విద్యాసాగర్‌రావుకు కన్నీటి వీడ్కోలు - ప్రజాశక్తి

సాగునీటి రంగ నిపుణులు, ప్రభుత్వ సలహాదారు ఆర్‌. విద్యాసాగర్‌ రావుకు కటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం అంబర్‌పేట శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంతక్రియలు నిర్వహించారు. విద్యాసాగర్‌రావు మృతికి సంతాప సూచకంగా పోలీసులు గాల్లోకిి మూడు రౌండ్లు కాల్పులు ...

విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు పూర్తి - T News (పత్రికా ప్రకటన)

తెలంగాణ ఓ మేధావిని కోల్పోయింది. జలదోపిడిపై జాతిని జాగృతపర్చిన జలతార నింగికెగిసింది. నీళ్లసారుగా తెలంగాణ ప్రజలు ముద్దుగా పిలుచుకునే విద్యాసాగర్‌ రావు ఇక సెలవంటూ వెళ్లిపోయారు. యావత్ తెలంగాణను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతూ కనుమరుగయ్యారు. క్యాన్సర్ వ్యాధితో అలుపెరగని పోరాటం చేసి కన్ను మూసిన విద్యన్నకు తెలంగాణ ప్రజలు ...

విద్యాసాగర్‌రావు అంతిమయాత్ర ప్రారంభం - T News (పత్రికా ప్రకటన)

నీటిపారుదల రంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు అంతిమయాత్ర ప్రారంభమైంది. హబ్సిగూడలోని ఆయన ఇంటినుంచి అంతిమయాత్ర మొదలైంది. అంబర్‌పేట శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రాష్ర్ట మంత్రి హరీశ్ రావు విద్యాసాగర్ రావు పార్థీవదేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్ర వెంట ...

నేడు ఉద‌యం 10 గంట‌ల‌కు విద్యాసాగ‌ర్‌రావు అంత్య‌క్రియ‌లు.. - ప్రజాశక్తి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. అంబర్‌పేట శ్మశానవాటికలో విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలం నుంచి ...

సాగునీటి స్వాప్నికుడు ఇకలేరు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జలయోధుడు కన్నుమూశారు! సాగునీటి దోపిడీని ఎండ గట్టి, తెలంగాణ నీళ్ల కోసం పోరాడిన ఆ గొంతు మూగబోయింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు రాంరాజు విద్యాసాగర్‌ రావు(78) ఇక లేరు. కొంతకాలంగా మూత్రా శయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శని వారం హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడి చారు ...

తెలంగాణ గొప్ప మేధావినికోల్పోయింది: హ‌రీశ్ రావు - ఆంధ్రజ్యోతి

తెలంగాణ రాష్ట్రం గొప్ప మేధావిని కోల్పోయిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశరావు అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాసాగర్‌రావు వెన్నుదన్నుగా నిలబడ్డ వ్యక్తి విద్యాసాగర్‌రావు అని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ఆంధ్ర పాలకుల వివక్షను ...

కేసీఆర్‌ కంట తడి - ఆంధ్రజ్యోతి

విద్యాసాగర్‌రావు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సతీసమేతంగా హబ్సీగూడలోని విద్యాసాగర్‌రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. ఆయన పార్థివ దేహాన్ని చూడగానే కేసీఆర్‌ కళ్లు చెమర్చాయి. కళ్ల నుంచి నీటి బొట్లు రాలాయి. బాధాతప్త హృదయంతోనే విద్యాసాగర్‌ ...

ఇరిగేషన్‌ నిపుణుడు విద్యాసాగర్‌రావు కన్నుమూత - ప్రజాశక్తి

నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్‌ సలహాదారు రామరాజు విద్యాసాగర్‌ రావు(78) కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్‌రావుకు ఇద్దరు సంతానం. నల్లగొండ జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో 1939 నవంబర్‌ 14న విద్యాసాగర్‌రావు ...

