వంద‌శాతం పైనే! - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం వెనక్కి వచ్చిన నోట్లు వంద శాతం దాటాయా? అసలైన కరెన్సీతో పాటు దొంగ డబ్బు కూడా బ్యాంకులకు చేరిపోయిందా? రిజర్వు బ్యాంకు వార్షిక నివేదికను పరిశీలించిన అనంతరం పరిశీలకులను ఈ అనుమానాలు వెంటాడుతున్నాయి. ఆర్‌బిఐ అధికారికంగా ప్రకటించిన లెక్కల్లో చోటుచేసుకున్న అనేక అంశాలే ఈ అనుమానాలకు కారణం.

'పెద్ద' అరాచకం - ప్రజాశక్తి

పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) నరేంద్ర మోడీ ప్రభుత్వం మూటకట్టుకున్న వైఫల్యాల్లో అతి పెద్ద వైఫల్యం అని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) బుధవారం బయట పెట్టిన నివేదికలో ఆధారాలతో సహా రుజువైంది. నోట్ల రద్దు ప్రహసనాన్ని బిజెపి ప్రభుత్వ వైఫల్యం అనే కంటే అది దేశ ప్రజలను నమ్మించి చేసిన మోసంగా పేర్కొంటే సముచితంగా ఉంటుంది. నిరుడు నవంబర్‌ ...

డీమానిటైజేషన్‌ నోట్ల లెక్క తేల్చిన ఆర్‌బీఐ - AP News Daily

పెద్ద నోట్ల రద్దు వివరాలపై RBI చేసిన ప్రకటనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశాయి. అయితే విపక్షాలు డీమానిటైజేషన్‌ ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయని ఆర్థిక మంత్రి జైట్లీ కౌంటరిచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వాటా పెరిగిందని వివరించే ప్రయత్నం ...

నోట్ల రద్దు పాచిక: కొండను తవ్వి ఎలుకను బట్టినట్లు.. - Oneindia Telugu

న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీ.. రాత్రి 9 గంటలు! 'నేటి నుంచి పెద్దనోట్లు రద్దు' అని ప్రధాని మోదీ ప్రకటించగానే సామాన్యులు సంబరపడ్డారు. ఇక 'డబ్బున్నోళ్ల పని అయిపోయినట్లే' అని అనుకున్నారు. ఆ డబ్బు ప్రధాని మోదీ తమ జన్‌ధన్‌ ఖాతాల్లో వేస్తారని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. 'పెద్దనోట్ల రద్దు ఒక విఫల ప్రయోగం కానున్నది' అని జాతీయ, ...

పెద్ద నోట్ల రద్దు బిగ్ ఫ్లాప్ - మీడియా వ్యాఖ్య - News Articles by KSR

వెయ్యి ,ఐదువందల రూపాయల నోట్ల రద్దు ప్రబావం, రిజర్వు బ్యాంకు చేసిన ప్రకటన తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.99 శాతం నోట్లు తిరిగి బ్యాంకులలోకి వచ్చాయని ఆర్బిఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. బిజెపి గట్టి మద్దతుదారుగా ఉన్న ఒక ప్రముఖ తెలుగు పత్రిక మాత్రం మొదటి పేజీలో తక్కువ ప్రాదాన్యత ఇచ్చి , లోపల పేజీలలో మాత్రం ...

రద్దయిన నోట్లలో 99% ఆర్‌బీఐ గూటికి - Andhraprabha Daily

ముంబై : రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల చలామణి రద్దు తర్వాత.. రద్దు చేసిన 99 శాతం కరెన్సీ నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వుబ్యాంకు బుధవారం తెలియజేసింది. ఇప్పటి వరకు ప్రతిపక్షం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత మొత్తం కరెన్సీ తిరిగొచ్చిందని ప్రశ్నించడంతో రిజర్వుబ్యాంకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరిగింది.

నోట్ల రద్దు నిష్ఫలం.. ఇలా అయ్యిందేంటి? - Samayam Telugu

​కొండను తవ్వి ఎలుకను పట్టారు, నల్లధనాన్ని అరికడతామని చెప్పి అర్థం లేని పని చేశారు..నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇవ్వాలి... ఇవీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలపై వస్తున్న విమర్శలు. రద్దైన నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి వచ్చాయని రిజర్వ్ ...

'సిగ్గుచేటు' అంటూ ఆర్బీఐని దులిపేసిన చిదంబరం! - ap7am (బ్లాగు)

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆర్బీఐపైనా, ప్రభుత్వంపైనా దుమ్మెత్తి పోశారు. ట్విట్టర్ వేదికగా తూర్పారబట్టారు. నోట్ల రద్దు తర్వాత వెనక్కి వచ్చిన నోట్ల గణాంకాలను భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఒక్కశాతం పెద్ద నోట్లు తప్ప దాదాపు అన్నీ వెనక్కి ...

99 శాతం 1000 నోట్లు వచ్చేశాయి: ఆర్బీఐ ప్రకటన - ap7am (బ్లాగు)

గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మూడు నెలలపాటు పాత నోట్లను తిరిగి ఆర్బీఐకి ఇచ్చేసేందుకు గడువును విధించింది. దీంతో పాత నోట్లు వెల్లువలా బ్యాంకులను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు ఆర్బీఐ రద్దు చేసిన పాత నోట్లపై తొలిసారి వార్షిక నివేదికలో పేర్కొంది. అందులో రద్దయిన ...

