రియల్టీ రంగంలో కొత్త అధ్యాయం - Namasthe Telangana

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: స్థిరాస్తి రంగంలో బిల్డర్ల ఆగడాలకు చెక్ పెట్టడంతోపాటు గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు రూపొందించిన రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం-2016 (రెరా) సోమవారం నుంచి అమలులోకి వస్తున్నది. చట్టంలోని 92 సెక్షన్లు మే 1 నుంచి అమలవుతాయి. పట్టణ పునరుజ్జీవానికి భరోసా కల్పించే ఈ చట్టంతో నిర్మాణ ...

నేటి నుంచి 'రియల్‌' అమలు - సాక్షి

న్యూఢిల్లీ: చాలాకాలంగా ఎదురుచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. గతేడాది మార్చిలో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందగా.. ఇందులోని 92 సెక్షన్లు మే 1నుంచి అమల్లోకి రానున్నాయి.

'రియల్‌' శకం ఆరంభం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): కొనుగోలుదారులను రాజుగా చేసే రియల్‌ ఎస్టేట్‌ చట్టం అమల్లోకి రావడం సంతోషంగా ఉందని.. ఆ రంగంలో నూతన శకం ప్రారంభమైందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం ...

కొత్త రియల్టీ చట్టంతో గృహాలకు డిమాండ్‌ - సాక్షి

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ అభివృద్ధి చట్టం – 2016 మే 1 నుంచి (సోమవారం) అమల్లోకి వస్తోంది. ఈ చట్టం (ఆర్‌ఈఆర్‌ఏ) రాకతో గృహాలకు డిమాండ్‌ తిరిగి పుంజుకుంటుందని డెవలపర్లు భావిస్తున్నారు. ఈ చట్టం నిబంధనలను పాటించని అమ్మకందారుల నుంచి కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుందంటున్నారు. విక్రయం కాని యూనిట్లు అధిక సంఖ్యలో ఉన్నందున ...

'మే 1నుంచి రియల్‌ ఎస్టేట్‌ చట్టం' - సాక్షి

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ, అభివృద్ధి చట్టం మే 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ చట్టాన్ని 2008లో తెరమీదకు తెచ్చినా కాంగ్రెస్‌ పార్టీ ఏమీ చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. అలాగే, ఇక నుంచి బిల్డర్లు తాము చేయబోయే నిర్మాణాల గురించి ముందుగా ఏం పేర్కొన్నారో, మీడియాలో, పుస్తకాల్లో, ...