15 మంది భారతీయుల ఉరిశిక్ష రద్దు - ప్రజాశక్తి

కువైట్‌ జైళ్లలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న 15 మంది భారతీయుల శిక్షను కువైట్‌ రాజు రద్దు చేశారు. వారి శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. దీంతో పాటు జైళ్లలో మగ్గుతున్న మరో 119 మంది భారతీయుల శిక్షను తగ్గింపునకు రాజు ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ట్విటర్‌ ...

భారతీయ నేరస్తుల పట్ల దయ చూపిన కువైట్.. కృతజ్ఞతలు తెలిపిన సుష్మ! - ap7am (బ్లాగు)

గల్ఫ్ దేశం కువైట్ లో షరియత్ చట్టాలు చాలా కఠినంగా అమలవుతాయి. మరణ శిక్షలు పడినవారికి క్షమాభిక్షలను ప్రసాదించడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయులకు మరణశిక్షను రద్దు చేయడం సంచలనంగా మారింది. వీరందరికీ క్షమాభిక్షను ప్రసాదిస్తూ, మరణశిక్షలను జీవితఖైదుగా మార్చారు. ఈ మేరకు కువైట్ రాజు జాబర్ అల్ సబా ఉత్తర్వులు జారీ చేశారు.

15 మంది భారతీయులకు ఉరిశిక్షలు రద్దు - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ : షరియత్‌ చట్టాలు కఠినంగా అమలయ్యే అరబిక్‌ దేశం కువైట్‌లో క్షమాభిక్ష అరుదైన మాట. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షల నుంచి క్షమాభిక్షను ప్రసాదించడం సంచలనంగా మారింది. మరణశిక్షలను జీవితఖైదుగా మారుస్తూ కువైత్‌ రాజు జాబర్‌ అల్‌ సబా ఉత్తర్వులు జారీచేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ...