ధోనీ ధనాధన్‌! - ఆంధ్రజ్యోతి

నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): జట్టులో స్థానమే ప్రశ్నార్థకమై విమర్శలు ఎదుర్కొంటున్న మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అజేయ అర్ధ శతకంతో గర్జించాడు. తానెంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో అలరించి.. రెండో వన్డేలో శతక వీరంగం చేసిన అజింక్యా రహానె మూడో మ్యాచ్‌లోనూ హాఫ్‌సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల ...

పరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 ... - వెబ్ దునియా

నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనకు దిగిన విండీస్‌ నిదానంగా ఆడుతున్నప్పటికీ వికెట్లు టపటపా రాలడంతో విజయం భారత్‌వైపే మొగ్గు చూపుతోంది. తొలి ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు తర్వాత కాస్త నిలకడ ప్రదర్శించి పరుగుల వేగం ...

15 ఓవర్లకు విండీస్ స్కోరు 64/3 - Andhraprabha Daily

265123.3 నిలకడగా ఆడుతున్న విండీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాిల్లో పడింది. పాడ్యా , కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టడంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి విండీస్ మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. విజయం సాధించాలంటే విండీస్ 35 ఓవర్లలో 188 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి. by Taboola by Taboola.

ధోనీ ధమాకా! - Namasthe Telangana

అంటిగ్వా: మిడిలార్డర్‌లో తానెంత విలువైన ఆటగాడో మాజీ కెప్టెన్ ధోనీ (79 బంతుల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి నిరూపించుకున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైన చోట.. బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తన నైపుణ్యాన్ని చూపెట్టాడు. బంతితో నిప్పులు కురిపిస్తున్న కరీబియన్ పేసర్లను ఒంటిచేత్తో నిలువరిస్తూ చేజారిందనుకున్న మ్యాచ్‌లో ప్రత్యర్థి ...

ఆ ప్లేస్‌లో ధోనీ ఎందుకు అవసరమంటే ఇందుకే.. మూడో వన్డేలో విండీస్ లక్ష్యం 252 ... - వెబ్ దునియా

ఆంటిగ్వాలో జరుగుతున్న మూడో వన్డేలో 40 ఓవర్ల వరకు విండీస్ బౌలర్లు భారత బ్యాటింగ్ శ్రేణికి చుక్కలు చూపించారు. ఏ జట్టైనా సరే త్రిశతకాలు బాదడం అలవాటుగా మారిపోయిన టీమిండియాను విండీస్ జట్టు ఎంత కట్టడి చేసిందంటే 30 ఓవర్లలో భారత్ జట్టు కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత స్లోగా భారత్ ఆడటానికి స్లో పిచ్ కారణం ...

విండీస్‌ లక్ష్యం 252 - ప్రజాశక్తి

ఆంటిగ్వా: వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ తొలిసారిగా పేలవమైన బ్యాటింగ్‌తో 251/4 చేసింది. మూడో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన విండీస్‌ను భారత్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించింది. ఐదుగురే బౌలర్లతో పక్కా ప్రణాళికతో కెప్టెన్‌ హోల్డర్‌ విరాట్‌ సేన పట్టుబిగించాడు.టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఆంటిగ్వా : 50 ఓవర్లకు భారత్‌ స్కోరు 251/4.. వెస్టిండీస్‌ విజయలక్ష్యం 252 - Andhraprabha Daily

mahendra-dhoni వెస్టిండీస్‌ వర్సెస్‌ భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లు ధోని 78 పరుగులు, రహానే 72పరుగులు, జాదవ్‌ 40 పరుగులు, యువరాజ్‌సింగ్‌ 39 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లు కమిన్స్‌ రెండు వికెట్లు, హోల్డర్‌ ఒకటి, బిషూ ...

100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ - ఆంధ్రజ్యోతి

అంటిగ్వా: విండీస్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్ నత్తనడకన సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 100 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 11 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (2) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన భారత్, 34 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (11) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన యువరాజ్ (39) ...

టీమిండియాకు తొలి దెబ్బ.. ధవన్ అవుట్ - ఆంధ్రజ్యోతి

అంటిగ్వా: విండీస్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు మూడో ఓవర్ నాలుగో బంతికి శిఖర్ ధవన్ (2) కమిన్స్ బౌలింగ్‌లో రోస్టన్ చేజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. రహానే (13), కోహ్లీ (0) ...

ఐసీసీ వరల్డ్ కప్: స్మృతి అజేయ సెంచరీ.. విండీస్‌పై భారత్ ఘనవిజయం - వెబ్ దునియా

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్ స్మృతి వెస్టిండీస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో జట్టును గెలిపించింది. తొలుత విండీస్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ విమెన్‌లలో హేలీ ...

భారత్‌ను గెలిపించిన స్మృతి - ప్రజాశక్తి

టాంటన్‌ : ఐసిసి మహిళా ప్రపంచకప్‌ క్రికెట్‌లో బలమైన వెస్టిండీస్‌పై భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో వరుసగా రెండో విజయంతో పాయింట్ల పట్టికలో నెంబర్‌ వన్‌కు చేరుకుంది. టాస్‌ గెలిచిన మిథాలీ రాజ్‌ వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 183/8 పరుగులు చేసింది. 184 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 42.3 ...

విండీస్ విలవిల - Mana Telangana (బ్లాగు)

Women-Cricket టాంటన్: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టాంటన్‌లో గురువారం జరిగిన ఏడో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన మిథాలీసేన ఆడుతూపాడుతూ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌కు రెండు ...

విండీస్‌కు చుక్కలు చూపిస్తున్న మందన.. పరుగుల వరద పారిస్తున్న ఓపెనర్! - ఆంధ్రజ్యోతి

టాంటన్: టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందన మళ్లీ రెచ్చిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్న మందన తాజాగా విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. 57 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన స్మృతి ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడుతోంది. మొత్తంగా 71 బంతులు ఎదుర్కొని ...

33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా - ఆంధ్రజ్యోతి

టాంటన్: విండీస్ మహిళల జట్టు నిర్దేశించిన 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది తొలి ఓవర్ ఐదో బంతికి పూనమ్ రౌత్ (0) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన భారత్ 7.2 ఓవర్ వద్ద జట్టు స్కోరు 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు దీప్తి శర్మ (6) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు టాస్ ఓడి ...

టీమిండియా ఎదుట స్వల్ప విజయ లక్ష్యం - ఆంధ్రజ్యోతి

టాంటన్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇక్కడి కూపర్ కౌంటీ గ్రౌండ్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 183 పరుగులు చేసి భారత్ ముందు 184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ మహిళల జట్టును భారత బౌలర్లు బెంబేలెత్తించారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఏడో ...