కాంగ్రెస్‌ పోస్టర్లపై ప్రణబ్‌ ఫొటోలు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార పోస్టర్లపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఫొటోను ప్రచురించడాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి రాష్ట్రపతిభవన్‌ తీసుకెళ్లింది. 'ఇది ఏవిధంగానూ క్షమించకూడదు' అని ఈసికి రాసిన లేఖలో పేర్కొంది. రాష్ట్రపతి హోదాకు భంగం కలిగించే విధంగా ఈ చర్య వుందని పేర్కొంది. కాంగ్రెస్‌ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పోస్టర్లల్లో ...

పంజాబ్: కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రపతి! - Samayam Telugu

దేశవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేక పవనాలతో తేరుకోలేకపోతున్న కాంగ్రెస్ యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని తహతహలాడుతోంది. అందుకు దేశఅత్యున్నత పదవి రాష్ట్రపతి స్థానంలో ఉన్న ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ఫొటోలను తమ ప్రచారంలో వినియోగించుకుంటోంది. పంజాబ్ కాంగ్రెస్ నేతల అత్యుత్సాహంతో ఆయన ఫొటోను ఎన్నికల ప్రచారంలో ...

రాష్ట్రపతి భవన్‌కు కోపమొచ్చింది.. - సాక్షి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటో కాంగ్రెస్‌ పార్టీ హోర్డింగుల్లో దర్శనమివ్వడంపై రాష్ట్రపతి భవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి డాక్టర్‌ నజీమ్ జైదీకి రాష్ట్రపతి భవన్‌ కార్యదర్శి ఓమితా పాల్‌ లేఖ రాశారు. ఈ లేఖలో ఏం పేర్కొన్నారంటే.. రెండు జాతీయ పత్రికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్లెక్సీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ...

కాంగ్రెస్‌ హోర్డింగుల్లో ప్రణబ్‌ - సాక్షి

న్యూఢిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగులలో రాష్ట్రపతి ప్రణబ్‌ ఫొటోలు దర్శనమిచ్చాయి. వీటిపై రాష్ట్రపతి భవన్‌ మండిపడింది. రాష్ట్రపతి పదవికున్న తటస్థతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్‌ హోర్డింగులలో ప్రణబ్‌ ఫొటోలకు సంబంధించి జాతీయ ...