మిర్చి, బత్తాయి రైతుల రాస్తారోకో - ప్రజాశక్తి

గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మి ర్చి, బత్తాయి తోటల రైతులు రైతు సంఘం ఆధ్వ ర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదా రిపై రాస్తారోకో చేశారు. ఎస్‌ఐ శ్రీనివాసులు ఘట నాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. గిట్టు బాటు ధరపై స్పష్టమైన హా మీ ఇచ్చే వరకూ కదిలేది లేదని రైతులు భీష్మించారు.

మిర్చి రైతుల రాస్తారోకోలు - ప్రజాశక్తి

మిర్చి, పసుపు పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరుతూ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. మిర్చికి మద్దతు ధర కోసం ప్రకాశం జిల్లాలో 13 మండలాల్లోనూ, గుంటూరు జిల్లా పెదనందిపాడులోనూ రైతులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించగా, పసుపుకు ధర ప్రకటించాలని గుంటూరు జిల్లా భట్టిప్రోలులో రాస్తారోకో చేశారు.

రోడ్డెక్కిన మిర్చి రైతులు - ఆంధ్రజ్యోతి

ఒంగోలు, ఎటపాక, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): గిట్టుబాటు ధర కోసం మిరప రైతులు ఆందోళనబాట పట్టారు. ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా జరిగింది. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్‌) జిల్లా కమిటీలోనూ ...

రైతు ఆందోళనలు ఉధృతం - ప్రజాశక్తి

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రకాశం జిల్లాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. సోమవారం ఒంగోలులో మూడు సంఘాల ఆధ్వర్యంలో పలు సమస్యలపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు దృశ్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ధరలేక నష్టాల ...

రైతు కూలీల సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన - ప్రజాశక్తి

ప్రకాశం: రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దళారుల కారణంగా రైతులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయని తెలుపుతూ కళారూపకం ప్రదర్శించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎంతమంది రైతులు ...

ఒంగోలు కలెక్టరేట్ వద్ద రైతు కూలీ సంఘం ధర్నా - ఆంధ్రజ్యోతి

ఒంగోలు: మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ జిల్లా కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ వద్ద హైవేపై రైతుల బైఠాయించారు. అనంతరం రోడ్డుపై మిర్చిని తగులపెట్టి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కలెక్టరేట్ వద్ద కూడా రైతు కూలీ సంఘం నేతలు ధర్నా చేశారు. మిర్చికి మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.