ధరలు పెరిగినా.. ద్రవ్యోల్బణం తగ్గింది - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) మార్చిలో 5.70 శాతానికి తగ్గింది. దేశంలో ఆహార వస్తువుల ధరలు పెరిగినా డబ్ల్యుపిఐ అధోముఖంగా పయనించడం గమనించదగ్గ అంశం. గత ఏడాది మార్చిలో ఇది మైనస్‌ 0.45 శాతం ఉండగా గత నెలలో 6.55 శాతం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చిలో ఆహార వస్తువుల ధరల పెరుగుదల 3.12 శాతం ఉంది ...

మార్చిలో తగ్గిన ధరల వేగం - సాక్షి

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఫిబ్రవరితో పోలిస్తే తగ్గింది. 2017 ఫిబ్రవరిలో 6.55 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం (2016 ఫిబ్రవరి టోకు ధరల బాస్కెట్‌తో పోల్చితే) 2017 మార్చిలో 5.7 శాతానికి తగ్గింది. 2016 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.45 క్షీణతలో ఉంది. ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే.

తగ్గిన టోకు ద్రవ్యోల్బణం - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: ఆహార ధరలు అధికంగా ఉన్నప్పటికీ చమురు ధరలు తగ్గడం, తయారీ ఉత్పత్తుల వ్యయం క్షీణించడం వల్ల మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపిఐ) 5.70 శాతానికి తగ్గించింది. ఫిబ్రవరిలో డబ్ల్యూపిఐ 6.55శాతంగా నమోదైంది. గతనెలలో నమోదైన ఆహార ధరలు 2.69శాతంతో పోల్చితే ఈ సారి 3.12శాతానికి ఎగబాకినట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. కూరగాయల ...

దిగి వచ్చిన టోకు ధరల సూచీ.. - సాక్షి

న్యూఢిల్లీ: మార్చి నెల టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) దిగివచ్చింది. ఫిబ్రవరి నెలలో 6.55 శాతంతో పోలిస్తే మార్చినెల డబ్ల్యుపీఐ 5.70శాతంగా నమోదైంది. ఇంధన ధరలు, తయారీ వస్తువుల ధరలు తగ్గిన కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా శాంతించింది. 2016-17 ఆర్థికి సంవత్సరంలో పెరుగుతే వచ్చిన సూచీ నాలుగు సం.రాల గరిష్టాన్నినమోదు చేసింది. ఎనలిస్టుల ...