మిర్చి ఘాటు: హరీష్ రావు కన్నా చంద్రబాబు బెటర్ - Oneindia Telugu

హైదరాబాద్ / అమరావతి: కార్పొరేట్లు, వ్యాపారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవాల్సి వచ్చే సరికి నిబంధనల సాకుతో మొహం చాటేయడం మొదటి నుంచి జరుగుతున్న ప్రక్రియగానే ఉన్నది. అందునా వాణిజ్య పంట మిర్చి పండించిన రైతుల బాధలు చెప్పనలవి కాదంటే అతిశేయోక్తి కాదు. గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర రూ.

మిర్చి రైతుకు ప్రభుత్వ ఆసరా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి, గుంటూరు: మిర్చి రైతుకు మార్కెట్‌లో లభించిన ధర కంటే ప్రభుత్వం అదనంగా రూ. 1,500 చెల్లించనుంది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ఈ పథకం అమలులోకి రానుంది. మిర్చిని 99 శాతం గుంటూరు మిర్చి యార్డులోనే రైతులు విక్రయిస్తున్నందున రైతుకు అదనపు ధర యార్డులోనే లభించనుంది. ఇందుకోసం ...

భగ్గుమన్న మిర్చి రైతులు - సాక్షి

హైదరాబాద్‌: మిర్చికి గిట్టుబాటు ధర లేదని మలక్‌పేటలోని హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మార్కెట్‌ కార్యాలయం ముందు ఆందోళనతోపాటు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా జరిపారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయి చాదర్‌ఘాట్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి.విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు.

మిర్చి ప్యాకేజీ మోసపూరితం - ప్రజాశక్తి

మిర్చి రైతులను ఆదుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌కు రూ.1500 రాయితీపై రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ ప్యాకేజీ వల్ల పెద్దగా లాభం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ ప్రకటించాక కూడా రైతులు రోడ్డెక్కారు. మంగళవారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాస్తోరోకోలు నిర్వహించారు. రహదారులను ...

మిర్చి రైతుకు.. షరతులు వర్తిస్తాయి - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి, గుంటూరు : మిర్చి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన అదనపు ధర పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి. ఎవరుపడితే వారు మిరపకాయలు తీసుకొచ్చి యార్డులో విక్రయిస్తే ప్రభుత్వం రూ.1,500 చొప్పున 20 క్వింటాళ్లకు నగదు విడుదల చేయదు. యార్డుకు సరుకు తీసుకొచ్చే రైతు పేరు ఈ-క్రాప్‌ బుకింగ్‌లో నమోదై ఉందో, లేదో ముందుగానే ధ్రువీకరించుకోవాలి.

అన్నదాతలకు ధరల దెబ్బ - ఆంధ్రజ్యోతి

వేసవిలో అందరికీ వడదెబ్బ తగి లితే అన్నదాతకు ధర దెబ్బ తగిలింది. మిర్చి, పసుపు ధరలు భారీగా పత నం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ధర లేకపోవడం తో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితి లో పడిపోయారు. పల్నాడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. ఈ ఏడాది మిర్చి దిగుబడి ఆశించి ...

మిర్చీ రాయితీల్లో అవకతవకలకు పాల్పిడితే జైలుకే... - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి, గుంటూరు : మిర్చి రాయితీలలో అవకతవకలకు పాల్పిడితే ఉపేక్షించేది లేదని గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. మంగళవారం గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమావేశ మందిరంలో రైతు సంఘ ప్రతినిధులు, కమీషన్‌వ్యాపారులు, ఎగుమతి వ్యాపారులు, సూపర్‌వైజర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఆందించే ...

మిర్చి రైతుకు దన్ను - ఆంధ్రజ్యోతి

గుంటూరు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మిర్చి రైతును ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు మార్కెట్‌లో విక్రయించే ధరకు అదనంగా మరో రూ.1,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చేయాలని నిర్ణయించింది. గురువారం (20వ తేదీ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ఈ కార్యక్రమం ...

మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రతి విషయానికీ పొరుగు రాష్ట్రంపై విమర్శలు చేస్తూ, ఆ రాష్ట్రమే తెలంగాణ అభివృద్ధికి అడ్డు అని చెప్పే సీఎం కేసీఆర్‌.. మిర్చి రైతుల విషయంలో పొరుగు రాష్ట్రం తీరేమిటో గమనించాలని టీడీపీ-టీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంతరెడ్డి అన్నారు. అక్కడ (ఏపీలో) మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఏర్పడితే, ...

పరిహారం చెల్లింపుతో నష్టాల భర్తీ సాధ్యమా? - ప్రజాశక్తి

రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనకుండా కేవలం పరిహారం మాత్రమే చెల్లించాలని నిర్ణయించటం, పరిహారం చెల్లింపుకు పెట్టిన మార్గదర్శక సూత్రాలతో మిర్చి రైతులు మరింత నష్టాల బాట పట్టే ప్రమాదం వచ్చింది. ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 30 లోపు క్వింటా రూ.8 వేల వరకు పరిహారం చెల్లి స్తామని, అదీ ఒక్కో రైతుకు 20 క్వింటాళ్ల వరకే రాయితీ ...

క్వింటాలు మిర్చికి రూ.1500 చెల్లిస్తాం - ప్రజాశక్తి

మిర్చికి క్వింటాలుకు రూ.1500ల చొప్పున చెల్లిస్తామని వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 20 క్వింటాళ్ల వరకు రూ.30,000 అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకుంటుందన్నారు. ఈ నెల 20 నుంచి జూన్‌ నెలాఖరు వరకు ఈ ...

మిర్చి రైతు కన్నెర్ర! - సాక్షి

గిట్టుబాటు ధర కోసం రెండు నెలలుగా డిమాండ్‌ చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని మిర్చిరైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూనే రైతుల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే సర్కారు చోద్యం చూస్తోందని ...

రైతు ఉద్ధరణ ఇలాగా? - ప్రజాశక్తి

అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న నానుడి ఎప్పుడు పుట్టిందో తెలీదుకానీ ప్రతి ఏటా అటు రైతులకు ఇటు వినియోగదారులకు స్వీయ అనుభవంలోకి వస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు, ప్రజలకు అవస్థలు అధికం అయ్యాయి. మిరప పంట మార్కెట్‌లోకి రానారంభించి రెండు మాసాలైంది. అప్పటి నుంచీ ధరల పతనం కొనసాగుతోంది.

మిర్చి సాయానికి ససేమిరా - ప్రజాశక్తి

ధరల పతనంతో కుదేలైన మిరప రైతులను ఆదుకోవాలన్న చంద్రబాబు సర్కారు అభ్యర్ధనను కేంద్రం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ విపత్తుల సాయంపై ఏ విధంగానైతే తెలుగుదేశం వినతులను తిరస్కరించిందో మిర్చి రైతుల విషయంలోనూ కేంద్రం అదే పని చేసిట్లు సమాచారం. రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకోవాలని టిడిపి ...

కరువును గుర్తించారు.. సహాయక చర్యలు మరిచారు! - ప్రజాశక్తి

''ప్రకాశం జిల్లాలో ఇంత కరువు ఉందని ఊహించలేకపోయాం. రైతులు బాగా దెబ్బతిన్నారు. పంట నష్టాలపై అధికారులు సక్రమంగా అంచనాలివ్వలేదు. తిరిగి అంచనాలు వేసి పంపండి. ఆదుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం.'' అని జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు పరిశీలన బృందం ప్రకటించింది. వారి మాటలు జిల్లా రైతులకు భరోసా ఇచ్చేలా సాగాయి. నెలలు గడుస్తున్నా ...