సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి ప్రతీకారం - సాక్షి

కోల్‌కతా: సుప్రీం కోర్టుకు, కలకతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు మధ్య జరుగుతున్న న్యాయపోరాటం కొనసాగుతోంది. జస్టిస్‌ కర్ణన్‌కు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించగా.. ఆయన కూడా ఏడుగురు జడ్జిలపై ఇలాంటి ఆదేశాలే జారీ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. సుప్రీం కోర్టు ...

ఆయనకు వైద్య పరీక్షలు చేయండి: సుప్రీం సంచలనం, కర్ణన్ కౌంటర్ అటాక్ - Oneindia Telugu

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం.. ఆయన మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

కోల్‌కతా : దళితుడినైందుకే నాపై కక్ష సాధింపు : జస్టిస్‌ కర్నన్‌ - Andhraprabha Daily

justice-karnan దళితుడిని అయినందుకే తనపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్నన్‌ అన్నారు. జస్టిస్‌ కర్నన్‌ మానసిక ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంపై ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చట్టం ముందు నిలబడదని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టుపై జస్టిస్‌ కర్ణన్‌ ఆగ్రహం - సాక్షి

కోల్‌కతా: సుప్రీంకోర్టుపై వివాదాస్పద కలకత్తా హైకోర్టు జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మానసిక స్థితిని పరీక్షించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. మానసికంగా తాను బలహీనుడ్ని కాదని కర్ణన్‌ చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన ...

న్యూఢిల్లి : జస్టిస్‌ కర్నన్‌ మానసిక స్థితి పరీక్షకు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసిన ... - Andhraprabha Daily

Supreme_Court_of_India_-_Central_Wing కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్నన్‌ మానసిక స్థితిని పరీక్షించడానికి మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 5వ తేదీన జస్టిస్‌ కర్నన్‌కు పరీక్షలు నిర్వహించి, మే 8వ తేదీలోగా నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాలలో పేర్కొంది. జస్టిస్‌ కర్నన్‌ను వైద్యపరీక్షకు ...

జస్టీస్‌ కర్ణన్‌కు వైద్య పరీక్షలు! - సాక్షి

న్యూఢిల్లీ: వివాదాస్పద కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయించింది. మే 5లోగా వైద్య పరీక్షలు నిర్వహించి.. 8వ తేదీ కల్లా కర్ణన్‌ మానసిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సోమవారం సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెడికల్‌ ...

8 మంది సుప్రీం న్యాయమూర్తులపై విదేశీ ప్రయాణాలు నిషేధం - ప్రజాశక్తి

కోల్‌కతా : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఎనిమిది మంది న్యాయమూర్తులను ఉద్దేశించి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 8 మందిని విదేశీ ప్రయాణాలకు అనుమతించొద్దని న్యూఢిల్లీలోని ఎయిర్‌ కంట్రోల్‌ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా, ఆ ...