ప.గో : ఆగిన లారీని ఢీ కొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు..ఒకరు మృతి..ఐదుగురికి గాయాలు - Andhraprabha Daily

Accident-1-7-300x168 పెంటపాడు మండలం అలంపురం వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొనటంతో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. SHARE.

ప్రైవేటు బస్సు, లారీ ఢీ.... - ప్రజాశక్తి

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెంటపాడు మండలంలోని ఆలంపురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.