నేడు రాష్ట్రపతిని కలువనున్న డీఎంకే నేతలు - ఆంధ్రజ్యోతి

చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలి అంటూ ప్రతిపక్ష నేతలు నేడు రాష్ట్రపతిని కలువనున్నారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శశికళ మేనళ్లుడు దినకరన్ తిరుగుబాటుతో మరింత ముదరుపాకానా పడుతోంది. తమిళనాడు రాజకీయాలు ఎలాంటి కీలక ...

ఢిల్లీకి చేరిన తమిళ ప్రకంపన! - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: తమిళ రాజకీయ ప్రకంపనలు ఢిల్లీకి చేరాయి. సీఎం పళనిస్వామికి మెజారిటీ లేదని, తమిళనాడు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి.. బలపరీక్షను నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. రాష్ట్రపతిని కలిసినవారిలో డీఎంకే, వామపక్షాలు, కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. అన్నాడీఎంకేలో దినకరన్‌ వర్గం ...

తమిళనాట ఆగని రాజకీయ మంటలు - HMTV

తమిళనాడు రాజకీయ పంచాయితీ మరోసారి ఢిల్లీ చేరింది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ రాష్ట్రపతి భవన్‌లో కోవింద్ ను కలవనున్నారు. పళనిస్వామి సర్కారును బలపరీక్షకు ఆదేశించాలని కోరనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలుస్తారు. అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ...

తమిళ రాజకీయాల్లో కీలకంగా మారిన హీరో విశాల్ - HMTV

తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయ్. ప్రతిపక్ష నేత స్టాలిన్‌...గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిసి ప్రభుత్వంపై అవిశ్వాసానికి అవకాశమివ్వాలని కోరారు. అయితే స్టాలిన్ వినతిని...విద్యాసాగర్‌రావు సున్నితంగా తిరస్కరించారు. తమిళ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయ్‌. ప్రతిపక్ష నేత స్టాలిన్...ఏకంగా గవర్నర్‌ విద్యాసాగర్‌రావునే టార్గెట్ చేశారు.

డీఎంకేకు షాక్... వారంతా అన్నాడీఎంకేలోనే ఉన్నారంటున్న గవర్నర్ - వెబ్ దునియా

తమిళనాడులోని ప్రధాన విపక్ష పార్టీ డీఎంకేకు ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తేరుకోలేని షాకిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రభుత్వానికి అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేదనీ, అందువల్ల విశ్వాస పరీక్ష చేపట్టాలని కోరుతూ డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో గవర్నర్ సీహెచ్ ...

పళనికి మోదం... డీఎంకేకు ఖేదం... విశ్వాస పరీక్ష లేదని గవర్నర్ స్పష్టీకరణ - ap7am (బ్లాగు)

తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రభుత్వానికి సరిపడా మద్దతు లేదని, తక్షణం విశ్వాస పరీక్ష చేపట్టాలని కోరుతూ డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిశారు. ఈ సందర్భంగా వారి డిమాండ్‌ ను గవర్నర్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అనిశ్చితికి ...

దినకరన్‌కు గవర్నర్ షాక్..! - ఆంధ్రజ్యోతి

చెన్నై(ఆంధ్రజ్యోతి): తమిళనాట పళని స్వామి ప్రభుత్వానికి గొప్ప ఊరట లభించింది. పళని ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష నిర్వహించాలన్న విపక్షాల డిమాండ్‌ను ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావ్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అనిశ్చితికి కారణమైన 19 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనే ఉన్నారని, వారెవరూ వేరే పార్టీలోకి వెళ్లిపోలేదని, ...

రాజకీయాలా?: గవర్నర్ విద్యాసాగర్ రావుపై స్టాలిన్ తీవ్ర విమర్శ - Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గవర్నర్ విద్యాసాగర్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం వెనుక కేంద్రం హస్తముందని మరోసారి ఆరోపించారు. బుధవారం విపక్ష ...

దినకరన్‌కు తమిళనాడు గవర్నర్ షాక్..! - ఆంధ్రజ్యోతి

చెన్నై: ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని, తక్షణం గవర్నర్ ఈ దిశగా ఆదేశాలివ్వాలని కోరుతున్న అన్నాడీఎంకే తిరుగుబాటు నేత దినకరన్‌కు చుక్కెదురైంది. 19 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ద్వారా దినకరన్ రిసార్ట్‌ రాజకీయం నడుపుతున్నారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ విద్యాసాగర్ రావును ...

గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌పై స్టాలిన్ తీవ్ర ఆరోప‌ణ‌లు.. - ప్రజాశక్తి

చెన్నై: తమిళనాడు గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు తలెత్తిన రాజకీయ సంక్షోభం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. విపక్ష పార్టీలతో పాటు ఆయన బుధవారం గవర్నర్‌ను కలిశారు. సీఎం ...

సీఎం పళనిసామికి రిలీఫ్: దినకరన్ ఎమ్మెల్యేలకు గవర్నర్ ఝలక్: ప్రతిపక్షాలకు షాక్ ! - Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో రెబల్ రాజకీయాలు చెయ్యాలనుకుంటున్న టీటీవీ దినకరన్ కు ఆ రాష్ట్ర గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ ఝలక్ ఇచ్చారు. దినకరన్ వర్గంలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకే పార్టీలోనే ఉన్నారని సీహెచ్. విద్యాసాగర్ రావ్ చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం ...

దినకరన్‌ వర్గానికి గవర్నర్‌ ఝలక్‌! - సాక్షి

సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం ఇంకా ప్రకంపలను రేపుతూనే ఉంది. దాదాపు 20మందికిపైగా దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతలు గురువారం మరోసారి గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిశారు. వెంటనే ...