బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు? - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్, వైఎస్సార్‌ సీపీ నేత శివకుమార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కేసు నమోదు విషయంలో ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు వినియోగించుకోకుండా కేసు ...

బాలకృష్ణపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? : హైకోర్టు - ప్రజాశక్తి

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ ఓటర్లకు బహిరంగంగా ఓటర్లకు డబ్బు పంచారనే ఫిర్యాదును ఎన్నికల సంఘానికి (ఇసి) మాత్రమే ఎందుకు ఇచ్చారని హైకోర్టు పిటిషనర్‌ వేసిన వైసిపి నేతను ప్రశ్నించింది. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలని కోరింది. ఇసికి ఫిర్యాదు చేసి పోలీసులు కేసు ...

నంద్యాల ఎఫెక్ట్: బాలకృష్ణకు 'వైసిపి' చిక్కులు, భూమా బ్రహ్మానందరెడ్డి ప్రతిజ్ఞ - Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచి పెట్టారని, దీనిపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలని వైసిపి ప్రధాన కార్యదర్శి శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, నంద్యాల రిటర్నింగ్ అధికారి, బాలకృష్ణలను ఆయన ప్రతివాదులుగా ...

బాలకృష్ణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రోడ్‌షోలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటర్లను ప్రలోభ పెట్టారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని, రిటర్నింగ్‌ అధికారిని, బాలకృష్ణను ప్రతివాదులుగా చేర్చారు.

'బాలకృష్ణపై కేసు పెట్టేలా ఆదేశాలివ్వండి' - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రధాన ...

బాలకృష్ణపై హైకోర్టులో వైసిపి కేసు - ప్రజాశక్తి

నంద్యాల ఉప ఎన్నిక ప్రచార సమయంలో బాహాటంగా ఓటర్లకు డబ్బులిచ్చిన హిందూ పురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష వైసిపి ప్రధాన కార్యదర్శి కె.శివ కుమార్‌ హైకోర్టులో కేసు వేశారు. నంద్యాలలో 16న బాలకష్ణ రోడ్‌షో నిర్వహించినప్పుడు ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపర్చుకున్నారని ఈ రిట్‌లో ...