ఆర్‌బీఐ సిగ్గుపడాలి - ఆంధ్రజ్యోతి

ఈ ఆర్థికవేతలకు నోబెల్‌ ఇవ్వాలి.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఎద్దేవా; నోట్ల రద్దు జాతి వ్యతిరేక చర్య: సీపీఎం.. ఇదో పెద్ద కుంభకోణం: మమతా బెనర్జీ. న్యూఢిల్లీ, ఆగస్టు 30: రద్దయిన పాత నోట్లలో 1% తిరిగి రాలేదని ఆర్‌బీఐ చేసిన ప్రకటనపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బుధవారం ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెలుపు చేయడానికే మోదీ ప్రభుత్వం ...

కుంభకోణం లేదంటారా!? - ఆంధ్రజ్యోతి

డిసెంబర్‌ 31 గడువు ముగిసిన తర్వాత కూడా పెద్ద మొత్తంలోనే రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయి ఉంటాయన్న అనుమానాలు ఉన్నాయి. కరెన్సీ నోట్లను బ్యాంకులో జమచేసినప్పుడు వాటి విలువనే ఖాతాదారుల పద్దులో వేస్తారు. పాత నోటా కొత్త నోటా అన్న వివరాలు ఉండవు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించలేదు కూడా. ప్రజల నుంచి ...

వచ్చింది నల్లధనమే కావచ్చు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, ఆగస్టు 30: రద్దయిన పెద్ద నోట్లలో దాదాపు 99ు మేర మళ్లీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయంటూ ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొనడం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రద్దు ప్రకటన అనంతరం డిపాజిట్‌ అయిన పెద్ద నోట్లలో గణనీయమైన భాగం లెక్కల్లో వెల్లడించని సొమ్ము/నల్లధనం కావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ...

రద్దైన నోట్లలో 99% బ్యాంకుల్లోకి - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రతిపక్షాల నుంచి సామాన్య ప్రజల దాకా.. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న నోట్ల రద్దు వివరాలను ఆర్బీఐ తన 2016-17 వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. 2016 నవంబరు 8 నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా.. వెనక్కి తిరిగి వచ్చిన నోట్ల విలువ రూ.15.28 లక్షల కోట్లు అని పేర్కొంది. అంటే.. ప్రభుత్వానికి ...

నల్లధనంపై తెల్లమొహం..!! - సాక్షి

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రూపంలో భారీగా నల్లధనం పోగుపడిందన్న అంచనాలతో, అవినీతిపరుల వెన్ను విరిచేందుకు నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్‌ అస్త్రం సత్ఫలితాలను ఇచ్చిందా..? అన్న ప్రశ్నకు అవును అనే సమాధానం మాత్రం వినిపించడం లేదు. ఎందుకంటే ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన గణాంకాలు మరోలా ఉన్నాయి మరి. గతేడాది నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 ...

ఆ నోట్లు 99% తిరిగొచ్చాయి! - సాక్షి

ముంబై: అవినీతి, నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమైన నోట్ల రద్దు తదనంతర ఫలితాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99% బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 15.44 లక్షల కోట్ల విలువైన ...

పెద్దనోట్ల రద్దు అట్టర్‌ ప్లాప్‌ - JANAM SAKSHI

ముంబై,,ఆగష్టు 30,(జనంసాక్షి): రద్దయిన నోట్లలో దాదాపు 99 శాతం తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంక్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మోడీ సర్కార్‌ రద్దు చేసిన మొత్తం 15.44 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లలో 15.28 లక్షల కోట్లు తిరిగి వచ్చాయని అందులో పేర్కొంది. రద్దయిన నోట్లలో 8900 కోట్ల విలువైన వెయ్యి నోట్లు మాత్రమే రాలేదని స్పష్టం ...

పెద్దనోట్లన్నీ తిరిగొచ్చాయ్‌ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో నల్లధనానికి నూకలు చెల్లినట్లేనని గతేడాది మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది మాసాల అనంతరం ఆర్‌బిఐ వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకులకు చేరి చట్టబద్ధమయ్యాయని ఆర్‌బిఐ నివేదిక స్పష్టంచేసింది. ఈ వార్షిక నివేదిక ప్రకారం మొత్తం రూ.15.44 లక్షల కోట్ల విలువైన ...

నగదు లావాదేవీలను తగ్గించేందుకే పెద్దనోట్ల రద్దు - T News (పత్రికా ప్రకటన)

దేశంలో భారీ మొత్తంలో జరుగుతున్న నగదు లావాదేవీలను తగ్గించడమే డిమానిటైజేషన్ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు 17 శాతం తగ్గాయని చెప్పారు. ఇక, ఎన్నికల్లో నల్లధనాన్ని నిరోధించడమే తమ తదుపరి లక్ష్యం అన్నారు. డిమానిటైజేషన్‌ తర్వాత డిపాజిట్‌ అయిన నోట్ల గణాంకాలపై ఆర్బీఐ ...

నోట్ల లెక్క తేలింది.. ఒక్క పర్సెంట్ తప్పితే - Tolivelugu (పత్రికా ప్రకటన)

ఇన్నాళ్లు రద్దయిన పెద్ద నోట్ల లెక్క వివరాలపై నాన్చుతూ వచ్చిన రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆ లెక్క తేల్చింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ అయినట్టు తెలిపింది. కేవలం 1.3 శాతం వెయ్యి రూపాయిల నోట్ల మాత్రమే వెనక్కి రాలేదని తెలిపింది. ఈ నోట్లకు సంబంధించిన వివరాలతో కూడిన 2016-17 వార్షిక నివేదికను ఆర్‌బీఐ విడుదల చేసింది. రూ.15.28 లక్షల ...