సీఎం కేసీఆర్ తో కేకే భేటీ - సాక్షి

హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై నియమించిన హైపవర్ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ కు ఆయన నివేదిక సమర్పించారు. కొత్తగా జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను లాంఛనంగా ...

హైపవర్ కమిటీ రిపోర్టులు రెడీ.. మధ్యాహ్నాం కేసీఆర్ చెంతకు - Oneindia Telugu

హైదరాబాద్ : కొత్త జిల్లాల సంఖ్య 27 నుంచి 31 పెరిగిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగు జిల్లాలకు సంబంధించి ఈ కమిటీ నివేదికలు సమర్పించనుంది. ఏయే మండలాలను, రెవెన్యూ డివిజన్లను ఏయే జిల్లాల పరిధిలోకి తీసుకురావాలనే విషయమై ఈ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

మరికాసేపట్లో సీఎంకు 'హైపవర్' నివేదిక - సాక్షి

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు కేకే నివాసంలో శుక్రవారం హైపవర్ కమిటీ భేటీ అయింది. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ ఇప్పటికే పరిశీలించింది. సదరు జిల్లాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులతో కేకే అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజలు ...

4 జిల్లాలకే హైపవర్‌: కేకే - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతిపాదిత నాలుగు జిల్లాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను మాత్రమే హైపవర్‌ కమిటీ సమీక్షిస్తుందని కమిటీ చైర్మన్ కె.కేశవరావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌, జనగాంలకు చెందిన వారే ఫిర్యాదులు, వినతులు, సలహాలు ఇవ్వాలని అన్నారు. గత రెండు రోజులుగా ...

ముగిసిన హైపవర్ కమిటీ సమావేశాలు - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సిరిసిల్ల, జనగామ, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేతృత్వంలో వేసిన హైపవర్ కమిటీ సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఆరో తేదీలోపు వీటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుని ఏడున నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. మూడు ...

నేటితో హైపవర్‌ కమిటీ గడువు ముగుస్తుంది: కేకే - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: నేటితో హైపవర్‌ కమిటీ గడువు ముగుస్తుందని కేకే అన్నారు. నివేదికను రేపు సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని కేకే తెలిపారు. జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌, గద్వాల జిల్లాలపైనే హైపవర్ కమిటీ అధ్యయనం చేసిందని కేకే చెప్పారు. ఇతర జిల్లాలు, మండలాల నుంచి విజ్ఞప్తులను కమిటీ పరిగణనలోకి తీసుకోదని కేకే అన్నారు. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు ...

నాలుగు జిల్లాల కోసమే హైపవర్ కమిటీ: పోచారం - Namasthe Telangana

హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు కాబోయే అన్ని జిల్లాలకు సంబంధించి హైపవర్ కమిటీకి సంబంధంలేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. హైపవర్ కమిటీ గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ఇప్పటికే సీఎం ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు. హైపవర్ కమిటీ కేవలం నాలుగు ...

31కి మించవ్‌ ! - Andhraprabha Daily

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం ముసా యిదాలో ఇదివరకే ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు హైపవర్‌ కమిటీ పరిశీలనలో ఉన్న మరో నాలుగు జిల్లాలు మినహా కొత్త ప్రతిపాదనలకు ఆస్కారం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలకు మించి ఉండ కూడదన్న ఆలోచనతో ప్రభుత్వం ముంద డుగు వేస్తుందని ...

విన్నపాలు వినవలె..! - సాక్షి

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ైెహ పవర్ కమిటీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. మరో ఆరు రోజుల్లో కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న నేపథ్యంలో కూడా కమిటీకి ఇంకా దరఖాస్తులు అందుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న హై పవర్ కమిటీ ఆయన నివాసంలో బుధవారం రెండోరోజూ ...

31జిల్లాలే ఫైనల్ - Namasthe Telangana

-వాటితోనే తుది నోటిఫికేషన్ విడుదల.. తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్. హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగు జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా ప్రతిపాదనను పరిశీలించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. ఈ విషయంలో మరో ఆలోచనకు ఆస్కారం లేదని అన్నారు. జనగామ ...

ఇదే ఫైనల్ - సాక్షి

సాక్షి, హైదరాబాద్: ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగు జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా ప్రతిపాదనను పరిశీలించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించింది.

జిల్లాలతో పాటే పోలీస్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి మించబోదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరించారు. ఇప్పటికే ఉన్న 10 జిల్లాలు, ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు హైపవర్‌ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. కొత్తగా 21 మినహా మరే కొత్త జిల్లా ప్రతిపాదనను ...

31 జిల్లాలకు మించి మరో ఆలోచన లేదు : కేసీఆర్‌ - ప్రజాశక్తి

ముసాయిదాలో ప్రకటించిన 27 కొత్త జిల్లాలతోపాటు హైపవర్‌ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగు జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా ప్రతిపాదననూ పరిశీలించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించింది.

'31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన' - సాక్షి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొత్తం 31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అధికారులు కూడా 31 ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి పెట్టాలని సీఎం అదేశించారు. 31 జిల్లాల ఏర్పాటు కూడా హైవర్‌ కమిటీ నివేదిక ఆధారంగానే జరుగుతుందని అన్నారు. అయితే ముసాయిదాలో ...

ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు: కేకే - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు చేస్తామని కేకే చెప్పారు. హైపవర్ కమిటీకి 630 దరఖాస్తులు వచ్చాయని కేకే అన్నారు. ఈ నెల 6 అర్థరాత్రిలోగా సమగ్రంగా దరఖాస్తులను పరిశీలిస్తామని కేకే తెలిపారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇస్తామని కేకే చెప్పారు. మరికొన్ని జిల్లాల విజ్ఞప్తులు కూడా అందుతున్నాయని ఆయన అన్నారు.

హైపవర్ కమిటీ బిజీ బిజీ - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముసాయిదా నోటిఫికేషన్‌లోని జిల్లాలతోపాటు అదనంగా నాలుగు జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం నెలకొల్పిన హైపవర్ కమిటీ ఈ నెల ఆరో తేదీన (గురువారం) ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయం, పరిపాల నా సౌలభ్యం కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నదని, ...

ఆ 4 జిల్లాలపై 7న నివేదిక - సాక్షి

సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రతిపాదించిన నాలుగు జిల్లాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అయింది. ఎంపీ కేశవరావు నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం ...

ప్రజాభీష్టాన్ని గౌరవిస్తాం: కేకే - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఏం కోరుతున్నారో ప్రభుత్వం అదే చేస్తుందని, ప్రజల కోరిక మేరకే కేసీఆర్‌ మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారని, వాటిపై చర్చించడానికే ప్రత్యేకంగా హై పవర్‌ కమిటీని వేశారని ఆ కమిటీ చైర్మన్‌, ఎంపీ కేశవరావు చెప్పారు. ఆయన నివాసంలో మంగళవారం కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం నుంచి ...

హైదరాబాద్ ను విడగొట్టోద్దు : మంత్రి నాయిని - apdunia (వెటకారం) (పత్రికా ప్రకటన) (సభ్యత్వం) (బ్లాగు)

nayani-narasimharao-apdunia హైదరాబాదు జిల్లాను విడగొట్టవద్దని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన కొత్త జిల్లాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీకి నివేదిక సమర్పించారు. ముఖానికి ముక్కు ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. అలాంటి హైదరాబాదును జిల్లాల పేరుతో ...