ముఖ్య కథనాలు

Post Title

భారీకాయురాలు.. ఎమ్మాన్‌ మృతి - సాక్షి

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత భారీకాయంతో రికార్డులకు ఎక్కిన ఎమ్మాన్‌ అహ్మద్‌ అబూదాబిలోని బుర్జీల్‌ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందారు. తన 37వ బర్త్‌డే వేడుకలను పూర్తి చేసుకున్న వారానికే ఆమె మృతి చెందారు. ఎమ్మాన్‌ మృతిని బుర్జీల్‌ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. కిడ్నీలు పనిచేయకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో ...

Post Title

అన్ని ఆస్తులా?: అధికారుల మైండ్ బ్లాంక్.. టౌన్ ప్లానింగ్ అధికారుల ఇళ్లపై ఏసీబీ ... - Oneindia Telugu

విజయవాడ: ఏపీ కంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న రఘుపై అవినీతి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడి చేశారు. విశాఖ, విజయవాడల్లోని ఆయన నివాసాలతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు చేశారు. దీంతో రఘుకు బినామీలు ఉన్నట్లు తేలింది. అందులో టౌన్ ప్లానింగ్ ...

Post Title

మమతకు షాక్: టీఎంసీకి కీలక నేత ముకుల్ గుడ్‌బై, బీజేపీలోకే..? - Oneindia Telugu

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ముకుల్‌ రాయ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ స్థానంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు.

Post Title

కాఫీ డే యజమాని వద్ద రూ.650కోట్లు - ప్రజాశక్తి

బెంగళూరు: ప్రముఖ వ్యాపార సంస్థ కేఫ్‌ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ నివాసం, కార్యాలయాలపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో రూ.650కోట్ల మేరకు అక్రమాస్తులను గుర్తించారు. ఈ విషయాన్ని ఐటీశాఖ సోమవారం వెల్లడించింది. గత గురువారం నుంచి బెంగళూరు, హసన్‌, చిక్‌మగలూర్‌, చెన్నై, ముంబైలలో సిద్ధార్థకు చెందిన 25 ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

Post Title

పాములు రైతును పగబట్టాయి.. ఏకంగా 34సార్లు కాటేశాయి.. - వెబ్ దునియా

పాములు ఆ రైతును పగబట్టాయి. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 34 సార్లు నాగుపాములు అతనిని కరిచాయి. 2002 జూన్ నుంచి 2017 మే 29వరకు మొత్తం 34సార్లు అతనిని నాగుపాములు కాటేశాయి. అవి వేసిన కాట్లు ఆయన కాళ్లు, చేతులపై ముద్రల్లా నిలిచాయి. నాగుపాములు కాటేస్తున్న విషయంపై వైద్యులకు అనుమానం రాగా.. నాగుపాము కాటేసిన ప్రతిసారి నోరు, ...

సచివాలయానికి వెళ్లం: ఉద్యోగులు - సాక్షి

సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఉద్యోగులంతా కలిసి తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే బస్సు నాన్‌స్టాప్ సర్వీస్ పేరుతో నడుపుతూ ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ ...ఇంకా మరిన్ని »

Post Title

'నాన్నా' అంటూ వచ్చి! రూ.7.30లక్షలు కాజేసింది, అసలేం జరిగిందంటే.? - Oneindia Telugu

పశ్చిమగోదావరి: కన్న కూతురునంటూ వచ్చి తన తండ్రిని ఘోరంగా నమ్మించి మోసం చేసింది ఓ యువతి. ఏం చేయాలో తెలియని ఆ తండ్రి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద రూ.7.30లక్షలు కాజేసిందని వాపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుక్కునూరులో రెండెకరాలు.. Related Videos · సర్వేలు వాస్తవాలైతే 04:14 · సర్వేలు ...

Post Title

చాక్లెట్ ఫ్యాక్ట‌రీలో భారీ ప్ర‌మాదం.. - ప్రజాశక్తి

హైదరాబాద్‌: నగరంలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో బాయిలర్‌ పేలి భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. కాటేదాన్‌లోని చాక్లెట్స్ తయారు చేసే ఎస్‌ఏ ఫుడ్ కంపెనీలో సోమవారం ఉదయం బాయిలర్ పేలింది. ఈ సంఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కారన్ అనే కార్మికుడు మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న‌ పోలీసులు సంఘ‌ట‌నా స్ధ‌లాన్ని ...

