భారత్‌ తిరుగులేని విజయం - ప్రజాశక్తి

కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత్‌ ఎదురులేని విజయాలతో దూసుకెళ్తోంది. కొలంబో వేదికగా సాగిన నాలుగో వన్డేలో శ్రీలంకపై 168 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. కోహ్లీ, రోహిత్‌ శతకాల మోతకు తోడుగా చివర్లో ధోనీ, మనీష్‌ పాండే వేగమైన సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా సిరీస్‌లోనే అత్యధిక భారీ స్కోర్‌ 375/5 ను సాధించింది. ప్రపంచ కప్‌-2019కు నేరు గా ...

కోహ్లీ దెబ్బకు మరో రికార్డు బద్దలు - ఆంధ్రజ్యోతి

కొలంబో: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దెబ్బకు మరో రికార్డు బద్దలైంది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య 28 సెంచరీలతో ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉండగా తాజా సెంచరీతో జయసూర్యను కోహ్లీ నాలుగో స్థానానికి నెట్టేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో సచిన్ ...

భారత్ శతకాల మోత.. లంక టార్గెట్ 376 - Samayam Telugu

శ్రీలంక బౌలర్లకి వారి సొంతగడ్డపైనే మరోసారి భారత బ్యాట్స్‌మెన్లు చుక్కలు చూపించారు. కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి ( 131: 96 బంతుల్లో 17x4, 2x6), రోహిత్ శర్మ (104: 88 బంతుల్లో 11x4, 3x6) శతకాల మోత మోగించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. ఓపెనర్ ...

కోహ్లీ ఔట్: మలింగకు రోహిత్ కంగ్రాట్స్ - సాక్షి

కొలంబో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 76 బంతుల్లో మెరుపు శతకం సాధించాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో లంక కెప్టెన్ లసిత్ మలింగ చేతికి కోహ్లీ చిక్కాడు. అయితే కోహ్లీని మలింగ ఔట్ చేయగానే భారత ఓపెనర్ రోహిత్ శర్మ, మలింగ వద్దకు వచ్చి కౌగిలించుకుని అభినందించాడు.

300 వన్డేలో దుమ్మురేపిన ధోనీ.. శ్రీలంక ఎదుట భారీ విజయ లక్ష్యం - ఆంధ్రజ్యోతి

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డే టీమిండియా మాజీ సారథికి 300 వన్డే. 274 పరుగుల వద్ద లోకేశ్ రాహుల్ (7) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ మునుపటి ధోనీని తలపించాడు. శ్రీలంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. బంతిని బౌండరీలకు తరలిస్తూ తనకు బంతి వేయాలంటేనే బౌలర్లు భయపడేలా చితకబాదాడు. చురుగ్గా కదులుతూ వీరబాదుడు బాదాడు.

300: కోహ్లీని అవుట్ చేసిన మలింగను అభినందించిన రోహిత్ శర్మ - Oneindia Telugu

హైదరాబాద్: కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా మలింగ తన కెరీర్‌లో 300వ వన్డే వికెట్‌‌ని సాధించాడు. వన్డేల్లో 300వ వికెట్‌ను సాధించడం ద్వారా తక్కువ మ్యాచ్‌ల్లో సాధించిన ఐదో బౌలర్‌గా మలింగ నిలిచాడు. 2004, జులై 17న ...

సెహ్వాగ్ ను 'మించినోడు' - సాక్షి

కొలంబో: భారత సక్సెస్ ఫుల్ ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్ కు సాధ్యం కాని ఒక రికార్డును రోహిత్ శర్మ అందిపుచ్చుకున్నారు. ఒక ద్వైపాక్షిక సిరీస్ లో రెండు సెంచరీలను అత్యధిక సార్లు సాధించిన భారత ఓపెనర్ గా రోహిత్ రికార్డు సాధించారు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నారు. నాల్గో వన్డేలో 88 ...

