నెమళ్లు 'సెక్స్' చేయవు, అందువల్లే జాతీయ పక్షిని చేశారు: రాజస్థాన్ హైకోర్టు జడ్జి ... - Oneindia Telugu

జైపూర్: ఓవైపు దేశవ్యాప్తంగా గోమాంస నిషేధంపై నిరసనలు వెల్లువెత్తుతుంటే.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సంచలనం మరువకముందే ఆయన నోటి నుంచి మరిన్ని విస్తుపోయే వ్యాఖ్యలు రావడం మరో సంచలనానికి దారితీసింది. నెమళ్లు బ్రహ్మచారులు కావడం వల్లే ...ఇంకా మరిన్ని »

నెమళ్లు శృంగారానికి దూరంగా ఉంటాయి! - సాక్షి

జైపూర్‌: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ సూచించిన రాజస్థాన్‌ హైకోర్టు జడ్జి నెమళ్ల విషయంలో ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. నెమళ్లు బ్రాహ్మచారులు కావడం వల్లే వాటిని జాతీయపక్షిగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. 'మగ నెమలి బ్రాహ్మచారిగా ఉంటుంది. ఆడ నెమలితో అది శృంగారాన్ని నెరుపదు. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి ...ఇంకా మరిన్ని »

గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి : రాజస్థాన్‌ హై కోర్టు - ప్రజాశక్తి

జైెపూర్‌ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్‌ హై కోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గోవధకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించాలని సూచించింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్‌ జనరల్‌ను కోరింది. గోవధకు పాల్పడేవారికి విధించే శిక్ష విషయంలో రాష్ట్రాలకు, ...ఇంకా మరిన్ని »

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి - సాక్షి

జైపూర్‌: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాజస్తాన్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మహేశ్‌చంద్‌ శర్మ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అంశం కేంద్ర పరిధిలోనిది కనుక కేంద్రంతో కలసి పనిచేయాలని పేర్కొన్నారు. ఆవును వధించేవారికి జీవిత ఖైదు పడేలా చూడాలనీ సూచించారు. ఆవుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్‌ ...ఇంకా మరిన్ని »

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి - Namasthe Telangana

జైపూర్, మే 31:హిందువులు పవిత్రంగా భావించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బుధవారం పేర్కొన్నది. ఆవును చంపేవారికి ప్రస్తుత శిక్ష సరిపోదని, జీవితఖైదు విధించాలని అభిప్రాయపడింది. గోవధ, గోవుల విక్రయాల మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై పలు రాష్ర్టాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ...ఇంకా మరిన్ని »

నెమళ్లు పుట్టు బ్రహ్మచారులు - ఆంధ్రజ్యోతి

శృంగారంలో పాల్గొనవు.. మగ నెమలి కన్నీళ్లు తాగి ఆడ నెమలి గుడ్లు పెడుతుంది; ఆవు కూడా అంత పవిత్రమైనదే; రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు; ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేందుకు గోవును వధిస్తే యావజ్జీవం వేయాలని అభిప్రాయం; న్యాయమూర్తి వ్యాఖ్యలపై నెటిజన్ల జోకులు; నెమళ్ల కలయిక వీడియోల పోస్టింగ్‌. జైపూర్‌, మే 31: ''నెమళ్లు ...ఇంకా మరిన్ని »

జాతీయ జంతువుగా ఆవు: రాజస్థాన్ హైకోర్టు సంచలనం: చంపితే జీవిత ఖైదు, ఇక అంతే! - Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆవుల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన తాజా ఆంక్షలపై తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసన గళాలు వినిపిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ విషయంపై రాజస్థాన్ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఆవులను చంపేవారికి ...ఇంకా మరిన్ని »

రాజస్తాన్ హైకోర్టు భిన్నమైన తీర్పు-గో వివాదం - News Articles by KSR

రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదం అవుతుందా? పశువధ నిషేధంపై పెద్ద రగడ జరుగుతుంటే రాజస్తాన్ హైకోర్టు ఏకంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించి ఆవులను చంపినవారికి జీవిత ఖైదు వేయాలని సలహా ఇచ్చింది. ఒక వైపు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశం అంతటా ఆందోళనలు జరుగుతుంటే , రాజస్తాన్ హైకోర్టు ఒక అడుగు ముందుకు వేసి ఈ సూచన చేయడం ...ఇంకా మరిన్ని »

గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి.. గోవధ చేస్తే జీవితఖైదు: రాజస్థాన్ హైకోర్టు - వెబ్ దునియా

గోవధ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అంతేగాకుండా గోవధ చేసేవారికి ప్రస్తుతం మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నారని గుర్తు చేసింది. ఇంకా ఆవును ...ఇంకా మరిన్ని »

గోవును జాతీయ జంతువు చేయండి : రాజస్థాన్‌ హైకోర్టు - ప్రజాశక్తి

జైపూర్‌: మాంసం కోసం పశువుల అమ్మకాల నిషేధంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌ హైకోర్టు కీలక సూచనలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. అంతేగాక, ఆవును వధించేవారికి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు పెంచాలని సిఫార్సు చేసింది. ఆవుల సంరక్షణపై ...ఇంకా మరిన్ని »