Post Title

సీమలోనే పుట్టావా?: జగన్‌పై ఏపీ మంత్రుల విమర్శల దాడి - Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రులు, నేతలు విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రైతులకు సాగు, తాగునీరు అందిస్తుంటే... ఏపీ సీఎం చంద్రబాబు దొంగతనం చేస్తున్నారని జగన్‌ తన పత్రికలో పేర్కొనడం దారుణమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. సీమలోనే పుట్టారా?

Post Title

పాక్ లో అణ్వాయుధాల తయారీ, 9 చోట్ల స్థావరాలు, చైనా సహకారం? పసిగట్టిన అమెరికా! - Oneindia Telugu

పాకిస్తాన్‌ ఒకవైపు ఉత్తరకొరియా దుందుడు చర్యలతో అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాలు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ కూడా ఉత్తరకొరియా బాటలోనే ప్రయాణిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. పాకిస్తాన్ మరో ఉత్తర కొరియా కానుందా? రహస్యంగా తెలియకుండా అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందా?

Post Title

ఆ మూడు దేశాలకు షాకిచ్చిన ట్రంప్ - ఆంధ్రజ్యోతి

వాషింగ్టన్: అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధిత జాబితాలోకి మరిన్ని దేశాలను చేర్చారు. ఉత్తర కొరియా, వెనెజులా, చాద్ దేశాల పౌరులపై తాజాగా నిషేధాజ్ఞలు జారీ చేశారు. గతంలో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై నిషేధాజ్ఞలు ఉండేవి. వాటి నుంచి సూడాన్‌ను తొలగించి ... మూడు కొత్త దేశాల జాబితాను చేర్చారు. దీంతో నిషేధిత ...

Post Title

'అమ్మ' మరణం చుట్టూ రాజకీయం.. పెనుదుమారం రేపుతున్న మంత్రి ప్రకటన - ఆంధ్రజ్యోతి

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సందేహాలకు ఆజ్యం పోస్తూ అటవీశాఖ మంత్రి దిండుగల్‌ శీనివాసన్‌ చేసిన ప్రకటనలు రాష్ట్రంలో పెనుదుమారం రేపుతున్నాయి. అనారోగ్యంతో జయ ఆస్పత్రిపాలైన తరువాత ఆమెను చూసేందుకు ఎవ్వరినీ అనుమతించలేదని, ఆ సమయంలో జయలలిత ఆరోగ్యం గురించి తాము చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని మూడ్రోజుల క్రితం ...

Post Title

మూడెకరాలు-మృత్యు కౌగిలి: ఉసురు తీసిందెవరు?, బలైపోయిన శ్రీనివాస్.. - Oneindia Telugu

హైదరాబాద్/కరీంనగర్: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రకటనలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఆచరణలో చూపించడం లేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ ఇచ్చినా.. అందులోను ఎమ్మెల్యేల జోక్యంతో అర్హులకు అన్యాయం జరుగుతుండటం కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవం. కేసీఆర్‌కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై ...

Post Title

గౌలిగూడ బస్టాండ్‌.. గతమే! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : అర్ధచంద్రాకారం.. రేకులతో నిర్మించిన విశాల ప్రాంగణం.. చూడగానే ఆకట్టుకునే రూపం.. అదేనండి.. ఒకప్పుడు పట్నం బస్టాండ్‌గా వెలుగువెలిగిన గౌలిగూడలోని ఆర్టీసీ పాత బస్టాండ్‌.. నిజాం కాలంలో నిర్మితమై ఇప్పటికీ సేవలందిస్తున్న 8 దశాబ్దాల నాటి ఈ అపురూప కట్టడం మరికొద్ది రోజుల్లో అదృశ్యం కాబోతోంది. పెరిగిన ట్రాఫిక్‌ అవసరాలకు ...