లంకపై రోహిత్ రెండో శతకం.. ఔట్ - Samayam Telugu

భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ లంకేయులకి వారి సొంతగడ్డపైనే వరుసగా చుక్కలు చూపించాడు. గత ఆదివారం పల్లెకలె వేదికగా ముగిసిన మూడో వన్డేలో శతకం బాదిన రోహిత్ శర్మ.. గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలోనూ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్‌లో 88 బంతుల్లోనే రోహిత్ శర్మ 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి కెరీర్‌లో 13వ శతకాన్ని పూర్తి ...

​ మలింగ @300.. కెప్టెన్ కోహ్లి ఔట్..! - Samayam Telugu

శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్‌తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీసిన మలింగ కెరీర్‌లో 300వ వన్డే వికెట్‌‌ని ఖాతాలో వేసుకున్నాడు. 2004, జులై 17న వన్డే క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ అనతికాలంలోనే జట్టులో సుస్థిర స్థానం ...

కోహ్లి విజృంభణ: జయసూర్య రికార్డు బ్రేక్! - సాక్షి

కొలంబో: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సాధించారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్ గా కోహ్లి గుర్తింపు సాధించారు. శ్రీలంకతో నాల్గో వన్డేలో కోహ్లి తన 29 సెంచరీని నమోదు చేశారు. తద్వారా శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు జయసూర్య రికార్డును కోహ్లి సవరించారు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ...

ఇరగదీస్తున్న కోహ్లీ, రోహిత్ శర్మ.. బెంబేలెత్తిపోతున్న శ్రీలంక బౌలర్లు - ap7am (బ్లాగు)

శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. శ్రీలంక బౌలింగ్ ను ఊచకోత కోస్తూ... కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో తన 29వ సెంచరీని కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ కూడా ధాటిగా ఆడుతున్నాడు. 66 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 7 ఫోర్లు, ...

ధోని 49 నాటౌట్: కోహ్లీ, రోహిత్ సెంచరీలు, 168 తేడాతో లంకపై విజయం - Oneindia Telugu

హైదరాబాద్: కొలంబో వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ఆతిథ్య శ్రీలంకను 168 పరుగుల తేడాతో ఓడించింది. 376 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో 42.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది. India produce another convincing performance with both bat and ball to win the 4th #SLvInd ODI by 168 runs.https://t.co/TFWPFMc8TR ...

కోహ్లీ వీరబాదుడు.. వన్డేల్లో 29వ సెంచరీ నమోదు! - ఆంధ్రజ్యోతి

కొలంబో: నాలుగో వన్డేలో కోహ్లీ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రెండో ఓవర్‌లో ధవన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ బ్యాట్‌తో రెచ్చిపోతున్నాడు. బౌలర్ బంతి విసరడమే పాపమన్నట్టు వాటిని బండరీలకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో కేవలం 76 బంతుల్లోనే 14 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో 29 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ కూడా ...

కొలంబో వన్డే: దుమ్ము రేపుతున్న విరాట్ కోహ్లీ - ap7am (బ్లాగు)

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో కేవలం ఆరు పరుగులకే టీమిండియా ధావన్ వికెట్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ ధావన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ...

చెలరేగిపోతున్న కోహ్లీ, రోహిత్.. శ్రీలంకకు పట్టపగలే చుక్కలు! - ఆంధ్రజ్యోతి

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తిచేసుకుని సెంచరీవైపు దూసుకెళ్తుండగా రోహిత్ శర్మ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కోహ్లి దూకుడు - సాక్షి

కొలంబో:శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడును కొనసాగిస్తున్నారు. కోహ్లి 76 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ సాధించాడు. తొలుత 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లి.. మరో 38 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నారు. కోహ్లి జోరుకు భారత్ బ్యాటింగ్ పరుగులు పెడుతోంది. ఓపెనర్ శిఖర్ ...

దంచికొట్టిన కోహ్లీ.. అర్ధసెంచరీ పూర్తి! - ఆంధ్రజ్యోతి

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో కోహ్లీ దంచికొడుతున్నాడు. కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ధవన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ వచ్చీ రావడంతోనే బాదుడు మొదలుపెట్టాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. కోహ్లీ 51, రోహిత్ శర్మ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.