భూదందాపై ఉక్కుపాదం - Namasthe Telangana

మియాపూర్ అక్రమంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు.. రెండోరోజు 43 మంది సబ్‌రిజిస్ట్రార్లకు స్థానచలనం ఉత్తమ సేవలందించినవారికి కీలకస్థానాల్లో పోస్టింగ్. నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్‌వర్క్:రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన ముమ్మరంగా సాగుతున్నది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంతో సబ్‌రిజిస్ట్రార్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు వెలుగు ...

మరో 43 మంది సబ్‌-రిజిస్ట్రా‌ర్ల బదిలీ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రే‌షన్ల శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం రాత్రికి రాత్రే 29 మంది సబ్‌-రిజిస్ట్రా‌ర్లు (ఎస్‌ఆర్‌), జాయింట్‌ సబ్‌-రిజిస్ట్రా‌ర్ల (జేఎస్‌ఆర్‌)ను బదిలీ చేసిన ప్రభుత్వం.. బుధవారం మరో 43 మందిని బదిలీ చేసింది. దీంతో ఈ సంఖ్య 72కు చేరింది. మంగళవారం బదిలీ అయిన 29 మంది అధికారులూ జిల్లాలకు చెందినవారే. కాగా ...

మియాపూర్‌ పాత గ్రామం మొత్తం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం - ఆంధ్రజ్యోతి

బాలానగర్‌: బాలానగర్‌ సబ్‌-రిజిస్ట్రా‌ర్‌ మహ్మద్‌ యూసుఫ్‌ ఆలీ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయిదుగురు వ్యక్తులతో ముఠాగా ఏర్పడిన అతడు.. 2,362 ఎకరాల భూమిని ఇతరులకు బదిలీ చేసినట్లు బాలానగర్‌ ఏసీపీ గోవర్థన తెలిపారు. ఈ కేసులో యూసుఫ్‌ అలీ, అతడికి సహకరించిన ముబ్రాజుద్దీనను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ భూమి ...

బదిలీల్లోనూ అక్రమాలే - ఆంధ్రజ్యోతి

అవినీతిపరులకు అందలం... కేసులున్న ఇద్దరికి కీలక స్థానాలు... ఒక వర్గానికి 'మంచి పోస్టింగ్‌లు'; హైదరాబాద్‌ చుట్టుపక్కలే నియామకాలు; కొందరికి అదే ఆఫీసులో మళ్లీ పోస్టింగ్‌; ప్రహసనంగా సబ్‌ రిజిసా్ట్రర్ల బదిలీలు. హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడిన రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రక్షాళన చేద్దామని ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్‌ ...

లోన్ల కోసమే భూదందా! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రభుత్వ భూముల్లో అక్రమ రిజిస్ర్టేషన్ల దందాకు అసలు కారణం బ్యాంకు రుణాలేనని తెలుస్తోంది. ఎవరో, ఎవరికో జీపీఏ చేస్తారు. వారి నుంచి ఇతరులకు రిజిస్ర్టేషన్లు జరిగిపోతాయి. అవి ప్రభుత్వ భూములని తెలిసీ సబ్‌-రిజిసా్ట్ర ర్లు వాటిని రిజిస్ర్టేషన్‌ చేసిపెడతారు. స్థానిక సబ్‌-రిజిస్ర్టార్‌ లొంగకుంటే ...

ఖమ్మంలో తనిఖీలు - ఆంధ్రజ్యోతి

ఖమ్మం కలెక్టరేట్‌, మే 31: ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారుల తనిఖీలు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పెండింగు రిజిస్ర్టేషన్‌లను పరిశీలించారు. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్ల వివరాలను కంప్యూటర్‌లో ...

30 ఆఫీసుల్లో నిలువుదోపిడీ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌-రిజిస్ట్రా‌ర్లతో పాటు ఇతర అధికారులపై ప్రత్యేక నిఘా పెట్టింది. మియాపూర్‌ భూభాగోతంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమార్కులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్య లు తీసుకోవాలని ...

