శశికళ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. రాజ్‌భవన్ వర్గాల ఆరా? - వెబ్ దునియా

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళలు పట్టుబట్టారు. ఈ రాజకీయం ఇపుడు రాజ్‌భవన్‌కు చేరింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని పన్నీర్‌ సెల్వం, ఆ స్థానాన్ని ఆశిస్తున్న శశికళలు గురువారం వేర్వేరుగా గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిసిన ...

గవర్నర్ కు శశికళ మరో లేఖ - సాక్షి

చెన్నై: తన శిబిరం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేజారుతుండటం, వీరంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరుతుండటంతో ఆందోళన చెందుతున్న శశికళ.. గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్‌మెంట్‌ కోరారు. తనకు మెజార్టీ నిరూపించుకునే అవకావం ఇవ్వాలని ఆమె మరోసారి విన్నవించారు. శనివారం శశికళ ఈ మేరకు గవర్నర్ ...

ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలి: శశికళ - ప్రజాశక్తి

ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ రాశారు. తమిళనాడు శ్రేయస్సు దృష్ట్యా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండని లేఖలో పేర్కొన్నారు. పన్నీర్‌ సెల్వం రాజీనామా చేసి 7 రోజులైంది.. మరింత ...

అసహనంలో శశికళ... గవర్నర్‌కు లేఖ - ప్రజాశక్తి

చెన్నై : తన ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేస్తుండటంపై శశికళ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని ఆమె ఓ లేఖ ద్వారా గవర్నర్ విద్యాసాగర్ రావును ప్రశ్నించారు. తనకు వెంటనే మరోసారి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. తనకు సంపూర్ణంగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరోసారి స్పష్టం చేశారు. తమిళనాడు శ్రేయస్సు ...

కొనసాగుతున్న ఉత్కంఠ - Namasthe Telangana

అన్నాడీఎంకేలో సంక్షోభం ఇప్పుడప్పుడే సమసిపోయేట్టు లేదు. ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్‌సెల్వం వర్గం చెప్తున్న నేపథ్యంలో రాజ్‌భవన్ నుంచి వస్తుందని భావించిన ప్రకటన రాలేదు. తాజాగా పన్నీర్ శిబిరంలో చేరిన పార్టీ ప్రెసీడియం చైర్మన్ మధుసూదనన్‌ను శశికళ వర్గం బహిష్కరించింది. అసలు ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శే ...

డీఎంకే వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ? - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. అన్నాడీఎంకేలో శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం పోరు నడుస్తుండటం… వీరిలో సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఇస్తారనే దానిపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే… కొందరు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని అర్థమవుతోంది. శశికళ లేదంటే పన్నీరు సెల్వం వైపు నిలిచే ఆలోచనలో ఇప్పటివరకు ఉన్న అన్నాడీఎంకే ...

శశికళకు సీన్ అర్థమైందా ? - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

తమిళనాడుకు ఎలాగైనా సీఎం కావాలని కలలుకంటున్న శశికళకు అసలు విషయం అర్థమైందా ? తనను సీఎం కాకుండా కేంద్రం ఎంతగా ప్రయత్నిస్తుందో ఆమెకు తెలిసొచ్చిందా ? అవుననే అంటున్నారు శశికళ సన్నిహితులు. గురువారం సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన చిన్నమ్మకు పరిస్థితి పూర్తిగా ...

పన్నీర్ కు కేంద్ర మాజీ మంత్రి మద్దతు - T News (పత్రికా ప్రకటన)

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. పన్నీర్ సెల్వం నివాసానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి పొన్నుస్వామి తన అనుచరులతో కలిసి పన్నీర్ సెల్వంకు మద్దతిచ్చారు. అమ్మ ఆశయాలను కొనసాగించే సత్తా పన్నీర్ సెల్వంకు మాత్రమే ఉందని, తాత్కాలిక ...

కాసేపట్లో గవర్నర్ ప్రకటన - సాక్షి

చెన్నై: తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితిపై ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కాసేపట్లో ప్రకటన చేసే అవకాశముంది. శుక్రవారం మధ్యాహ్నం విద్యాసాగర్ రావు.. చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషన్‌ కౌల్‌ను రాజ్ భవన్‌ కు పిలిపించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు. పన్నీరు సెల్వం రాజీనామా, ఆ తర్వాత అధికార అన్నా ...

మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలపడం సంతోషం:పన్నీర్ సెల్వం - ఆంధ్రజ్యోతి

చెన్నై: మరో నలుగురు ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలపడం సంతోషకరమని అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళ బెదిరింపులకు ఎవరూ లొంగవద్దని, ఆత్మసాక్షి ప్రకారం ఓటేయాలని ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చారు. శశికళకు శాసనసభ్యుల మద్ధతు లేదని, ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని సెల్వం ...

