హార్వీ హరికేన్‌ బాధితుల కోసం ఇండియన్‌ అమెరికన్‌ డాక్టర్ల సహాయ నిధి - ప్రజాశక్తి

వాషింగ్టన్‌ : అమెరికా రాష్ట్రమైన టెక్సాస్‌లో హార్వీ హరికేన్‌ కారణంగా సంభవించిన వరద బాధితుల కోసం ఇండియన్‌ అమెరికన్‌ డాక్టర్లు సహాయ నిధిని ప్రారంభించారు. భారీ ఈదురు గాలులు, ఆకస్మికంగా సంభవించిన వరదలతో టెక్సాస్‌ రాష్ట్రం తీవ్రంగా విధ్వంసానికి గురైందని, ఈ ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయని, ఈ విషాద సమయంలో ...

తెలుగువారిని ఆర్థికంగా దెబ్బతీసిన హరికేన్ హార్వే - Samayam Telugu

హరికేన్ హార్వే కారణంగా అమెరికా టెక్సాస్ రాష్టంలో హూస్టన్‌ని ముంచెత్తిన వరదలు అక్కడ వుంటున్న తెలుగువారిని ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఉన్నత విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన తెలుగువారు అధిక సంఖ్యలో గ్రేటర్ హూస్టన్‌లోనే వున్నారు. కేటీ, షుగర్‌ల్యాండ్. సిప్రెస్, బెల్లైర్ వంటి ప్రాంతాల్లో సుమారు 10,000 తెలుగు కుటుంబాలు ...

హరికేన్ ధాటికి సిటీలే సముద్రాలయ్యాయి.. - ఆంధ్రజ్యోతి

అమెరికా: భారీ వర్షాలకు టెక్సాస్‌ రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. హరికేన్ హార్వే ప్రభావంతో టెక్సాస్‌లోని పలు పట్టణాలు సముద్రాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కొన్ని సెకన్లలోనే హరికేన్ హార్వే బీభత్సం సృష్టించింది. వరదలతో పోర్ట్ ఆర్థర్ సిటీలో 55000 ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. టెక్సాస్ ...

మునిగిన టెక్సాస్‌..కూలిన బతుకులు... - ఆంధ్రజ్యోతి

టెక్సాస్: హరికేన్ హార్వే ప్రభావం అమెరికాపై విపరీతంగా పడుతోంది. ఒక్క టెక్సాస్ రాష్ట్రంలోనే వరదలు, బీకర గాలులకు 30 మంది మరణించారు. చమురు బావి నుంచి ఆయిల్ లీక్ కావడంతో అది సముద్రంలో కలుస్తోంది. టెక్సాస్‌లో సైన్యం రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టింది. కోటిన్నరమందిపై హార్వే తుపాన్ ప్రభావం చూపించింది. వేలాదిమంది గాయపడ్డారు.

పదివేల కుటుంబాలకు హార్వీ పరేషాన్‌ - సాక్షి

హౌస్టన్‌: అమెరికాలోని హూస్టన్‌ను అతలాకుతలం చేసిన హరికేన్‌ హార్వీ అక్కడి తెలుగు వారికీ తీరని విషాదం మిగిల్చింది. హూస్టన్‌ ప్రాంతంలో పలు తెలుగు కుటుంబాలు నివసిస్తుండగా, వారి ఇళ్లు దెబ్బతినడం ఇతరత్రా పెద్దమొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రేటర్‌ హూస్టన్‌ పరిథిలో తెలుగు కుటుంబాలకు హార్వీతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ తరహా ప్రకృతి ...

