నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త - సాక్షి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 15 నోటిఫికేషన్లు విడుదల చేసి టీఎస్‌పీఎస్సీ మొత్తం 2,437 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. రేపటి నుంచి కొత్త నోటిఫికేషన్లను అందుబాటులో ఉంచుతామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణి గురువారమిక్కడ తెలిపారు. అలాగే రేపు ...

డీఎస్సీపై వారం రోజుల్లో జీవో ! - Namasthe Telangana

హైదరాబాద్: విద్యాశాఖ జీవో ఇచ్చిన తర్వాత డీఎస్సీ పని ప్రారంభమవుతుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. డీఎస్సీపై వారం రోజుల్లో జీవో వచ్చే అవకాశమున్నట్లు తెలిపారు. డీఎస్సీ మీద టీఎస్‌పీఎస్సీకి ఎలాంటి ఇండెంట్ రాలేదని ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో పీజీటీ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చక్రపాణి ...

రేపు గ్రూప్‌-1, 2 ఫలితాలు విడుదల: ఘంటా చక్రపాణి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: శుక్రవారం గ్రూప్‌-1, 2 ఫలితాలు విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఘంటా చక్రపాణి ప్రకటించారు. శుక్రవారం నుంచి గ్రూప్‌-2కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 2,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం గ్రూప్‌-1, 2 పరీక్షలను నిర్వహించింది.

రేపు గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు: ఘంటాచక్రపాణి - Namasthe Telangana

హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు రేపు విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటాచక్రపాణి వెల్లడించారు. గ్రూప్-2కు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లోగా ధ్రువపత్రాల జాబితా వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. గ్రూప్-2 అభ్యర్థులను 1:3 నిష్పత్తి ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ...

సాయంత్రం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ మీడియా సమావేశం - Namasthe Telangana

హైదరాబాద్: ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మీడియా సమావేశంలో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఘంటా చక్రపాణి ప్రకటనలు జారీ చేయనున్నారు. గ్రూప్-1, 2 ఫలితాల విడుదలపై ఘంటా చక్రపాణి స్పష్టత ఇవ్వనున్నారు. 20 వేలకు పైగా ఉద్యోగ నియామకాలను సత్వరమే చేపట్టాలని ముఖ్యమంత్రి ...