మరోసారి మీడియా ముందుకు పన్నీరు వర్గం - సాక్షి

చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాత్రమే తమిళనాడును రక్షించగలరని ఆయన మద్దతుదారులు చెప్పారు. సెల్వం వర్గీయులు శుక్రవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో పన్నీరు సెల్వంతో పాటు పొన్నుస్వామి, సీనియర్ నేతలు, మద్దతుదారులు పాల్గొన్నారు. జయలలిత వారసత్వాన్ని కొనసాగించే సత్తా సెల్వానికే ఉందని, అమ్మ ...

పన్నీర్ 95.. శశికళ 5! - సాక్షి

చెన్నై: తమిళనాడు రాజకీయాలపై రాష్ట్ర ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లో సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగాలా.. మార్పు జరగాలా అని పోల్ సర్వే నిర్వహించారు. పన్నీర్ సెల్వానికే పట్టం కట్టాలని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడుకు నాయకత్వం వహించడానికి పన్నీర్ సెల్వం కొనసాగాలని 'సీఎంవో ...

గవర్నర్‌పై స్వామి మళ్లీ విమర్శలు - T News (పత్రికా ప్రకటన)

బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి గవర్నర్ విద్యాసాగర్ రావును టార్గెట్ చేశారు. శశికళకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, గవర్నర్ ఎందుకు ప్రమాణస్వీకారం చేయించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు గవర్నర్ వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోందన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పేపర్లను శశికళ అప్పగించినప్పటికీ, గవర్నర్ ...

నాకు 5 రోజులు సమయం ఇవ్వండి: సెల్వం - సాక్షి

చెన్నై: అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ధీమాగా ఉన్నారు. అన్నా డీఎంకే చీఫ్‌ శశికళ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారని, ఆ జాబితాను చూపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారని, ఎమ్మెల్యేలను బలవంతంగా క్యాంపునకు తరలించారని ...

శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి: గవర్నర్ - సాక్షి

తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతున్న వీకే శశికళ సమర్పించిన సంతకాలు సరైనవో కావో చూడాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు భావిస్తున్నారు. దాదాపు అరగంట పాటు తన వాదన వినిపించడంతో పాటు, పది అంశాలతో కూడిన ప్రజంటేషన్ కూడా ఇచ్చిన శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతా కలిసి తనను ఎలా శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారో కూడా ...

చిన్నమ్మకే ఛాన్స్‌.. కానీ! - సాక్షి

తమిళనాడు రాజకీయాలు రాజ్‌ భవన్ కు చేరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకుని నిర్ణయం కోసం తమిళనాడు ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అవకాశం ఇస్తారా లేక ప్రభుత్వం ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఆన్‌లైన్ సర్వేలో 95 శాతం మంది మద్దతు పన్నీర్‌కే.. - AP News Daily (బ్లాగు)

తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎవరు ఎటువైపు ఉన్నారన్నది ఇప్పటికీ ఎటూ తేలలేదు. ఎమ్మెల్యేలను తక్షణం కోర్టు ముందు హజరు పరచాలని హెబియస్ కార్పస్ రిట్ కూడా దాఖలు చేశారు. పన్నీర్ సెల్వం శిబిరానికి మద్దతు కూడా అంతకంతకూ పెరుగుతుండడంతో ఏం జరగనుందన్నది కీలకంగా మారింది. ఇవాళ్టి ...

శశి'గళం'ఎమ్మెల్యేల సంతకాలపై ఆరా! - Samayam Telugu

గత ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారని తనచేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును కోరారు. తనకు 134 ఎమ్మెల్యేల (ఆ తరువాత ఓ పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడం, ఆయనకు మద్దతుగా 5మంది ఎమ్మెల్యేలు నిలిచారు) మద్దతు ఉందని వారు ...

హస్తినకు తమిళ రాజకీయం - HMTV

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న తమిళ రాజకీయాలు రాజ్ భవన్ కు చేరాయి. శశికళ, పన్నీర్ సెల్వం వాదనలు విన్న గవర్నర్ విద్యాసాగర్ రావు... తన నిర్ణయం ప్రకటించకుండా మరింత ఉత్కంఠకు తెరలేపారు. తాజా పరిణామాలు, తన అభిప్రాయాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గవర్నర్ ఏం నివేదిక పంపారు? కేంద్రం ఏ దారి చూపుతోంది? గవర్నర్ నిర్ణయం ఏమిటి?

తమిళనాడులో కొనసాగుతున్న ఉత్కంఠ - T News (పత్రికా ప్రకటన)

తమిళనాడు రాజకీయ సంక్షోభంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. అటు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. దీంతో గవర్నర్ నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జయ అక్రమాస్తుల కేసుపై ...