నిన్న టెక్సాస్‌... నేడు లూసియానా - Telugu Times (పత్రికా ప్రకటన)

టెక్సాస్‌ రాష్ట్రాన్ని నిన్నటిదాకా కుండపోత వర్షాలతో ముంచెత్తిన హార్వే హరికేన్‌ బుధవారం మరోసారి లూసియానా రాష్ట్రంపై తన ప్రతాపాన్ని చూపించింది. అయిదు రోజుల క్రితం హోస్టన్‌ నగరానికి దగ్గర్లో తీరాన్ని దాటిన తర్వాత హార్వే హరికేన్‌ సముద్రం వైపు మళ్లినప్పటికీ బుధవారం తిరిగి లూసియానా రాష్ట్రంలోని కామెరాన్‌ వద్ద తీరాన్ని దాటిందని నేషనల్‌ ...

హార్వే హరికేన్‌... 31కి చేరిన మృతులు - ప్రజాశక్తి

హ్యూస్టన్‌: హార్వే తుపాను కారణంగా అతలాకుతలమైన అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది కనిపించకుండా పోయారు. వరదల కారణంగా వీధులు, జాతీయ రహదారులు చెరువులను తలపించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా ...

హార్వే నష్టం.. రూ.3లక్షల కోట్లు - ప్రజాశక్తి

పారిస్‌: ఎడతెరిపిలేని వర్షాలు.. వరదలు.. దీనికి తోడు బలమైన గాలులు.. నదులను తలపిస్తున్న రోడ్లు.. నీటమునిగిన భవనాలు.. ఇది గత ఐదురోజులుగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్ర ప్రజల పరిస్థితి. టెక్సాస్‌ రాష్ట్రాన్ని హార్వే హరికేన్‌ వణికిస్తోంది. హార్వే ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌, దాని పరిసర ప్రాంతాలు సముద్రాలను ...

ఇంకా ప్రమాద ఘంటికలే: గంటకు 72కి.మీ వేగంతో.. మరోసారి తీరం దాటిన హార్వీ - Oneindia Telugu

హోస్టన్: అమెరికా టెక్సాస్‌లో హర్రీకేన్ హార్వీ తుఫాన్ ఎఫెక్ట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వర్షాల జోరు తగ్గకపోవడం.. గురువారానికల్లా 150సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. బిక్కుబిక్కుమంటూ: ఇద్దరి పరిస్థితి విషమం, హర్రీకేన్ బాధితులకు తానా, ఆటా ఆపన్నహస్తం. తుఫాన్ ప్రభావంతో బుధవారం నాటికి ...

అమెరికాను వణికిస్తున్న హార్వే తుఫాన్ - HMTV

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో...హార్వే తుఫాన్‌ హర్రర్ సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదు కావడంతో....40వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయ్. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరో 24గంటలు వర్షాలు కురిసే అవకాశముండటంతో....సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌...వరద పరిస్థితిపై సమీక్షించారు. అమెరికాను ...

టెక్సాస్‌ గజగజ - ఆంధ్రజ్యోతి

హ్యూస్టన్‌, ఆగస్టు 30: అమెరికా చరిత్రలోనే అత్యంత విధ్వంసక తుఫాన్‌-హార్వే విలయ తాండవంతో టెక్సాస్‌ అతలాకుతలమైంది. క్షణక్షణం భయం భయంగా గడుపుతోంది. హార్వే ప్రభావంతో టెక్సాస్‌, హ్యూస్టన్‌ సహా పలు ప్రాంతాలు వరుసగా అయిదో రోజూ వర్ష బీభత్సం కొనసాగడంతో గజగజ వణికిపోయాయి. మృతుల సంఖ్య 30కి చేరగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

'హార్వీ'పై ట్రంప్‌ సమీక్ష తుఫాన్‌ల్లో 30 మంది మరణం - ప్రజాశక్తి

హోస్టన్‌: హార్వీ హరికేన్‌ ప్రభావంతో చిన్నాభిన్నమైన హోస్టన్‌, టెక్సాస్‌ ప్రాంతాలను అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ మంగళవారం సందర్శించారు. హరికేన్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ట్రంప్‌ అక్కడి బాధితులను పరామర్శించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. దాదాపు నాలుగు రోజులపాటు హోస్టన్‌ నగరాన్ని గడగడలాడించిన హార్వీ హరికేన్‌ దెబ్బకు ...

