ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ల ఫైట్ - Tolivelugu (పత్రికా ప్రకటన)

రాజస్థాన్ జోథ్‌పూర్‌లోని ఉమైద్ అనే ఆసుపత్రిలో జరిగిన దారుణమిది. పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణికి ఆపరేషన్ చేస్తూ ..ఇద్దరు డాక్టర్లు ఘర్షణకు దిగారు. ఉదయం ఆమె ఏ ఆహారం తిన్నదన్నదనే విషయంపై గైనకాలజిస్ట్ డాక్టర్ అశోక్ నేనివాల్, అనస్తిషియన్ ఎం.ఎల్.టక్ మధ్య వివాదం రేగి దాదాపు కొట్టుకునేంతవరకు పరిస్థితి వెళ్ళింది.

ఢిల్లీలో మరో బాబా అరెస్ట్ - Tolivelugu (పత్రికా ప్రకటన)

ఉద్యోగాలిస్తానంటూ కొందరు మహిళల నుంచి సుమారు 30 లక్షలు వసూలు చేసి మోసగించిన ఇచ్చాదారీ బాబాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో సెక్స్ రాకెట్‌‌ను కూడా ఈయన నిర్వహిస్తున్నాడట. శివమూర్తి ద్వివేది అలియాస్ సంత్‌స్వామి బ్రహ్మానందజీ మహరాజ్ చిత్రకూట్ వేల్ అనే ఈ బాబాను ఈయన అనుచరులు ముద్దుగా ఇచ్చాదారీ బాబా అని వ్యవహరిస్తారు.

భక్తి-భయం - ఆంధ్రజ్యోతి

ప్రజల బలహీనతలు పునాదిగా గుర్మీత్‌ సింగ్‌ వంటి బాబాలు పుట్టుకొస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు అటువంటివారిని కాపాడుకొస్తుంటారు. డేరా సచ్చా‍ సౌదా అధినేతను న్యాయస్థానం దోషిగా నిర్థారించగానే హర్యానాలో సాగిన తీవ్రమైన హింసను గమనించినప్పుడు, పాలకులు శాంతిభద్రతలను కూడా ఓట్లలోనే కొలుస్తారని అర్థమవుతుంది. పదిమంది ఒకచోట ...

ఇన్నాళ్లకు న్యాయం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రాసిక్యూషన్‌ సాక్షి నంబర్‌ 5... గుర్మీత్‌ బాబాకు శిక్ష పడటానికి కారణమైన లేఖ రాసి, కోర్టులో ఆయన ఎదుటే ధైర్యంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షి. బాబా బాధిత మహిళల్లో ఒకరు. సీబీఐ కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత ఎట్టకేలకు తన మౌనం వీడారు. అప్పట్లో తాను అనుభవించిన నరకం గురించి ఆమె ఓ ఆంగ్ల దినపత్రికతో ఫోన్లో ...

జైలులో రాత్రి భోజనం మానేసి.. ఉదయం పాలతో సరిపెట్టుకున్న 'దేవుడు' - ఆంధ్రజ్యోతి

రోహ్‌తక్: అత్యాచారం కేసులో 20 ఏళ్ల శిక్ష పడి ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఉన్న రాక్‌స్టార్ బాబా, సెల్ఫ్ స్టైల్‌డ్ గాడ్‌మ్యాన్ గుర్మీత్ గతరాత్రి డిన్నర్ తీసుకోలేదని జైలు అధికారులు తెలిపారు. రాత్రి ఆయన కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగి నిద్రపోయారని, ఉదయం పాలు తీసుకున్నారని పేర్కొన్నారు. జైలులో తనకు కేటాయించిన గదిలో పచార్లు ...

