మోదీని మించిన నేత లేడు! - సాక్షి

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు. మోదీతో పోటీపడగల సత్తా ఉన్న నాయకుడెవరూ లేరని ఉద్ఘాటించారు. గత్యంతరం లేకే మహా కూటమి నుంచి బయటకు రావాల్సి వచ్చిం దన్నారు. కూటమికి స్వస్తి చెప్పిన తరువాత ఎట్టకేలకు ఆయన ఈ అంశంపై మౌనం వీడారు. ఇంకా అందులోనే కొనసాగితే అవినీతికి మద్దతునిచ్చినట్టవుతుందని, ...

నితీష్ నిర్ణయాన్ని తప్పుపట్టిన శరద్ యాదవ్ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: మహాకూటమితో తెగతెంపులు చేసుకోవాలని నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ ఎట్టకేలకు మౌనం వీడారు. నితీష్ తీసుకున్న నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదని, మహాకూటమితో తెగతెంపులు చేసుకుంటూ ఆయన తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని శరద్ యాదవ్ అన్నారు. గ్రాండ్ అలయెన్స్‌తో పొత్తు తెంచుకుని బీజేపీ, ...

నితిష్‌కు షాకిచ్చిన శరద్‌ యాదవ్‌ - Telugu Version

బీహార్‌ ముఖ్యమంత్రి, జెడియు అద్యక్షుడు నితిష్‌ కుమార్‌కు మరో వ్యవస్థాపక నేత శరద్‌ యాదవ్‌ గట్టి షాకే ఇచ్చారు. లాలూ ప్రసాద్‌ కుమారుడైన తేజస్వి యాదవ్‌పై సిబిఐ, ఇడి ఆరోపణలను సాకుగా చూసి నితిష్‌ మరోసారి ప్రజలు తిరస్కరించిన బిజెపితో జట్టు కట్టడంపై ఆయన వ్యతిరేకత ప్రకటించారు. ఇది ప్రజల తీర్పునకు వ్యతిరేకమనీ, దురదృష్టకరమనీ తేల్చిచెప్పారు.

ఎట్టకేలకు మౌనం వీడిన శరద్ యాదవ్: బీజేపీకి షాకిచ్చిన జేడీయూ - Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీతో జేడీయూ పొత్తుపెట్టుకుని బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఇంతవరకు మౌనంగా ఉన్న ఆ పార్టీ సహ వ్యవస్థాపకులు శరద్ యాదవ్ ఎట్టకేలకు స్పందించారు. మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో పొత్తుపెట్టుకున్న జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నిర్ణయాలపై గత కొన్ని రోజులుగా శరద్ యాదవ్ ...

నితీశ్ చర్యలు సరికాదు - T News (పత్రికా ప్రకటన)

ఇన్ని రోజులు మౌనంగా ఉన్న జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ ఎట్టకేలకు స్పందించారు. బిహార్‌ లో జరిగిన తాజా పరిణామాలు తనను భాదించాయన్నారు. మహాకూటమి నుంచి విడిపోయి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టిన ఆయన…వీటితో తాను ఏకీభవించడం లేదని చెప్పారు. ప్రజలు మహాకూటమికి ఓట్లు వేశారని, నితీశ్ చర్యలు సరికాదంటూ అసహనం ...

బీజేపీతో కలవడం సరికాదు..! - Samayam Telugu

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఎన్డీయే పక్షాన చేరడంపై జేడీయూ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు శరద్‌ యాదవ్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు. మహాకూటమి విచ్ఛిన్నం కావడం బాధాకరమని, ఇది ప్రజలు కోరుకున్న పరిణామం ఎంతమాత్రం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 'బిహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాలు దురదృష్టకరం. వాటితో నేను ఏకీభవించడం లేదు. ప్రజలు ...

ఎట్టకేలకు పెదవి విప్పిన శరద్‌ యాదవ్‌ - సాక్షి

న్యూఢిల్లీ: బిహార్‌ రాజకీయ పరిణామాలపై జేడీయూ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు శరద్‌ యాదవ్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు. మహాకూటమి విచ్ఛిన్నం కావడం బాధాకరమని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. బిహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాలు దురదృష్టకరమని, వాటితో తాను ఏకీభవించడం లేదన్నారు. ప్రజలు కోరుకునేది ఈ పరిణామం కాదని, వారు మహాకూటమికి ...

పాట్నా : బీహార్ పరిణామాలపై శరద్ యాదవ్ అసంతృప్తి - Andhraprabha Daily

sharad బీహార్ లో బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటుపై ఎట్టకేలకు శరద్ యాదవ్ నోరు విప్పారు. జనతాదళ్ సీనియర్ నేత శరద్ యాదవ్ బీహార్ పరిణామాలు దురదృష్టకరమన్నారు. మహాఘట్ బంధన్ కు ప్రజలు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలని తీర్పు ఇచ్చారనీ, ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తాను ...