Post Title

హీరో మహేష్ బాబు రాజకీయ ప్రవేశం ఖాయమా?.. వారిద్దరూ అంతే... - వెబ్ దునియా

హీరో మహేష్ బాబు రాజకీయ ప్రవేశం చేయడం ఖాయమా? అవుననే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. తమిళ హీరో విజయకాంత్, మెగాస్టార్ చిరంజీవిలే ఇందుకు మంచి ఉదాహరణ అని అంటున్నారు. దీనికి ఓ బలమైన కారణాన్ని చెపుతున్నారు. తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్. ఈయన దర్శకత్వంలో నటించిన హీరో ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేయాల్సిందేనని అంటున్నారు.

Post Title

టోల్‌ప్లాజా వద్ద కత్తితో ఎస్సైపై దాడి - సాక్షి

సాక్షి, ఒంగోలు : దోపిడీ దొంగలు ఒంగోలు జిల్లాలో భీభత్సం సృష్టించారు. సోమవారం ఉదయం మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద దోపిడీకి పాల్పడ్డారు. లారీలను ఆపి వారిని బెదిరిస్తుండగా.. ఓ లారీడ్రైవర్ ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరావు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్సైపై కూడా దొంగలు దాడి చేశారు. కత్తితో ఆయన్ను ...ఇంకా మరిన్ని »

Post Title

కాగ్ తదుపరి అధిపతిగా రాజీవ్ మెహరిషి.. ఈరోజే బాధ్యతల స్వీకారం - Oneindia Telugu

ఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) తదుపరి అధిపతిగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహరిషి(62) నియమితులుకానున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో శశికాంత్ శర్మ కొనసాగారు. రాజీవ్ మెహర్షి 1978 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి గత నెలలో పదవీవిరమణ పొందిన ఆయనను ప్రభుత్వం కాగ్ ...

Post Title

ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, దిశానిర్దేశం చేయనున్న మోడీ - Oneindia Telugu

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, పలువురు సీనియర్ నేతలతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగాలు, జీడీపీ అంశాలతో పాటు.. పార్టీ యంత్రాంగం ...

Post Title

నివురుగప్పిన నిప్పులా కన్నపుకుంట - సాక్షి

డోన్‌ టౌన్‌ : మండల పరిధిలోని కన్నపుకుంట గ్రామంలో కులవివక్ష బుçసలు కొడుతోంది. ఐదు నెలల క్రితం గ్రామంలో జరిగిన చిన్నసంఘటనకు కొందరు రాజకీయ రంగు పులమడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన గ్రామంలో నెలకొంది. ఒక వివాహ వేడుక సందర్భంగా దళిత యువకుడు గ్రామంలోని మద్దిలేటిస్వామి గుడి మెట్లెక్కి కొబ్బరికాయ కొట్టడంతో వివాదం మొదలైంది.

Post Title

కశ్మీర్‌ అంశపై భారత్‌కు పాక్ సవాల్! - Samayam Telugu

ఐక్యరాజ్యసమితి వేదికగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి పాకిస్థాన్‌పై విరుచుకుపడిన విషయం తెలిసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్థానేనని, ఆ దేశం మానవ హక్కులకు విఘాతం కలిగిస్తోందని సుష్మా స్వరాజ్ శనివారం దుయ్యబట్టారు. అయితే దీనిపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుష్మా ప్రసంగాన్ని ...

Post Title

'అమెరికా బాంబు కన్నా పదిరెట్లు పెద్దది' - ఆంధ్రజ్యోతి

వాషింగ్టన్: ఉత్తరకొరియాను తక్కువగా అంచనా వేయడం పెద్ద తప్పవుతుందని అమెరికా ఇంటలిజెన్స్ హెచ్చరిస్తోంది. తాజా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగ ప్రకటనతో ఉత్తరకొరియా మరోసారి ఉద్రిక్తలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఇంటలిజెన్స్ ఆరోపించింది. జపాన్‌పై రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా వేసిన అణుబాంబు కన్నా పెద్దదైన హైడ్రోజన్ ...ఇంకా మరిన్ని »

