కాబూల్‌లో భారీ పేలుడు - ప్రజాశక్తి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నగరంలోని భారత దౌత్య కార్యాలయ సమీపంలో బుధవారం సంభవించిన భారీ పేలుడులో కనీసం 80 మంది మరణించారని, దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వున్నట్లు తెలిపింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు వున్నారని ...

భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు! - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాంబు పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడులో భారతీయ ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు. కానీ ఈ పేలుడులో పెద్ద ఎత్తున 65 మంది ప్రాణాలు విడిచినట్టు అఫ్ఘాన్‌ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 325మంది గాయపడ్డారని తెలిపింది. భారత రాయబార ...

కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటన - Oneindia Telugu

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. 80మంది దాకా మృత్యువాత పడ్డ ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు పేలుళ్లకు పాల్పడిందెవరు? అన్నదానిపై స్పష్టత లేకపోగా.. తాజాగా ఈ పనిచేసింది తామేనని ప్రకటించింది ఐసిస్. కాబూల్ లో భారత్ ...

కెమెరాకు చిక్కిన కాబూల్ పేలుడు దృశ్యాలు - Mana Telangana (బ్లాగు)

కాబూల్: ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌లో సంభవించిన కారు బాంబు పేలుడులో సుమారు 80 మంది చనిపోగా, 300 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన పేలుడు దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్నాయి. జాన్‌బాగ్ స్కేర్‌లో సంభవించిన పేలుడులో తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అధిక తీవ్రతతో బాంబు పేలడంతోనే ...

ఆ పేలుడు భూకంపం అనుకున్నారు.. - Namasthe Telangana

కాబూల్: ఈ ఏడాది ఆఫ్ఘ‌నిస్తాన్‌లో జ‌రిగిన పేలుళ్ల‌లో ఇవాళ జ‌రిగిన కాబూల్ పేలుడే అత్యంత శ‌క్తివంత‌మైంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సిటీకి ఎక్క‌డో దూరంలో ఉన్న వాళ్లు కూడా కాబూల్ పేలుడుకు షాక్ అయ్యారు. పేలుడు తీవ్ర‌త ఎంత‌గా ఉందంటే, స్థానికులు కొంద‌రు ఆ పేలుడు తీవ్ర‌త‌ను భూకంపంగా భావించారు. బాంబు పేలుడుకు ముందు భూ ప్ర‌కంప‌నలు భారీగా ...

కాబూల్ పేలుడు.. ఇదే వీడియో.. - Namasthe Telangana

కాబూల్ : కాబూల్‌లో కారు బాంబు పేలిన వీడియో చూస్తే నిజంగా ఆ పేలుడు తీవ్ర‌త‌కు షాక్ కావాల్సిందే. ఆత్మాహుతి దాడి వ‌ల్ల సుమారు 80 మంది మృతిచెందారు. మ‌రో 300 మంది గాయ‌ప‌డ్డారు. జాన్‌బాగ్ స్క్వేర్‌లో జ‌రిగిన పేలుడు ఓ వీడియోకు చిక్కింది. చాలా దూరం నుంచి ఆ వీడియోను షూట్ చేశారు.

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులు - వెబ్ దునియా

బుధవారం ఉదయం కాబూల్ లోని జంబఖ్ స్క్వేర్ వద్ద జర్మనీ దౌత్య కార్యాలయానికి సమీపాన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటన తీవ్రతతో వందల మీటర్ల దూరంలోనున్న భవంతుల తలుపులను కిటికీలను బద్దలు చేస్తూ అందులోని ప్రజలను గాయపరిచింది. పేలుడు సంభవించిన చోటు ...

కాబూల్‌లో భారీ పేలుడు, 80 మంది మృతి - T News (పత్రికా ప్రకటన)

ఆఫ్ఘనిస్థాన్‌ లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కాబూల్ లోని విదేశీ రాయబారుల కార్యాలయాలే లక్ష్యంగా కారు బాంబుతో దాడి చేసి 80 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ పేలుడులో మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ...

కాబూల్‌లో భారీ పేలుడు... భారతీయులు క్షేమం - ఆంధ్రజ్యోతి

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను బుధవారం ఉదయం భారీ పేలుడు కుదిపేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. శక్తిమంతమైన పేలుడు సంభవించడంతో ఈ ప్రాంతంలో ఉన్న దౌత్య కార్యాలయాల భవనాల అద్దాలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు ...

కాబూల్ లో ఎంబిసి వద్ద బాంబు పేలుడు - Mana Telangana (బ్లాగు)

ఆఫ్ఘనిస్తాన్: కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద బుధవారం ఉదయం కారుబాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రాయబార కార్యాలయ సిబ్బంది మాత్రం క్షేమంగా ఉన్నారు. భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం భారత రాయబార కార్యాలయాన్ని ...

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి…50 మందికి గాయాలు - Andhraprabha Daily

logo-41 కాబూల్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. భారత దౌత్య కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో జరిగిన ఈ పేలుడు ధాటికి దౌత్య కార్యాలయం కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి సుష్‌మా స్వరాజ్‌ మాట్లాడుతూ కాబూల్‌లో భారత దౌత్య కార్యాలయ సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని ...

కాబూల్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ ద‌గ్గ‌ర భారీ పేలుడు! - Namasthe Telangana

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ఇండియ‌న్ ఎంబసీ ద‌గ్గ‌ర భారీ పేలుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 90 మంది చ‌నిపోగా.. 350 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఇండియ‌న్ ఎంబ‌సీకి 1.5 కిలోమీట‌ర్ల దూరంలో జ‌రిగిన ఈ పేలుడు ధాటికి ఎంబ‌సీ కిటికీలు, డోర్లు ధ్వంస‌మ‌య్యాయి. అయితే ఎంబ‌సీలోని అధికారులంతా క్షేమంగానే ఉన్న‌ట్లు భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ వెల్ల‌డించారు. అయితే ...