డేరా బాబాపై వాజ్‌పేయికి బాధితురాలి లేఖ: మోడీ హయాంలో శిక్ష, బాధితురాలు ... - Oneindia Telugu

న్యూఢిల్లీ: 2002లో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున.. ఒకటి తర్వాత మరొకటి అనుభవించేలా(మొత్తం 20ఏళ్లు) సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై డేరా బాబా బాధితురాలు స్పందించారు. తనకు న్యాయం జరిగిందని చెప్పారు. పదేళ్ల జైలు శిక్ష: జడ్జీ ముందు ...

జైల్లో రాక్ స్టార్ బాబా ఫస్ట్ నైట్ ఇలా.. - Tolivelugu (పత్రికా ప్రకటన)

డేరా బాబా గుర్మీత్ రాం రహీం గుర్మీత్ సింగ్ సోమవారం రాత్రి జైల్లో నిద్రలేక సతమతమయ్యారని జైలు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఎప్పుడో ఆయన నిద్రపోయాడని వారు చెప్పారు.సాధారణ ఖైదీలకు ఇచ్చినట్టే ఆయనకు రెండు బెడ్ షీట్లు, ఓ ప్లేటు, గ్లాసు, రెండు జతల దుస్తులు ఇచ్చామని, మిగతా ఖైదీల మాదిరే ఆహారం అందించామని వారు చెప్పారు. ఆయనకు ...

డేరా బాబా తీర్పులో కొత్త ట్విస్ట్ - HMTV

డేరా సచ్చా సౌధా అధినేతకి జైలు జీవితం ఖరారైంది. అత్యాచారం కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు కారాగార శిక్ష పడింది. బాబా చేసింది క్షమించరాని నేరమన్న సీబీఐ ప్రత్యేక కోర్టు..ఆయనకు తొలుత పదేళ్ల జైలు శిక్ష విధించింది. కొద్దిసేపటి తర్వాతే బాబాకు కోర్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. రెండు అత్యాచార కేసుల్లో పదేళ్ళ చొప్పున... మొత్తం 20 ఏళ్ళ జైలు ...

రెండు రేప్‌ కేసులు.. గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష.. ఏకకాలంలో అమలు కష్టం - వెబ్ దునియా

అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్‌కు మరో పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజా ఉత్తర్వులు వెలువరించింది. రెండు వేర్వేరు కేసుల్లో మరో పదేళ్లు జైలు శిక్షను న్యాయమూర్తి ...

'డేరా' నేరాలు: రేప్ కేసులో జైలు... మర్డర్ కేసులో ఉరి ? - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్‌రహీంకు మరింత కష్టకాలం ఎదురుకానుంది. రేప్ కేసులో 'డేరా' బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం విదితమే!. ఈ నేపధ్యంలోనే డేరా బాబాపై ఉన్న రెండు హత్య కేసులకు సంబంధించిన తుది తీర్పును సీబీఐ కోర్టు సెప్టెంబరు 16న వెల్లడించనుంది. పంజాబ్, హర్యానా కోర్టు గత నెలలో.. స్పెషల్ సీబీఐ కోర్టుకు.. విలేకరి ...

న్యాయం గెలిచింది.. డేరా బాబాకు ప‌దేళ్ల జైలు - Andhraprabha Daily

JAIL డేరా బాబా గుర్మీత్ సింగ్ కు శిక్ష ఖరారైంది. రేప్ కేసులో గుర్మీత్ ను పదేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఉద్రిక్తతల కారణంగా సునారియా జైలుకే వెళ్లిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి జ‌గ్‌దీప్ సింగ్‌ శిక్ష ఖరారు చేశారు. తాను ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేశాన‌ని, ద‌య చూపాల‌ని బాబా కంట‌త‌డి పెట్టినా.. న్యాయ‌మూర్తి మాత్రం ...

గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు - సాక్షి

రోహ్‌తక్‌/చండీగఢ్‌: 2002 నాటి రెండు అత్యాచార కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌ (50)కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున రెండు కేసుల్లో మొత్తంగా 20 ఏళ్ల శిక్ష వేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దీంతోపాటు ఒక్కో కేసుకు రూ. 15 లక్షల ...

