దిగ్విజయ్‌పై మండిపడ్డ తెలంగాణ డీజీపీ - సాక్షి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులే ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారని, ఐఎస్‌ఐఎస్‌ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ ఏర్పాటుచేసి దాని ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌ సోమవారం ట్విట్టర్‌లో ఆరోపణలు చేయడం దుమారం రేపింది. ఈ పోస్టుపై ఐటీ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర డీజీపీ తీవ్రంగా ...

దిగ్విజ‌య్ వ్యాఖ్యలను తప్పుపట్టిన తెలంగాణ డీజీపీ - Namasthe Telangana

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ తెలంగాణ పోలీసుల‌పై చేసిన వ్యాఖ్య‌లను రాష్ట్ర డీజీపీ అనురాగ్ శ‌ర్మ తీవ్రంగా తప్పుపట్టారు. దిగ్విజ‌య్ నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌న్నారు. ముస్లిం యువ‌కుల‌ను రెచ్చ‌గొట్టేందుకు తెలంగాణ పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ పేరుతో ఓ బోగ‌స్ వెబ్‌సైట్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని దిగ్విజ‌య్ ఆరోప‌ణ ...

దిగ్విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు - T News (పత్రికా ప్రకటన)

కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మండిపడ్డారు. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే గోపీనాథ్ ఫిర్యాదు ...

డిగ్గీరాజాపై నిర‌స‌న‌ల వెల్లువ‌ - Namasthe Telangana

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ సీఎం దిగ్విజ‌య్‌ సింగ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ ఫైర్ అయింది. మ‌న‌ పోలీస్ వ్యవస్థ పై డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ లోని కే.యూ సెంటర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌ ఆధ్వ‌ర్యంలో డిగ్గీ రాజా దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. పోలీస్ నైతిక ...

దిగ్వాజ‌య్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు.. - ప్రజాశక్తి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసులను కించపరిచేలా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ సీనియ‌ర్ నేత‌ దిగ్విజయ్‌సింగ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఎమ్మెల్యే మాగంటి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, తక్షణమే క్షమాపణ చెప్పాలని మాగంటి గోపీనాథ్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్‌లో శాంతియుత వాతావరణం ...

దిగ్విజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి - T News (పత్రికా ప్రకటన)

తెలంగాణ పోలీసులపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతా రాహిత్యమన్నారు. దిగ్విజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలన్నారు. లేకపోతే ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ ...

సారీ చెప్పక పోతే... చర్యలు తప్పవు : దిగ్విజయ్ సింగ్‌కు మంత్రి కేటీఆర్ వార్నింగ్ - వెబ్ దునియా

తమ రాష్ట్ర పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, అసంబద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించాలని ...

ట్విట్టర్లో.. డిగ్గీ రాజా వర్సెస్ కేటీఆర్ - Telangana99 Telugu News

సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత.. కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడైన డిగ్గీ రాజా అలియాస్ దిగ్విజయ్ సింగ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాకు చెందిన ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేయటం.

డిగ్గీ రాజా కాంట్రవర్సీ ట్వీట్.. కేటీఆర్ ఫైర్ - Teluguwishesh

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మరో టర్న్ తీసుకుంది. ఇప్పటికే తీవ్ర పదజాలంతో ఇరు పార్టీల నేతలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ నేత, తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ పనితో తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ పోలీసులపై చేసిన ట్వీట్ తో తీవ్ర దుమారం రేగుతోంది.

తప్పుడు ప్రచారం మానుకోవాలి దిగ్విజయ్ పై కెటిఆర్ ఫైర్, కారణమిదే! - Oneindia Telugu

హైదరాబాద్: ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ,మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు, తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కు మధ్య మాటల యుద్దం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న దిగ్విజయ్ తన వ్యాఖ్యలను వెంటను ఉపసంహారించుకోవాలని కెటిఆర్ సోమవారం నాడు ట్వీట్ చేశారు. కెటిఆర్ ...

ట్విటర్ లో దిగ్గిరాజ హాట్ కామెంట్- కెటిఆర్ రిప్లై - News Articles by KSR

తెలంగాణ పోలీసులపై కాంగ్రె్స్ ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్ సైట్ తయారు చేసి యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్‌ అధికారం ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. అలా అయితే ఆయ‌న‌‌ దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని ...

డిగ్గీ రాజాకు కేటీఆర్ ట్విట్టర్ కౌంటర్ - Samayam Telugu

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కోపమొచ్చింది. కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీటే ఆయన కోపానికి కారణం. డిగ్గారాజాకు స్ట్రాంగ్ గా రీట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్ సైట్ ను సృష్టించారని అన్నారు. యువతను ...

దిగ్విజయ్ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి కేటీఆర్ - ప్రజాశక్తి

తెలంగాణ పోలీసులు నకిలీ ఐస్‌ఐఎస్ సైట్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఒక మాజీ సీఎం బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదని మంత్రి కేటీఆర్ సూచించారు. తన వ్యాఖ్యలను దిగ్విజయ్ సింగ్ భేషరతుగా ఉపసంహరించుకోవాలని..లేదంటే దిగ్విజయ్ వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని ...

మాజీ సీఎంపై కేటీఆర్ ఫైర్ - సాక్షి

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు ఒక బోగస్ ఐఎస్ఐఎస్ సైట్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా ముస్లిం యువకులను ఐసిస్‌లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.