Post Title

వ్యాపారంలో నష్టం, విషం సేవించి ఏడుగురి ఆత్మహత్య, ఉమ్మడి కుటంబంలో విషాదం ! - Oneindia Telugu

చెన్నై: అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ఏడుగురు విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని మదురై నగరంలో జరిగింది. వ్యాపారాల్లో నష్టం రావడంతో చీటీల డబ్బు దారి మళ్లించిన ఆ కుటుంబ సభ్యులు సామూహికంగా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. మదురై నగరంలోని యాగప్పనగర్ లో కురింజి కుమరన్, వేలుమురుగన్ అనే సోదరులు నివాసం ...

Post Title

బాలికను గర్భవతిని చేసి.. అబార్షన్‌! - సాక్షి

బెల్లంపల్లి(మంచిర్యాల): బాలికను గర్భవతిని చేసిన యువకుడు పెళ్లి మాటకొచ్చేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేస్తామని చెప్పి సదరు యువకుడి తల్లిదండ్రులు అబార్షన్‌ చేయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు, అతడి తల్లిదండ్రులపై నిర్భయ, అత్యాచారం కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ...

Post Title

స్నేహితులతో కలిసి ఫిన్లాండ్ లో బయటకు వెళ్లిన టెక్కీ, బీచ్ లో శవమై కనిపించాడు ! - Oneindia Telugu

చెన్నై: చెన్నైకి చెందిన హరిసుతన్ (26) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఫిన్లాండ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన హరిసుతన్ గత కొన్ని రోజులుగా మాయం అయ్యాడు. స్థానిక పోలీసులు అతని కోసం గాలించగా సముంద్ర తీరంలో శవమై కనిపించాడు. ఫిన్లాండ్ లోని టీసీఎస్ కంపెనీలో గత సంవత్సరం నుంచి హరిసుతన్ సాఫ్ట్ వేర్ ...

Post Title

అభ్యంతరం చెప్పలేదు: పాండ్యా బ్యాటింగ్ ప్రమోషన్‌పై కోహ్లీ - Oneindia Telugu

హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను నాలుగో స్థానం క్రీజులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పాండ్యాను నాలుగో స్ధానంలో పంపాలన్న ఆలోచన టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం అన్నాడు. 'పాండ్యాను నాలుగో స్థానంలో పంపుదామన్న ...

Post Title

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి - Namasthe Telangana

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి స్టేషన్ పరిధిలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ...

Post Title

కొత్త రూల్: హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ - Samayam Telugu

హెల్మెట్ పెట్టుకుని బైకులు నడిపేవారికి మాత్రమే బంకుల్లో పెట్రోల్‌ పోయాలనే నిబంధనను త్వరలో అమల్లోకి తీసుకొస్తున్నట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. ఆదివారం విజయవాడలో జరిగిన సమభావనా మిత్రమండలి సమావేశంలో పాల్గొన్న సవాంగ్.. హెల్మెట్ ఆవశ్యకత, తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో పోలీసులు ...

Post Title

వైజాగ్‌, విజయవాడలో ఏసీబీ సోదాలు - సాక్షి

సాక్షి, విశాఖపట‍్టణం : ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన నగరాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం సోదాలు చేసింది. విశాఖపట‍్టణం టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఎన్ వీ రఘు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు తాము రంగంలోకి దిగినట్లు అధికారులు చెబుతున్నారు. రఘు బంధువుల ...

Post Title

చంద్రబాబూ! కేసీఆర్‌ను చూసి నేర్చుకో: యార్లగడ్డ ఆగ్రహం - Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ వరకు తెలుగు భాష తప్పనిసరి విషయంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును చూసి నేర్చుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.

Post Title

మునిసిపల్ కమిషనర్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి - ఆంధ్రజ్యోతి

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లెందు మునిసిపల్ కమిషనర్ పై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంఘటన వెలుగుచూసింది. నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అయితే... వీటిని మునిసిపల్ సిబ్బంది తొలగించారు. కమిషనర్ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగించారని ఆరోపిస్తూ పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కమిషనర్‌తో ...