మధ్య అమెరికాలో భూకంపం.. - Namasthe Telangana

వాషింగ్టన్: మధ్య అమెరికాను భూకంపం వణికించింది. కరేబియన్ కోస్ట్ ఆఫ్ నికారగువా, కోస్టా రికాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఎల్ సల్వెడార్‌కు 120 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. భారీ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు జారీ ...