సింధు, సైనాకు సత్కారం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ బ్యాడ్మింటనచాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్, కోచ్ లు గోపీచంద్‌, విమల్‌కుమార్‌లను కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ ఢిల్లీలో గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సింధు, సైనాలు బ్యా డ్మింటన్ లో భారత ముద్దుబిడ్డలని కొనియాడారు.

క్రీడలకు మరింత ప్రోత్సాహం - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడలకు మోదీ సర్కార్‌ అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ అన్నారు. ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌తో పాటు శ్రీకాంత్‌ను గురువారం ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్‌ గోయల్‌ మాట్లాడుతూ... దేశంలో క్రికెట్‌ స్థాయిలో ...

చంద్రబాబును కలిసిన పీవీ సింధు.. సంపూర్ణ సహకారం అందిస్తామన్న సీఎం! - ap7am (బ్లాగు)

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు తన కోచ్ పుల్లెల గోపీచంద్ తో ఏపీ సీఎం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా తాను సాధించిన పతకాన్ని ఆయనకు చూపించింది. సింధును అభినందించిన చంద్రబాబు, ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుపై ...

సీఎం కేసీఆర్‌ ని కలిసిన సింధు - JANAM SAKSHI

హైదరాబాద్‌,ఆగస్టు30: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో సింధు మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. బుధవారం సీఎం కేసీఆర్‌ ను పీవీ సింధు కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ రజత పతకం సాధించిన సింధుని సీఎం అభినందించారు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించి దేశ ప్రతిష్టను ...

సిఎంను కలిసిన పివి సింధు - ప్రజాశక్తి

బాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధు సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రపంచ మహిళల బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో రజిత పతకాన్ని సాధించిన సింధును ముఖ్యమంత్రి అభినందించారు. మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ...

చంద్రబాబును కలిసిన పీవీ సింధు - ఆంధ్రజ్యోతి

అమరావతి: ప్రపంచ మహిళల బాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో రజత పతకం సాధించిన బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింధును అభినందించిన ముఖ్యమంత్రి మరిన్ని పతకాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన పీవీ సింధు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ సింధుని అభినందించి చేనేత శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌.. పీవీ సింధుకి ప్రత్యేక కానుకలు అందజేశారు. చేనేత శాలువాలతోపాటు ప్రత్యేకంగా నేయించి ...

పోచంపల్లి చీరతో సింధుకు సీఎం సత్కారం - Samayam Telugu

సింధు భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని పతకాలు సాధించి పెడుతుందని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అన్నారు. స్టార్ షట్లర్ పీవీ సింధు బుధవారం (ఆగస్టు 30) సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధును కేసీఆర్ అభినందించారు. సింధుతో పాటు కోచ్ గోపీచంద్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా ...

సింధుని అభినందించిన సీఎం కేసీఆర్ - T News (పత్రికా ప్రకటన)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధుని సీఎం కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కోచ్ పుల్లెల గోపీచంద్ తో పాటు సింధు కలిశారు. ఈ సందర్భంగా సింధుని, గోపీచంద్ ని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. భవిష్యత్తులో భారత్‌ కు మరిన్ని పతకాలు సాధించాలని ...

కేసీఆర్ ను కలిసిన పీవీ సింధు - ap7am (బ్లాగు)

ఇండియన్ ఏస్ షట్లర్, తెలుగుతేజం వీపీ సింధు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గౌరవపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్ లో రజత పతకం సాధించిన సింధును కేసీఆర్ అభినందించారు. శాలువా కప్పి ఆమెను సత్కరించారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలను సాధించాలని ఆయన అభిలషించారు. Facebook · Google · Twitter · LinkedIn · Email.

సింధుపై అభిప్రాయం మార్చుకున్న గోపీచంద్ - Samayam Telugu

తెలుగు తేజం పి.వి. సింధు ఎన్ని టైటిళ్లు సాధించినా ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ మాత్రం ఆమె ఇంకా పూర్తిస్థాయి క్రీడాకారిణిగా ఎదగలేదు అని అంటుండేవారు. గతేడాది రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించినప్పుడు కూడా సింధు ఇంకా పూర్తిస్థాయి క్రీడాకారిణిగా ఎదిగే దశలోనే ఉందని అన్నారు. కానీ ప్రస్తుతం ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

పి.వి.సింధుకు సీఎం చంద్రబాబు అభినందనలు - Telugu Times (పత్రికా ప్రకటన)

ప్రపంచ బాడ్మింటన్‌ పోటీల్లో రాష్ట్రానికి చెందిన పి.వి.సింధూ రజిత పతకాన్ని సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. జపాన్‌ క్రీడాకారిణకి ప్రతీ మ్యాచ్‌లోనూ గట్టిపోటీ ఇస్తూ, భవిష్యత్తులో స్వర్ణపతాకాన్ని సాధిస్తుందన్న విశ్వాసాన్ని బాడ్మింటన్‌ క్రీడాకారుల్లో, అభిమానుల హృదయాల్లో నమ్మకాన్ని ...

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో సింధూకు ఘనస్వాగతం - Andhraprabha Daily

sindhu వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతక విజేత పీవీ సింధు ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సింధుకూ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సింధుకు శంఖాబాద్ విమానాశ్రయంలో అభిమానులు నిరాజనం పలికారు. ఆమెతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ కూడా ఉన్నారు.