మంత్రి దందా - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌ భూదందాను తవ్వినకొద్దీ పెద్ద తలకాయలు బయటపడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలోని ఓ సీనియర్‌ మంత్రికి ఈ కుంభకోణంతో ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌ అధికారులు ఎనీవేర్‌ దోపిడీకి తెగించేందుకు ఆ అమాత్యుడు, ఆయన పేషీ పూర్తిస్థాయిలో సహకరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధికారుల భాగోతం.. రూ. 15 లక్షలకు ఊరినే రాసిచ్చేశారు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగానే మరోవైపు బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతకుమించిన భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎనీవే రిజిస్ట్రేషన్ విధానంలో ఏకంగా మియాపూర్ పాత గ్రామం మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన బయటపడింది. ఒకటి కాదు.

రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళన - T News (పత్రికా ప్రకటన)

రిజిస్ట్రేషన్ల శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు సీఎం కేసీఆర్. అక్రమాలు, అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో దశాబ్దాలుగా పేరుకుపోయిన మకిలిని సీఎం కేసీఆర్ సమూలంగా కడిగిపారేస్తున్నారు. చిన్నపాటి అవకతవక జరిగినా సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని మియాపూర్ లో ...

ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు - Namasthe Telangana

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేశ్ చంద్రారెడ్డిలను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మియాపూర్ భూకుంభకోణం కేసు ముగ్గురు నిందితులను శ్రీనివాస్‌రావు, పార్థసారథి, పీవీఎస్ శర్మలను కూకట్‌పల్లి పోలీసులు 10 రోజుల కస్టడీ కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో ...

రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు - Namasthe Telangana

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గల రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ రిజిస్ట్రార్ ...

అవినీతిలో వీళ్లను మించినోళ్లు ఉండరు..! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అంతమొందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు పూర్తిగా అవినీతికి దాసోహమైన కొందరు అధికారుల మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను సైతం తమ అవినీతి ఉపయోగపడేలా వినియోగించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. అధికారుల బదిలీల్లో ...

72 మంది రిజిస్ట్రార్ల బదిలీ - Namasthe Telangana

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 72 మంది రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో చాలా కాలంగా ఒకే చోట పనిచేస్తున్న రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు. కాగా జిల్లాల్లో పనిచేస్తున్న రిజిస్ట్రార్లను హైదరాబాద్‌కు బదిలీ చేసింది. అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నవారికి ప్రాధాన్యత పోస్టులు దక్కాయి. మియాపూర్ భూ అక్రమ ...

మియాపూర్ భూకుంభకోణంపై శరవేగంగా దర్యాప్తు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: మియాపూర్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మియాపూర్ భూకుంభకోణంపై అధికారులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో బాగంగా బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మహ్మద్‌ యూసఫ్‌ అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ ...

హైదరాబాద్‌: ఎనీవేర్‌ రద్దు - Andhraprabha Daily

హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలు, మియాపూర్‌ భూముల కుంభకోణం నేపథ్యంలో ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌(ఎక్కడి ఆస్తిని ఆ జిల్లాలోని మరో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం)ను రాష్ట్రంలో రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ ...

రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది రిజిస్ట్రార్ల బదిలీ - T News (పత్రికా ప్రకటన)

రాష్ట్రంలో భారీ ఎత్తున రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాల నుంచి మొత్తం 29 మందిని హైదరాబాద్‌ కు బదిలీ చేశారు. హైదరాబాద్ వారిని జిల్లాలకు బదిలీ చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా అలంపూర్‌ రిజిస్ట్రార్‌ మహ్మద్‌ జహంగీర్‌ ను ..మేడ్చల్‌ జిల్లా కూకట్‌ పల్లికి బదిలీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ...

భారీగా సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 29 సబ్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని కీలకమైన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వివిధ జిల్లాల సబ్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. డీఐజీ, జిల్లా ...

మరో ఇద్దరిపై వేటు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మేడ్చల్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ఎనీవేర్‌ అక్రమాలకు పాల్పడిన సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు పడుతోంది. వేల కోట్ల కుంభకోణంలో ఇప్పటికే కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు, మరో ఇద్దరిని అరెస్టు చేయగా.. తాజాగా మరో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై సర్కారు వేటు వేసింది. బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్ మహ్మద్‌ యూసుఫ్‌, నల్లగొండ జిల్లా పెద్ద ...