తెరపినివ్వని 'హార్వీ' - సాక్షి

హూస్టన్‌: గత ఐదురోజులుగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను హార్వీ మరింత విధ్వంసకరంగా మారుతోంది. బుధవారం నాటికి తుపాను సంబంధిత కారణాలతో మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. వారిలో ఓ భారతీయ విద్యార్థి కూడా ఉన్నాడు. గురువారానికల్లా 150 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు ...

హార్వే తుపాను బీభత్సం: 20మంది మృతి - ప్రజాశక్తి

అమెరికా: హార్వే తుపాను అమెరికాను వణికిస్తోంది. టెక్సాస్‌, హ్యూస్టన్‌ సహా పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో అక్కడి రోడ్లు నదులను తలపిస్తూ పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లు నీటమునగడంతో అక్కడి ప్రజలు కష్టాలు వర్ణనాతీతం. ఈ ప్రకృతి విలయ ధాటికి ...

టెక్సాస్‌లో హెరికేన్‌ బీభత్సం.. - Telugu Times (పత్రికా ప్రకటన)

గడిచిన 50 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో చుట్టుముట్టిన హార్వే హెరికేన్‌ ధాటికి టెక్సాస్‌ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అమెరికాలోనే నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్‌ ఇంకా నీటిలోనే నానుతోంది. శుక్రవారం తుపాను తీరం దాటగా, ఇప్పటికీ వర్షం విరామం లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో హూస్టన్‌ సహా పటు పట్టణాలు, కంట్రీల్లో జనజీవనం దాదాపుగా ...

హార్వే పెను తుపాను భీభత్సానికి 20 మంది మృతి - ప్రజాశక్తి

టెక్సాస్‌, లూసియానాలలో హార్వే పెను తుపాన్‌ భీభత్సాన్ని సృష్టిస్తోంది. తుపాన్‌ ధాటికి 20 మంది మరణించారని అధికారులు చెప్పారు. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. టెక్సాస్‌లో రహదారులన్నీ నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. టెక్సాస్‌లో పలు చోట్ల మళ్లిస మరొకసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

టెక్సాస్ వాసులను హడలెత్తిస్తున్న హార్వే - ఆంధ్రజ్యోతి

అమెరికా: టెక్సాస్‌లో హరికేన్ హార్వే బీభత్సం సృష్టిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా కుండపోతగా వర్షాలు కురిశాయి. సహాయకచర్యలు చేపట్టడానికి భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. మరోవైపు అతిభారీ వర్షాలు కురవనున్నాయని జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. వాతావరణం తెరిపిస్తే 30వేల మందిని శిబిరాలకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

హ్యూస్టన్‌ను వణికించిన హరికేన్ హార్వీ - HMTV

హరికేన్ హార్వీ అమెరికా చరిత్రలోనే అత్యంత విధ్వంసాన్ని సృష్టిస్తోంది. హార్వీ పెను తుపాను టెక్సాస్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. జల విలయం కారణంగా ఇప్పటికి పది మంది చనిపోయారు. టెక్సాస్ రాజధాని హ్యూస్టన్ లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు టెక్సాస్ లో 60 సెంటీమీటర్ల వర్షం కురియవచ్చని వాతావరణ సంస్థ హెచ్చరించింది.

హూస్టన్‌ వణికింది - సాక్షి

హూస్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత విధ్వంసకర తుపానుల్లో ఒకటిగా నిలుస్తున్న హార్వీ టెక్సాస్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. హార్వీ తుపాను సంబంధిత కారణాలతో ఇప్పటికే 10 మంది మరణించారు. ఓ వ్యాన్‌ వరదలో మునిగిపోవడంతో అందులోని ఆరుగురు మరణించారు. వారిలో నలుగురు చిన్నారులున్నారు. అమెరికాలో నాలుగవ అతిపెద్దది, టెక్సాస్‌లో అత్యంత ...