తెలంగాణ జాతికి తీరని లోటు - Telugu Times (పత్రికా ప్రకటన)

తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్‌. విద్యాసాగర్‌రావు మరణం తెలంగాణ జాతికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. జయశంకర్‌ తర్వాత తెలంగాణకు దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్‌రావు అని కొనియాడారు. విద్యాసాగర్‌రావు తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎంతో తోడ్పాటు అందించారని పేర్కొన్నారు.

విద్యాసాగరరావుకు ప్రముఖుల నివాళి - T News (పత్రికా ప్రకటన)

జలమేధావి, రాష్ట్ర సాగునీటిరంగ సలహాదారు విద్యాసాగరరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. విద్యాసాగరరావుకు నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసానికి తరలివచ్చారు. డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్ రావు, ...

ఒక ప్రాజెక్టుకు విద్యాసాగరరావు పేరు - T News (పత్రికా ప్రకటన)

ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు పార్థివ దేహాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించి నివాళులర్పించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని విద్యాసాగర్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి విషణ్ణ వదనంతో కనిపించారు. విద్యాసాగర్ రావు లేని ...

ఆయన సేవలు చిరస్మరణీయం: వైఎస్‌ జగన్‌ - సాక్షి

హైదరాబాద్‌: ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. సాగునీటి రంగ నిపుణుడిగా, సలహాదారుగా విద్యాసాగర్‌ రావు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి ప్రార్థిస్తున్నట్లు జగన్‌ పేర్కొన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు - T News (పత్రికా ప్రకటన)

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిరంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాసాగరరావు తుదిశ్వాస విడిచిన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ఆయన రావు ...

తీవ్ర విషాదంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ - సాక్షి

హైదరాబాద్‌: ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మరణం పట్ల కలత చెందిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యాసాగర్‌రావు ఆరోగ్యం బాగా క్షీణించి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకుంటూనే ఉన్నారు. కేసీఆర్‌ తన సతీమణితో సహా హాస్పిటల్ ...

రాష్ట్రం గొప్ప మేధావిని కోల్పోయింది - T News (పత్రికా ప్రకటన)

నీటిరంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. రాష్ట్రం ఒక గొప్ప మేధావిని, తెలంగాణవాదిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమంలో విద్యాసాగర్‌రావు కృషి మరవలేనిదన్నారు. నీటి దోపిడీ గురించి తెలంగాణ ప్రజలకు సవివరంగా చెప్పిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌రావు ...

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూత.. సాగునీటి రంగంలో 34 ఏళ్లు? - వెబ్ దునియా

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు మరణించారు. సాగునీటి రంగ నిపుణులైన విద్యాసాగర్ రావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ విద్యాసాగర్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తనకు పెద్దన్నలా విద్యాసాగర్ రావు వ్యవహరించేవారన్నారు. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో ...

జలయోధుడికి సీఎం.. అశ్రు నివాళి - Samayam Telugu

ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మరణం పట్ల సీఎం చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ తర్వాత తెలంగాణకు చెందిన గొప్ప మేధావిగా గుర్తింపు పొందిన విద్యాసాగర్ రావు మృతితో కేసీఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చికిత్స కోసం ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడూ ఆయన ఆరోగ్య ...

అధికారిక లాంఛనాలతో విద్యన్న అంత్యక్రియలు - Namasthe Telangana

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిరంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు శనివారం ఉదయం కన్నుమూశారు. విద్యాసాగర్‌రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. మరికాసేపట్లో కాంటినెంటల్ ...

విద్యాసాగర్‌రావు మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి - T News (పత్రికా ప్రకటన)

ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ నీటివాటా నిజాలను నిగ్గుతేల్చిన మనిషి ఇకలేరన్న వార్త విని.. సీఎం కేసీఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆరోగ్యం బాగా క్షీణించి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి సీఎం కేసీఆర్ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితిని ...

విద్యాసాగర్ రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం - Namasthe Telangana

హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మరణం పట్ల ముఖ్యమంంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విద్యాసాగర్ రావు మృతి పట్ల సీఎం కలత చెందారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆరోగ్యం బాగా క్షీణించి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకుంటూనే ...