తండ్రిలా అండగా నిలిచారు.. స్పూర్తినిచ్చినందుకు కృతజ్ఞతలు: మోడీ 'టచింగ్' లెటర్ - Oneindia Telugu

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా తన చివరి రోజున ప్రధాని మోడీ నుంచి ఒక లేఖ అందుకున్నానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. మోడీ రాసిన లేఖను ట్విట్టర్ లో ఆయన షేర్ చేశారు. మూడేళ్ల కాలంలో ప్రణబ్ తనపై ఎంతో ప్రేమను, వాత్యల్యాన్ని చూపించారని మోడీ తన లేఖలో చెప్పారు. 'ప్రణబ్ దా.. మన రాజకీయ ప్రస్థానాలు విభిన్నమైన రాజకీయ నేపథ్యాల్లో ...

ప్రణబ్ ముఖర్జీకి మోదీ రాసిన లేఖలో ఏముంది? - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది. తనకు వీడ్కోలు పలుకుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన లేఖను ఆయన పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రపతి పదవిలో తన చివరి రోజున ఈ లేఖను మోదీ తనకు ఇచ్చారని తెలిపారు. ఈ లేఖను ప్రణబ్ ట్విటర్‌లో గురువారం పోస్ట్ చేశారు. ఈ లేఖ తన హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు.

మీరు నాకు పిత్రు సమానులు : ప్రణబ్ కు మోడీ లేఖ - ప్రజాశక్తి

ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ట్వట్టర్ లో షేర్ చేశారు. రాష్ట్రపతిగా తాను పదవీ విరమణ చేయడానికి ఒక రోజు ముందు ప్రధాని రాసిన లేఖ తన హృదయానికి హత్తుకుందని ప్రణబ్ ఆ లేఖను ట్వీట్ చేస్తూ పేర్కొన్నారు. ఆ లేఖలో నరేంద్రమోడీ ప్రణబ్ ను తన పిత్రుసమానుడిగా పేర్కొన్నారు. ప్రణబ్ దా మన రాజకీయ గమనం వేర్వేరు ...

మీరు నా తండ్రిలాంటి వారు! - సాక్షి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు రాసిన లేఖను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం ట్విట్టర్‌లో షేర్‌చేసుకున్నారు. రాష్ట్రపతిగా తన చివరిరోజున ఈ లేఖను అందుకున్నానని, ఈ లేఖ తనను కదిలించిందని ఆయన తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ తనపై ఎంతో ప్రేమను, వాత్సల్యాన్ని చూపారని ప్రధాని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. 'ప్రణబ్‌ దా.. మన రాజకీయ ప్రస్థానాలు ...