీయ‌న‌! - Telugu Version

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుందనే అంశం మీద ఈ మ‌ధ్య‌ చాలా పేర్లే వినిపించాయి. ఓ ద‌శ‌లో హ‌రికృష్ణ‌కు ఇస్తార‌నీ, టీడీపీ నేత ముర‌ళీ మోహ‌న్ కు ఖాయ‌మ‌నీ, త‌న‌కే కావాల‌ని కావూరి సాంబ‌శివ‌రావు చేసిన హ‌డావుడీ.. ఇలా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లే సాగాయి. అయితే, ఇప్పుడు అనూహ్యంగా ఓ పేరు తెర‌మీదికి రావ‌డం విశేషం! ఇంత‌కీ ఆ పేరు ఎవ‌రిదంటే.. సుధాక‌ర్ ...

టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్ - ఆంధ్రజ్యోతి

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొత్త చైర్మన్‌గా కడప జిల్లా మైదుకూరుకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ పేరును ప్రభుత్వం ఖారారు చేసింది. అందరి సహకారంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని సుధాకర్ చెప్పారు. టీటీడీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్ యాదవ్‌కు ...

టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్.. యనమలకు ఏమౌతారు? - వెబ్ దునియా

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు దాదాపు ఖరారైంది. ఈయన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బంధువు. అందులోను బిసి సామాజిక వర్గానికి చెందిన నేత. కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. చదలవాడ కృష్ణమూర్తి, అధ్యక్షుడిగా ఉన్న టిటిడి పాలకమండలిలో బోర్డు ...

ఆయనను టీడీపీలో చేర్చుకోవడం కోసమేనా ఇదంతా? - ఆంధ్రజ్యోతి

కడప,ఆంధ్రజ్యోతి: మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఆయనకు టీటీడీ బోర్డు పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండేళ్ల పాటు ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ...