'తూర్పు' కనుమల్లో విషాదం - సాక్షి

మారేడుమిల్లి: 'తూర్పు' కనుమల్లో పెను విషాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ చీరిపినలోవ గ్రామంలో కొండపోడు పొలానికి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న పాక దగ్ధమై, అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. వారిలో ఓ చిన్నారి అక్కడిక్కడే సజీవ దహనమైంది.

ప్రమాదవశాత్తు నలుగురు చిన్నారులు మృతి - ప్రజాశక్తి

కొండపోడుకు నిప్పురాజుకుని పూరిగుడిసె దగ్ధం కావడంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు సజీవ దహనం కాగా మిగిలిన వారు గాయాలతో చనిపోయారు. వారిని రక్షించే ప్రయత్నంలో తాతకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లి మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం చావడికోట ...