20 ఏళ్ల జైలు - PRAJASAKTI

రోహ్‌త‌క్‌ : డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 2002 నాటి అత్యాచార కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది. గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా నిర్థారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు రెండు అత్యాచారం కేసుల్లో వేర్వేరుగా 10 సంవత్సరాల చొప్పున మొత్తం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.15 లక్షలు చొప్పున ...

నేరము - శిక్ష - ప్రజాశక్తి

ప్రజల ఆర్థిక, మానసిక బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు బాబాలు, స్వాములు పుట్టుకొస్తుండగా, వారికి రాజకీయ, స్వప్రయో జనాల కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నా యనడానికి డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఉదంతం ఒక ఉదాహరణ. పలువురు బాబాలు, స్వాములు దొరకనంత వరకే దొరలు. దొరికితేనే వారి నేర గాథలు, చీకటి మాటు ...

ఖైదీ నంబ‌ర్ 1997..గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష‌ - Namasthe Telangana

రోహ్‌త‌క్‌: రెండు అత్యాచార కేసుల్లో కలిపి డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. సీబీఐ కోర్టు ఒక్కో కేసులో గుర్మీత్ సింగ్‌కు పదేళ్ల చొప్పున 20 ఏళ్ల శిక్ష విధించిందని తెలిపారు. ఒక కేసులో శిక్ష పూర్తయిన తర్వాత మరో కేసులోని శిక్ష అమలవుతుందన్నారు. గుర్మీత్‌ ...

నన్ను ఇరికించారు.. హైకోర్టుకెళతా..: గుర్మీత్ సింగ్ - ఆంధ్రజ్యోతి

న్యూ ఢిల్లీ: 15 ఏళ్లనాటి అత్యాచార కేసులో 20 ఏళ్ల శిక్ష పడ్డ రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌.. న్యాయస్థానం తీర్పుపై స్పందించాడు. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీబీఐ కోర్టు విధించిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పాడు. తనకు తప్పక న్యాయం జరుగుతుందన్నాడు. కాగా, అత్యాచారం ...

రాక్‌స్టార్ బాబాకు 20 ఏళ్ల జైలుశిక్ష ఖరారు! - Samayam Telugu

అత్యాచారం కేసులో వివాదస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌద చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ ‌సింగ్‌ను దోషిగా పేర్కొంటూ సీబీఐ న్యాయస్థానం 20ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. గుర్మీత్ సింగ్‌కి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించిన నేపథ్యంలో ఇద్దరిపై అత్యాచారం చేసినందున 10 ఏళ్ల చొప్పున మొత్తం 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ...

డేరా బాబా: ఖైదీ నెంబర్ 1997, శిక్షను తగ్గించలేమన్న కోర్టు, సిర్సాలో ఉద్రిక్తత - Oneindia Telugu

రోహతక్: 15 ఏళ్లనాటి అత్యాచార కేసులో రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు కోర్టు 20 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించింది. రెండు వేర్వేరు కేసుల్లో పదేళ్ల చొప్పున రామ్ రహీమ్ బాబాకు 20 ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.ఈ శిక్షపై గుర్మీత్‌బాబాకు హైకోర్టును ఆశ్రయించనున్నారు. డేరాబాబా: విలాస జీవితం, రాజకీయ అండ, నటనపై ...

సీబీఐ కోర్ట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం - T News (పత్రికా ప్రకటన)

రేప్ కేసుల్లో గుర్మీత్ సింగ్ కు సీబీఐ కోర్ట్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో హైకోర్టులో సవాల్‌ చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు నిర్ణయించారు. త్వరలోనే శిక్షను సవాల్‌ చేస్తూ, బెయిల్ కోసం హైకోర్టు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. తీర్పు కాపీని కూలంకశంగా చదివిన తర్వాత హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. గుర్మీత్ కు రెండు కేసుల్లో పదేళ్ల చొప్పున ...