న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై విశ్వాసాన్ని కోల్పోవద్దు : శరద్ యాదవ్ కు బీజేపీ సలహా - Andhraprabha Daily

sharad జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ ఆర్జేడీకి దగ్గరౌతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ ఆయనకు ఓ సలహా ఇచ్చింది. శరద్ యాదవ్ ప్రధాని మోడీపై విశ్వాసం కోల్పోకూడదని పేర్కొంది. అవినీతికి పాల్పడిన వారెవరినీ కేంద్రంలోని మోడీ సర్కార్ ఉపేక్షించబోదని స్పష్టం చేసింది. శరద్ యాదవ్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, ఆయన ...

నల్లధనం వెనక్కు తెచ్చేదెప్పుడు...? - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : సీనియర్‌ జెడి(యు) నేత శరద్‌ యాదవ్‌ ఆదివారం కొత్త మిత్రపక్షం బిజ ెపిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నల్లధనం వెనక్కు తీసుకొస్తామని ఇచ్చిన హామీ ని కాషాయ పార్టీ నెరవేర్చలేదని విమర్శిం చారు. పనామా పత్రాల్లో వెల్లడైన పేర్లపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నిం చారు. 'విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తీసుకొస్తామని' బిజెపి ...

నల్లధనం వెలికితీతలో మోదీ సర్కార్ విఫలం - Namasthe Telangana

న్యూఢిల్లీ, జూలై 30: యునైటెడ్ జనతాదళ్ (జేడీ యూ) సీనియర్ నేత శరద్ యాదవ్ తన నూతన మిత్రపక్షం బీజేపీ పనితీరుపై మండిపడ్డారు. విదేశీ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెనుకకు రప్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పనామా పత్రాల్లో బయటపడ్డ అవినీతి పరుల్లో ఒక్కరిపైనా చర్య తీసుకోలేదని ఆదివారం ట్వీట్ల వర్షం కురిపించారు.

పోరాటం ప్రారంభించండి - ప్రజాశక్తి

పాట్నా: బీహార్‌లో బిజెపితో చేతులు కలిపి నితీశ్‌ కుమార్‌ను వెనక్కి తెచ్చేందుకు పోరాటం ప్రారంభించాలని జెడి(యు) సహవ్యవస్థాపకుడు శరద్‌ యాదవ్‌ను ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌ కోరారు. మతవాద, ఫాసిస్టు శక్తులతో చేయిగలిపి బీహార్‌ ప్రజలను నితీశ్‌ కుమార్‌ మోసం చేశారని లాలూ విమర్శించారు. అవినీతి ఆరోపణలను సాకుగా చూపి మహాగట్‌బంధన్‌ను విచ్ఛిన్నం చేసిన ...

మర్మమేంటి: సీఎంపై మౌనం.. మోదీపై ఫైర్‌! - సాక్షి

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ మిత్రపక్షాలను మార్చుకొని.. మళ్లీ అధికార పీఠంపై కొలువైన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌.. నితీశ్‌పై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. లాలూకు ఝలక్‌ ఇచ్చి నితీశ్‌ మళ్లీ బీజేపీ పంచన ...

శరద్ యాదవ్ ట్వీట్... నితీశ్ వర్గంలో కలకలం... - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ ఆదివారం బీజేపీపై నిప్పులు చెరిగారు. నితీశ్ కుమార్ బీజేపీతో జట్టుకట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా ట్వీట్ ఇచ్చారు. విదేశాల్లో పోగుపడిన నల్లధనాన్ని వెనుకకు తీసుకొస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు.

పాట్నా : నితీష్ పై శరద్ యాదవ్ అసంతృప్తి- లాలూతో మంతనాలు? - Andhraprabha Daily

మహాఘట్ బంధన్ నుంచి వైదొలగి బీజేపీ పంచన చేరిన నితీష్ కుమార్ వ్వయహారశైలిపై జేడీయూ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? బీహార్ సీఎంగా బీజేపీ మద్దతుతో నితీష్ ప్రమాణ స్వీకారం చేయడాన్ని శరద్ యాదవ్ జీర్ణించుకోలేకపోతున్నారా? వినవస్తున్న వార్తలను బట్టి చూస్తే అదే నిజమనిపిస్తున్నది. మరో వైపు ...

లాలూ గేలానికి చిక్కిన కీలక నేతలు? - ఆంధ్రజ్యోతి

పాట్నా : బిహార్ రాజకీయాలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. బీజేపీతో చేతులు కలిపిన నితీశ్ కుమార్‌కు గుణపాఠం చెప్పేందుకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పావులు కదుపుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో టీవీ చానళ్ళతో మాట్లాడుతూ శరద్ యాదవ్‌ను తమ నేతగా అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహించాలని ...

పాట్నా : జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తో టచ్ లో ఉన్న లాలూ!? - Andhraprabha Daily

laloo1 ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తో టచ్ లో ఉన్నారు. మహాఘట్ బంధన్ సర్కార్ ను కూలదోసి….బీజేపీ మద్దతుతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నితీష్ నాయకత్వం వహించడం శరద్ యాదవ్ కు రుచించలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ శరద్ యాదవ్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు రావడం ...